Don't Miss!
- News
ఒకే గుడిలో ముగ్గురు స్టార్ డైరెక్టర్ల ప్రత్యేక పూజలు
- Finance
d-sib: సురక్షిత బ్యాంకు కోసం చూస్తున్నారా.. RBI సూచించింది ఇదే..
- Sports
INDvsNZ : ఇదేంట్రా అయ్యా?.. ఇన్ని గాయాలా?.. యువ ఓపెనర్‌పై సెలెక్టర్లు సీరియస్!
- Lifestyle
Chanakya Niti: ఈ తప్పుల వల్ల లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Karthika Deepam చచ్చేలోపు నీకు నరకం చూపిస్తా.. దీపకు మోనిత వార్నింగ్
తన అనారోగ్యం గురించి హిమకు లేనిపోనివి చెప్పడంతో ఆగ్రహించిన దీప.. మోనితకు గుణపాఠం చెప్పేందుకు ప్రయత్నించింది. మోనిత నిద్ర పోతుంటే బెడ్‌తో సహా తీసుకొచ్చి రోడ్డుపైన పెట్టింది. నిద్రలేచే సరికి రోడ్డుపైన ఉండటంతో మోనిత కంగారు పడింది. కళ్లు తెరిచి చూసే సరికి ఎదురుగా దీప ఉండటంతో మరింత కంగారుపడింది. నీ అంతు చూస్తానని దీప హెచ్చరించింది. నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్తీక్ నీ వాడు కాదు. నేను బతికి ఉన్నంత వరకు నీ నీడను కూడా డాక్టర్ బాబు వరకు చేరనివ్వను అంటే.. నీవు చచ్చే ముందు సంతోషంగా చావు.
నీవు చచ్చిపోయిన తర్వాత కార్తీక్ శాంతంగా ఉండాలంటే.. అతడితో పెళ్లి చేయి అంటే.. నా చచ్చిపోయే ముందు అలాంటి ప్రయత్నం జరగదు. డాక్టర్ సంతోషంగా ఉండేలా చూస్తాను అని దీప అంటే.. కార్తీక్‌కు పెళ్లి చేస్తావా? అని మోనిత అంటే.. ఒకవేళ అవసరమైతే చేస్తాను. కానీ నీకు మాత్రం కార్తీక్‌కు దక్కకుండా చేస్తాను. అవసరమైతే నిన్ను చంపి నేను చస్తాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే.. నీవు లేచే వరకు నరకంలో కళ్లు తెరిచేలా చేస్తాను అని మోనితకు దీప స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కార్తీకదీపం సీరియల్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

దీపను కష్టాలు పెట్టడం, కార్తీక్‌ను వెంటాడుతుండటం చూసి స్థానికులంతా తిట్లదండంక మొదలుపెట్టారు. పరాయి మొగుడిని కావాలనుకొంటున్నావా? సిగ్గులేదు. ఇలాంటి ఆడదాన్ని చూడలేదు అని స్థానికులు అనడంతో మోనిత అవమానంగా ఫీలయ్యింది. ఇంట్లోకి వెళ్లి ఊర్లో వారి ముందు నన్ను అవమానిస్తావా? నీవు చచ్చేలోపు నరకం చూపిస్తాను అంటూ మోనిత శపథం చేసింది.
దీపను, కార్తీక్ ఫ్యామిలీకి నరకం చూపించడానికి మోనిత.. హిమను తీసుకెళ్లింది. హిమ కనిపించకుండా పోవడంతో కార్తీక్, దీప వెతకడం ప్రారంభించారు. మోనిత ఇంట్లోనే హిమ ఉంటుందని దీప భావించడంతో అక్కడికి వెళ్లారు. ఇంటికి టులెట్ బోర్డు పెట్టి ఉండటంతో ఎక్కడికి వెళ్లారని ఆందోళన పడ్డారు. మోనితను ఇక సహించలేదు అంటూ దీప అంటే.. హిమను మోనిత ఏమీ చేయదు. హిమను పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తుందని అన్నాడు.

ఇంటి కిటికిలో నుంచి చూస్తూ.. మీ నాన్నను నేను చెప్పిన పని చేయనివ్వదు. నేను చెప్పినట్టు చేస్తే దీప బాగుపడుతుంది. కానీ అలా చేయనివ్వదు అంటూ హిమకు మోనిత నూరిపోసే ప్రయత్నం చేసింది. అయితే తాను ఇంటికి వెళ్లిపోతా. నాకు భయంగా ఉంది. మా అమ్మకు ఏదైనా అవుతుందో ఏమో అంటూ హిమ బాధపడింది. నీవు ఇంటికి వెళ్లకు.. ఇక్కడే ఒక రోజు ఉండు. దాంతో కార్తీక్, దీప ఇద్దరు నేను చెప్పినట్టు చేస్తారు అని మోనిత చెప్పడంతో అయిష్టంగా అక్కడే ఉండిపోయింది.
అయితే హిమ గురించి కార్తీక్, దీప కంగారుపడిపోతుంటే.. హిమ వల్లే ఇదంతా జరుగుతున్నది. అప్పుడు కారు డ్రైవింగ్ చేస్తానని మారం చేయడంతో మీరు దూరం అయ్యారు. ఇప్పుడు మళ్లీ హిమతో కలిసి మీరు దూరమయ్యేలా చేస్తున్నది అంటూ శౌర్య కోపగించుకొన్నది. అంతలోనే దీపకు వారణాసి ఫోన్ చేసి మీరు అనుకొన్నది నిజమే.. మోనిత ఇంట్లోనే హిమ ఉందని చెప్పడంతో ఆందోళన పడ్డారు.