twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam దీపను తుపాకీతో కాల్చిన మోనిత.. కార్తీక్, కన్న బిడ్డల ఎదురుగానే దారుణం!

    |

    దుర్గ చేసే పనులు చూసి నీకు నాపై అనుమానం రావాలని దీప ప్రయత్నిస్తున్నది. దుర్గతోని దీప ఆడిస్తున్న నాటకం ఇది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నన్ను నమ్ము. నాపై అనుమానం కలిగి నీవు నన్ను వదిలేస్తే.. వంటలక్క నిన్ను లాగేసుకోవడానికి ప్రయత్నిస్తున్నది అంటూ మోనిత ప్రాధేయపడింది. ఆ వంటలక్క నన్ను లాగేసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నది.

    నేను నీ భర్తను అయినప్పుడు నీవు ఎందుకు భయపడుతున్నావు అని కార్తీక్ నిలదీస్తే.. పరాయి ఆడది ఒకరి భర్తను లాగేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు.. రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం నాది అని మోనిత చెప్పింది. అయితే నీ భర్తను రక్షించుకోవడానికైతే సరే.. మరీ నీవు వంటలక్కను రెండుసార్లు చంపించేందుకు ప్రయత్నించావు అని కార్తీక్ నిలదీశాడు. కార్తీకదీపం సీరియల్‌ 1518 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

     నాకు తెలియని ఏదో నిజం అంటూ కార్తీక్

    నాకు తెలియని ఏదో నిజం అంటూ కార్తీక్

    నా గతంలో నాకు తెలియని నిజం ఏదో ఉంది. నన్ను లాగేసుకొంటుందని నీవు భయపడుతున్నావు.. గతం గుర్తుకు వస్తే ఏదో జరుగుతుందని వంటలక్క నమ్మకంతో ఉంది అంటూ కార్తీక్ ఘాటుగా స్పందించాడు. నాకు గతం గుర్తుకు రాలేదు. శౌర్య గురించి నీకు తెలుసా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడానికే నేను ఈ హడావిడి చేస్తున్నాను. లేకపోతే ఆరోగ్యం బాగాలేని దీపతో నేను సంగారెడ్డికి వెళ్లేవాడిని అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు.

     నా భర్తకు ఆపరేషన్ చేస్తే..

    నా భర్తకు ఆపరేషన్ చేస్తే..

    ఇక సంగారెడ్డికి చేరిన దీప.. తాను ఉండే ఇంట్లో కార్తీక్ ఫోటోకు దండ వేసి ఉండటం చూసి కలత చెందింది. ఈ ఇంట్లో ఉండేది ఎవరు? ఈ ఫోటోకు పూజలు చేసేది ఎవరు? అని అనుకొంటుండగా.. ఇంట్లోకి ఓ ఆవిడ వచ్చింది. కార్తీక్ ఫోటోను దీప పట్టుకోవడం చూసి..ఆ ఫోటోను ఎందుకు పట్టుకొన్నావు అని అడిగింది. అయితే ఈ ఫోటో ఇక్కడెందుకు పెట్టారు అని అంటే.. మాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడు ఆయన. నా భర్తకు ఆపరేషన్ కార్తీక్ ఆపరేషన్ చేస్తే.. ఆ ఆయన చనిపోయాడు. దాంతో మేము శాపనార్థాలు పెట్టాం. నా భర్త చనిపోయినందుకు బాధ్యతగా తన ఆస్తిని మొత్తం మా పేరున రాసిచ్చారు. ఆయన అనారోగ్యంతో చనిపోయాడని ఓ మాట చెప్పి తప్పించుకోవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. దురదృష్టవశాత్తు ఆయన, ఆయన భార్య కారు ప్రమాదంలో చనిపోయారు అని ఇంటి ఓనర్ చెప్పింది.

    కార్తీక్ చనిపోలేదు.. అంటూ దీప

    కార్తీక్ చనిపోలేదు.. అంటూ దీప

    దాంతో మీరు అనుకొంటున్నట్టు కార్తీక్ చనిపోలేదు. నేను ఆయన భార్యను. మేమిద్దరం బతికే ఉన్నాం అని దీప చెప్పింది. దాంతో మరీ మీరు ఇలాంటి ఇంటిలో ఎందుకు ఉండాలనుకొన్నారు అంటే.. అందంతా పెద్ద కథ... మరోసారి నేను వివరంగా చెబుతాను. ఈ ఊరిలో నా బిడ్డ ఉంది. నా బిడ్డ ఆచూకీ కోసం వచ్చాను అని వంటలక్క చెబితే.. నీ బిడ్డను వెతికించే బాధ్యత నాది. నీవు ఎప్పుడు అడిగినా.. కారు.. డ్రైవర్‌ను పంపిస్తాను. ఇలాగైనా కార్తీక్ రుణం తీర్చుకొంటాను అని ఇంటి యజమాని అన్నారు.

    మోనిత ఏం.. నాటకాలు ఆడుతున్నావే..

    మోనిత ఏం.. నాటకాలు ఆడుతున్నావే..

    ఇంట్లో నుంచి మోనిత హడావిడిగా వెళ్తుంటే.. కార్తీక్ అడ్డగించి.. ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నిస్తే.. ఆమె సంబరపడిపోయింది. నీవు అడుగు.. నీవు అడగాలి.. మన పెళ్లైన కొత్తలో ఇలాగే అడిగేవాడివి. కాదు.. కాదు.. నీవు గతం గుర్తు ఉన్నప్పుడు ఇలానే అడిగే వాడివి.. కాదు.. కాదు.. దీప రాక ముందు ఇలా అడిగే వాడివి. ఇప్పుడు వంటలక్క పోయింది.. కదా. మళ్లీ మామూలుగా అయిపోయావు.

    భార్య, భర్తల మధ్య మూడో మనిషి వస్తే.. ఇలాంటి గొడవలే జరుగుతాయి అని మోనిత అంటే.. ఏం నాటకాలు ఆడుతున్నావే.. అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు. నీవు శౌర్య వద్దకు వెళ్లున్నావా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి నిన్ను అడిగాను.. నీకు శౌర్య తెలుసు అనే విషయం తెలిసిన తర్వాత నా విశ్వరూపం చూస్తావు అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు.

     గతం గుర్తుకు వచ్చింది దుర్గ అంటూ కార్తీక్

    గతం గుర్తుకు వచ్చింది దుర్గ అంటూ కార్తీక్

    మోనిత వెళ్లిపోగానే.. దుర్గ ఇంటికి వచ్చి.. బంగారం అంటూ మోనితను పిలిచాడు. మోనిత ఎక్కడ కనిపించకపోవడంతో తిరిగి వెళ్తుండటంతో.. అరేయ్ దుర్గ అని కార్తీక్ కోపంగా పిలిచాడు. దాంతో ఏంటి.. దుర్గ గారి నుంచి ఓరేయ్ అన్నాడు డాక్టర్ బాబు అని కంగారు పడిపోయాడు. వెంటనే తిరిగి వచ్చి.. నేను మోనిత ఉందని చనువుగా పిలిచాను అంటే.. ఇక నీ డ్రామాలు ఆపు.

    నాకు గతం గుర్తుకు వచ్చింది అని కార్తీక్ చెప్పాడు. దాంతో దుర్గ ఆశ్చర్యపోయాడు. మరీ ఎందుకు సార్.. దీపమ్మకు చెప్పలేదు అని దుర్గ అడిగితే.... నాకు గతం గుర్తుకు వచ్చిందని తెలిస్తే.. దీపను ఏదైనా చేస్తుంది. అంతేకాకుండా శౌర్య గురించి మోనితకు తెలుసు. ఇంద్రుడితో నాటకం ఆడించేది ఆమె అని నా అనుమానం అని కార్తీక్ చెప్పాడు.

    ఇంద్రుడి మోసంతో దీప నిరుత్సాహంగా

    ఇంద్రుడి మోసంతో దీప నిరుత్సాహంగా

    సంగారెడ్డిలో ఇంటింటికి తిరుగుతూ.. శౌర్య ఆచూకీ కోసం ప్రయత్నించింది. అయితే ఎక్కడా శౌర్య గురించి ఆచూకీ లభ్యం కాకపోవడంతో నీరసపడిపోయింది. కళ్తు తిరిగిపడిపోయే సమయానికి శౌర్యకు సంబంధించిన పోస్టర్ ఆమె ముందు పడింది. దాంతో ఆనందంతో.. నేను అనుకొన్నది నిజమే.. సంగారెడ్డిలోనే శౌర్య ఉందనే విషయం నిజమైంది అని ఫోన్ కలిపింది. దాంతో అడ్రస్ చెప్పగానే ఇంటి ఓనర్ కారులో అక్కడికి చేరింది. అయితే ఫోన్ నెంబర్ ఉన్న వ్యక్తి తనకు తెలియదు. నా నెంబర్ ఎవరు పెట్టారో తెలియదు అని చెప్పగానే.. దీప నిరుత్సాహపడింది. ఇంద్రుడు మళ్లీ మోసం చేశాడు అని దీప అంటే.. వాడి గురించి తెలుసు కదా.. వాడి అంతు చూద్దాం అని ఇంటి యజమాని అన్నాడు.

    కార్తీకదీపం తాజా ప్రోమోలో భారీ ట్విస్టు

    కార్తీకదీపం తాజా ప్రోమోలో భారీ ట్విస్టు

    కార్తీకదీపం తాజా ఎపిసోడ్‌లో భారీ ట్విస్టు కనిపించింది. శౌర్య ఆచూకీ తెలుసుకొని.. సౌందర్య, ఆనందరావు, హిమ వచ్చారు. శౌర్య ఇక ఇంటికి రావాల్సిందే అంటూ సౌందర్య వార్నింగ్ ఇచ్చింది. అమ్మ, నాన్న కనిపించందే.. నేను ఇంటికి రాను అని శౌర్య చెప్పింది. అయితే పక్కనే ఉన్న దీప, కార్తీక్ శౌర్య మాటలు అక్కడికి వచ్చారు. తమ కుటుంబం కలుసుకోవడంతో దీప ఆనంద పడింది. ఇక మన కుటుంబాన్ని ఎవరు విడదీయలేరు అంటూ దీప అంటుండగా.. మోనిత తుపాకితో కాల్సి వేసింది. ఈ ట్విస్టు నిజమా? లేక కలనా? అనేది తదుపరి ఎపిసోడ్‌లో క్లారిటీ వస్తుంది.

    English summary
    Karthika Deepam November 24th Episode number 1518.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X