Elimination: సంజన గల్రానీ ఎలిమినేషన్‌లో ట్విస్ట్.. ఇక బిగ్‌బాస్ ఇంట్లో రణరంగమేనా?
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ రంజుగా సాగుతూ నాలుగో వారంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నది. అయితే ఈ సీజన్ ఎత్తులు వేయడానికి.. చదరంగం కాదు.. రణరంగం అంటూ హోస్ట్ నాగార్జున ఈ ఫార్మాట్ గురించి చెబుతూనే ఉన్నాడు. అయితే ఇంటి సభ్యుల మధ్య ఫిట్టింగ్ పెట్టి నిజంగానే ఈ షోను రణరంగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ షోలో రణరంగాన్ని సృష్టించి టాప్ కంటెస్టెంట్ సంజనా గల్రానీనీ మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి ఇంటి నుంచి పంపించే ప్లాన్ చేసేశాడు. అయితే సంజనా ఎలిమినేషన్‌లో అసలైన ట్విస్ట్ ఏమిటంటే?
బిగ్‌బాస్ ఇంటిలోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా దివ్య నిఖిత రణరంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఆమె ఎంట్రీ తర్వాత ఇంటి సభ్యులతో బిగ్‌బాస్ మాట్లాడుతూ.. చదరంగంలో పావులు కదిపి దివ్యకు తక్కువ ఓట్లు వేశారు. కానీ ఈ రణరంగంలోకి రాకుండా చేశారు. కానీ ఆమెను ఇంటిలోకి రావడానికి ఛాన్స్ దక్కింది అంటూ అన్నారు. అయితే ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇంటి సభ్యులపై ఆమె అభిప్రాయాలను సేకరించారు.

దివ్య నిఖిత ఇంటిలోకి రాగానే.. ఇంటి సభ్యుల ఆటతీరు, ప్రవర్తన ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వమని అడిగారు. దాంతో అందరి ఆటగాళ్లు తమ నంబర్ ఫలానా అంటూ కేటాయించుకొంటే.. ఆమె తన అభిప్రాయం ద్వారా ఇంటి సభ్యుల ర్యాంకింగ్‌ను నిర్ణయించారు. అలా టాప్ 5 కంటెస్టెంట్లు ఇచ్చిన ఓట్ల ఆధారంగా సంజనాను మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు. దాంతో ఇంటి సభ్యుల ఓటింగ్ ద్వారా సంజనాను ఇంటి నుంచి బయటకు పంపించారు.
అయితే సంజనా గల్రానీ ఎలిమినేషన్ విషయంలో అసలు ట్విస్టు అక్కడే ఉంది. అయితే ఎప్పుడూ కూడా ఇంటి సభ్యుల ఓటింగ్ ద్వారా కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేయరు. ప్రజలు చేసే ఓటింగ్ ద్వారానే ఎలిమినేట్ చేస్తారు. అయితే మెయిన్ గేట్ ద్వారా ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె.. శనివారం ఎపిసోడ్‌లో నాగ్‌తో కలిసి వేదికపైన కనిపిస్తారు. అయితే ఆమెను ప్రాపర్ ఎలిమినేషన్ ప్రక్రియను ఫినిష్ చేసి ఇంటి నుంచి బయటకు పంపిస్తారు.
అయితే ఆమెను వేదిక మీద నుంచి 99 శాతం సీక్రెట్ రూమ్‌కు పంపిస్తారు. ఆమెను సీక్రెట్ రూమ్‌లో పెట్టి రెండు రోజుల్లో మళ్లీ ఇంట్లోకి పంపించే ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. అయితే వేదిక మీద నుంచి ఇంటి సభ్యుల మీద చేసిన కామెంట్స్‌పై ఇంట్లో రచ్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఇంటి సభ్యులు తనపై చేసే కామెంట్స్ కూడా సీరియస్‌గా మారే ఛాన్స్ ఉంది. దాంతో ఆట రంజుగా మారడానిిక అవకాశం ఏర్పడుతుంది.


Click it and Unblock the Notifications











