For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam నీవు అంత మొగాడివా? తొడగొట్టి పిలిచి.. దుర్గను అరెస్ట్ చేయించిన మోనిత!

  |

  నానమ్మ సౌందర్య, తాత ఆనందరావుతో హిమ మాట్లాడుతూ.. నేను డాక్టర్ అవుతాను.. హిమ కలెక్టర్ అవుతుంది. మరీ తమ్ముడిని (మోనిత కొడుకు) ఏం చేద్దాం అంటే.. వాడు పెద్దయ్యాక.. వాడు ఏం కావాలనుకొంటే.. అది చేద్దామని తాత అన్నాడు. అయితే మరీ వాడు చదుకోనంటే ఎలా అంటే.. అది తర్వాత ఆలోచిద్దాం లే అంటూ సౌందర్య సర్దిచెప్పింది. ఆ తర్వాత మోనిత కొడుకు పుట్టుకే ప్రశ్నార్థకంగా మారింది.. వాడి భవిష్యత్‌ను ఏం చేద్దాం, కొడుకును వదిలేసి ఆ క్రిమినల్ మోనిత దర్జాగా తిరుగుతుంది. పెరోల్ మీద బయటకు వచ్చి మళ్లీ జైలుకు వెళ్లకుండా పక్క రాష్ట్రానికి వెళ్లిందని అంటే సౌందర్య అంటే.. మనమే కంప్లయింట్ చేసి మోనితను పట్టించవచ్చు కదా అని ఆనందరావు అన్నారు. దాంతో మోనిత అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నది. ఆమెను అరెస్ట్ చేయిస్తే.. తను ఏం చేస్తుందో మనకు తెలియదు. కొద్దిరోజులు ఆగి కంప్లయింట్ చేద్దామని సౌందర్య సూచించింది. కార్తీకదీపం సీరియల్‌లో 1519 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరుగుతున్నదంటే?

  నీవు అంత మొగాడివా? రా..

  నీవు అంత మొగాడివా? రా..

  ఇక మోనిత కొన్ని పేపర్లు ఒకరికి ఇచ్చి.. జాగ్రత్తగా చూసుకో అంటూ ఏదో కుట్రకు తెరలేపింది. ఆ తర్వాత దుర్గకు ఫోన్ చేస్తే.. బంగారం నీకు నూరేళ్లు అని అన్నాడు. నాకు నూరేళ్లే.. నీకే మూడింది అని మోనిత వార్నింగ్ ఇచ్చింది. దాంతో కార్తీక్ ముఖం చూసి.. దీప ఆపడం వల్లే నీవు బతుకుతున్నావు అని దుర్గ అంటే.. నీవు అంత మొగాడివా? రా.. రా. అని మోనిత సవాల్ విసిరింది. దాంతో దుర్గ.. ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్ దుర్గ అని ప్రతీ సవాల్ విసిరారు. అయితే అంత మగాడివా రా. లొకేషన్ పంపుతున్నాను అంటూ మోనిత హుషారుగా సవాల్ విసిరింది. దాంతో నీవు ఎన్ని వేషాలు వేసినా వర్కవుట్ కాదులే అంటూ దుర్గ మనసులో అనుకొన్నాడు.

  నీకు అంతా చావు తెలివితేటలే..

  నీకు అంతా చావు తెలివితేటలే..


  మోనిత పంపిన లొకేషన్‌ వద్దకు దుర్గ చేరగానే.. వచ్చావా? అని మోనిత దీర్ఘాలు తీసింది. దాంతో తొడ గొట్టి పిలిస్తే.. గ్యాంగుతో ఉంటావని అనుకొన్నాను. కానీ ఒక్కదానివే ఉన్నావు అంటే.. నీ సంగతి చూడటానికి గ్యాంగ్ కావాలా? అని మోనిత సెటైర్ వేసింది. దాంతో నువ్వే వేసేద్దామని ప్లాన్ చేశావా? నాకు తెలియకుండా కరాటే.. కుంగ్ ఫూ నేర్చుకొన్నావా అని దుర్గ తనదైన శైలిలో జవాబిచ్చాడు. దాంతో నీలాంటి వాడిని వేయాలంటే.. కండబలం అవసరం లేదు.. బుద్దిబలం ఉంటే చాలూ. అది నా వద్ద బోలేడంత ఉన్నాయి అని మోనిత అంటే.. అవును నీకు ఉన్నవి అన్నీ చావు తెలివితేటలే.. అని దుర్గ సమాధానం ఇచ్చాడు. నీవు ఎంతసేపు బయట ఉంటే.. అంత డేంజర్.. తొందరగా లోపలికి పంపించాలి అని మోనిత అన్నాడు. నీవు ఆల్రెడీ ట్రై చేశావు.. కానీ కార్తీక్ కాపాడాడు అని దుర్గ అన్నాడు.

  నీ అంతు చూస్తా మోనిత

  నీ అంతు చూస్తా మోనిత


  అయితే దుర్గను మోనిత రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. దాంతో నన్ను పోలీసులకు పట్టించాలని ప్రయత్నిస్తే. అంతకు ముందే నిన్ను లోపల పెట్టాలి. నేను హైదరాబాద్‌లో చాలా కేసులు చేశాను. దేనికి సాక్ష్యం లేదు. ఇక్కడ రెండు మూడు కేసులు చేశాను. వాటికి కూడా సాక్ష్యాలు లేవు. పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు అని దుర్గ అంటుంటూ.. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. సార్.. వాడిని తీసుకెళ్లండి అంటూ పోలీసులకు మోనిత చెప్పింది. దాంతో పోలీసులు దుర్గను జీపులోకి తోస్తుండగా.. మోనిత నిన్ను వదలను.. నీ అంతు చూస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు దుర్గను పోలీసులు తీసుకెళ్లుండగా..అక్కడికి వచ్చిన కార్తీక్ .. దుర్గ అడ్డు తొలగించుకొన్నదంటే.. ఇంకా ఏదో ప్లాన్ వేసి ఉంటుంది. దీపను మోనిత నుంచి రక్షించుకోవాలి అంటూ కార్తీక్ వెళ్లిపోయాడు.

  దేవుడా ఏంటీ పరీక్షలు

  దేవుడా ఏంటీ పరీక్షలు


  దుర్గ అరెస్ట్ తర్వాత ఇంటికి వచ్చిన మోనిత ప్లాన్స్ వేస్తూ ఆలోచనల్లో పడింది. దుర్గ ఇక బయటకు రాడు.. దీప సంగారెడ్డికి పోయింది. కార్తీక్ ఒంటరిగా ఉన్నాడు. ఇదే ఛాన్స్.. కార్తీక్‌ను తీసుకొని ఎక్కడికైనా వెళ్లాలి అనుకొంటుండగా.. పనిమనిషి శివ వచ్చి.. కార్తీక్‌‌కు దీప నుంచి కాల్ వచ్చింది. వెంటనే కార్తీక్ వెళ్లిపోయాడు అని శివ చెప్పాడు. దాంతో షాక్‌కు గురైన మోనిత.. సంగారెడ్డిలో శౌర్య కనిపించిందా? ఒకవేళ కనిపించి నాన్న అని పిలిస్తే.. గతం గుర్తుకువస్తుందా?.. ఒక కష్టం తీరిందనుకొనే లోపే.. మరో కష్టాన్ని సమస్యను ముందుకు తెస్తున్నావు. .ఏంటి దేవుడా.. ఈ పరీక్షలు అని మోనిత కంగారుపడిపోయింది.

  దీప.. నేనే నీ భర్త అనుకో..

  దీప.. నేనే నీ భర్త అనుకో..


  ఇక సంగారెడ్డికి వెళ్లిన కార్తీక్.. దీపను కలుసుకొన్నది. శౌర్య అచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ లోపే.. నీరసం రావడంతో.. కింద కూర్చున్నది. దాంతో ఏమైంది.. ఆరోగ్యం బాగానే ఉందా? అంటే.. బాగానే ఉంది.. కానీ నేను ఎందుకు బతికానా అనిపిస్తున్నది. నేను ఇంకా ఎవరి కోసం బతకాలి అంటే.. నా గతం ఏమిటో నాకు తెలియదు. కానీ వర్తమానం తెలుసు. కావాలంటే.. నన్నే నీ భర్తగా అనుకో అని కార్తీక్ అనగానే.. దీప ఎమోషనల్ అయింది.

  English summary
  Karthika Deepam November 25th Episode number 1519.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X