»   » టీవీ ఆర్టిస్టు దీప్తి మృతి... పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం తేలింది?

టీవీ ఆర్టిస్టు దీప్తి మృతి... పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం తేలింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బుల్లితెర నటి దీప్తి అలియాస్‌ రామలక్ష్మి(31)ది ఆత్మహత్యేనని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఫతేనగర్‌లోని డ్రీమ్స్‌ స్టూడియంలో నివాసం ఉంటున్న దీప్తి శుక్రవారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

ఆదివారం పోస్టుమార్టం నివేదికలోని ప్రాథమిక సమాచారం కోసం వైద్యులను సంప్రదించగా ఆత్మహత్యగా పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. కాగా వారం క్రితం దీప్తి తణుకులోని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. తాను ఇక్కడ ఉండలేకపోతున్నానని, అక్కడికే వచ్చేస్తానని చెప్పినట్లు సమాచారం. వారు కూడా స్వస్థలానికి వచ్చేయాలని సూచించారు. ఇంతలోనే ఈ సంఘటన జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...

బుల్లితెర, చలనచిత్ర నటి దీప్తి అలియాస్‌ రామలక్ష్మి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఫతేనగర్‌లో ఆమె నివాసముంటున్న డ్రీమ్స్‌ స్టూడియోలో ఈ ఘటన చోటుచేసుకుంది. సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ హరిశ్చంద్రారెడ్డి కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దీప్తి అలియాస్‌ రామలక్ష్మి(31)కి విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతీయుడైన పెయింటర్‌ శంకర్‌తో వివాహమైంది. ఓ కుమార్తె ఉంది.

TV artist Deepthi committed suicide in Hyderabad

సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌ వచ్చిన దీప్తి.. ఆహ్వానం, ఆడదే ఆధారం, లక్కీ లక్ష్మి తదితర సీరియళ్లతో పాటు పెళ్లామా-ప్రియురాలా, కొత్తొక వింత, జోగిని సినిమాల్లో నటించింది. 'తాళి' సీరియల్‌కు నిర్మాతగా వ్యవహరిస్తోంది. భర్తతో విభేదాల కారణంగా దీప్తి నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. ఫతేనగర్‌లోని ఆర్‌.డి.కాంప్లెక్స్‌లో ఓగది అద్దెకు తీసుకుని డ్రీమ్స్‌ స్టూడియో ఏర్పాటు చేసి నటన, వ్యాఖ్యానం, నృత్యంలో శిక్షణ ఇస్తుండేది.

బుల్లితెర దర్శకుడైన రమేష్‌కుమార్‌తో అక్కడే సహజీవనం చేస్తోంది. శుక్రవారం దీప్తి, రమేష్‌ ఇద్దరూ బయటకు వెళ్లి రాత్రి 9 గంటలకు తిరిగొచ్చారు. ఆ తర్వాత తాను బయటికి వెళ్లి 11 గంటల సమయంలో ఇంటికొచ్చినట్లు రమేష్‌ చెబుతున్నాడు.

దీప్తి తలుపు తీయకపోవడంతో తాను బాల్కనీలోని వెనుకవైపున్న పడకగది వద్దకు వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చీరతో వేలాడుతూ కనిపించిందని, కిటికీ పగలగొట్టి వెళ్లి మృతదేహాన్ని కిందకు దించినట్లు చెబుతున్నాడు.దీప్తిది ఆత్మహత్యా, హత్యా దర్యాప్తుచేస్తామని పోలీసులుతెలిపారు.

English summary
Television Actress Deepthi alias Rama Lakshmi (30) died under suspicious circumstances on Saturday.
Please Wait while comments are loading...