twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam తాను తవ్వుకొన్న గోతిలో తానే పడ్డ మోనిత.. కార్తీక్‌ అనుమానాలకు బలంగా..!

    |

    కార్తీకదీపం సీరియల్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. అయితే ఇబ్బందుల్లో పడిన తన కాపురాన్ని చక్కదిద్దమని బతుకమ్మను పేర్చి మొక్కుకొన్నది. అయితే డాక్టర్ తల్లి.. నీకు అంతా మంచే జరుగుతుంది అని భరోసానిచ్చింది. అయితే బతుకమ్మ వేడుకల్లో మోనిత తన సన్నిహితురాలితో కలిసి పాలుపంచుకొన్నది. ఈ వేడుకల్లో దీప కనిపించకపోవడంపై మోనిత తన స్నేహితురాలితో చర్చ పెట్టింది. అయితే గతంలో అవమానిస్తే.. బాధపడింది. కానీ ఈ రోజుల్లో చాలా ధీమాగా కనిపిస్తున్నది అని మోనిత అంటే.. అయితే తిట్లు తిని తిని దీపకు అలవాటైందేమో అని స్నేహితురాలు అంటే.. లేదు... ఏదో గట్టిగా నిర్ణయం తీసుకొని వచ్చి ఉంటుంది. నాకు లోపల ఏదో భయంగా ఉంది అని మోనిత కంగారు పడితే.. నీవు భయపడకు.. నేను ఈసారి మరింత గట్టిగా ఇస్తాను అని మోనితకు స్నేహితురాలు భరోసా ఇచ్చింది. కార్తీకదీపం సీరియల్ 1479 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

    మోనిత, దుర్గ బంధంపై అనుమానం

    మోనిత, దుర్గ బంధంపై అనుమానం


    దుర్గకు చిక్‌మంగళూరు డాక్టర్ ఎదురుపడ్డాడు. కార్తీక్‌ను తీసుకొని మోనిత బతుకమ్మ ఆడేందుకు ఇటువైపు వచ్చిందట..మీకు కనిపించిందా? అని దుర్గా అడిగాడు. అంతేకాకుండా ఈసారి నా దెబ్బకు తట్టుకోకుండా కార్తీక్‌ను వదిలేసి మోనిత వెళ్లిపోవాలి అంటూ అక్కడి నుంచి బయలుదేరారు. కార్తీక్‌తోపాటు మోనిత బతుకమ్మను ఎత్తుకొని వెళ్తుంటే.. దుర్గ ఎదురుపడ్డారు. హల్లో మోనిత.. హల్లో డాక్టర్ సాబ్ అంటూ పలకరించారు. దుర్గను చూడగానే.. మోనిత, దుర్గ బంధంపై అనుమానం వచ్చి ఆమె చేతిని వదలించుకొన్నాడు.

    వీడు ఇక్కడ కూడా తగలబడ్డాడా?

    వీడు ఇక్కడ కూడా తగలబడ్డాడా?


    ఇక మోనితతో దుర్గ మాట్లాడుతూ.. అన్యాయం.. మన ఇద్దరం కలిసి వద్దామని చెప్పి.. కార్తీక్‌తో వస్తావా? అని దుర్గ అన్నాడు. దాంతో వీడు ఇక్కడ కూడా తగలబడ్డాడా? అని మనసులో అనుకొన్నది. అయితే మీరు వస్తున్నట్టు నాకు తెలియదు అంటూ దుర్గకు కార్తీక్ సమాధానం చెప్పాడు. దాంతో ఏంటి మోనిత.. నీవు చెప్పలేదా? ఇంతదూరం బైక్‌పై వచ్చే సరికి ఒళ్లు హూనం అయ్యింది అని దుర్గ అన్నాడు. దాంతో ఇక ఆపు.. నేను ఎప్పుడు చెప్పాను నీకు అని మోనిత అంటే.. బతుకమ్మ పండుగ.. పాత అనుభూతులు చాలా ఉన్నాయి. కలిసి గుర్తు చేసుకొందామని చెప్పావుగా.. అని దుర్గ అన్నాడు. దాంతో అహా.. అలాగా.. మీ ఇద్దరు కలిసి పాత అనుభూతులు గుర్తు చేసుకోండి అని కార్తీక్ వెళ్లపోయాడు.

    మీరు ఇద్దరు కలిసి తిరుగుతుంటే..

    మీరు ఇద్దరు కలిసి తిరుగుతుంటే..


    కార్తీక్ వెళ్లబోతుంటే.. మోనిత.. ఆపి.. ఇది నీ ఊరా? ఇక్కడేం పని అంటే.. ఓ గ్రామస్తుడు వచ్చి.. దుర్గ ఎలా ఉన్నావు.. అని పలకరించాడు. ఆ తర్వాత ఇది నా పుట్టిన ఊరు.. కార్తీక్‌కు అబద్దం ఎలా చెబుతావు అని అంటే.. అంతలోనే మరో వ్యక్తి వచ్చి.. మోనిత ఒక్కతే వచ్చింది.. నీవు రాలేదని అనుకొన్నా.. నీవు వచ్చేశావు. .మీరు ఇద్దరు కలిసి తిరుగుతుంటే.. అలవాటు అయిపోంది. ఒక్కరే తిరిగితే ఎదోలా ఉంది.. అని అన్నాడు. దాంతో కార్తీక్ చేయి విదిలించుకొని మోనితను అక్కడే వదిలిపోయాడు.

    నేను భార్యను కాదని చెప్పి

    నేను భార్యను కాదని చెప్పి


    కార్తీక్ వెళ్లిపోగానే.. ఏందిరా.. ఇది నీ ఊరారా? మనిద్దరం కాలువ గట్టుమీద ఆటలాడుకొన్నట్టు చెబుతున్నావు అని మోనిత అంటే.. నీవు నేర్పిన విద్యే కదా.. ఈ ఊరిలో దీపమ్మను నీవు ఇలానే అనుమానించావు కదా.. ఆమె ఎంత బాధపడి ఉంటుంది.. ఇలా కాదు కానీ.. నీవు నేరు కార్తీక్ వద్దకు వెళ్లి.. నేను భార్యను కాదని చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపో.. నీకు ఎలాంటి టార్చర్ ఉండదు అని దుర్గ అన్నాడు. అయితే కార్తీక్ భార్యను నేనే.. దీపకు ఏ హక్కులేదు.. ఇదే మాట ఆమెకు చెప్పి తీసుకెళ్లు అని మోనిత దబాయించింది. దాంతో నీకు టైమ్ దగ్గరపడింది. నీకు తగిన బుద్ది చెబుతా.. నీవు మళ్లీ దీపమ్మ, కార్తీక్ సార్ వైపు చూడకుండా.. కరెక్ట్‌గా ఇస్తా..వస్తా.. గట్టిగా ఇస్తా అంటూ దుర్గ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు.

    ఆదిత్య పేరు వినగానే..

    ఆదిత్య పేరు వినగానే..


    దుర్గ వార్నింగ్ ఇచ్చిన తర్వాత మోనిత కార్తీక్‌ను వెతుక్కొంటూ వెళ్లింది. దుర్గ చెప్పిన మాటలు గుర్తు చేసుకొంటూ కంగారుపడిపోయాడు. అంతలోనే శివ రావడంతో ఆదిత్య అని పిలిచాడు. ఆ పేరు ఎక్కడో విన్నానే విషయం గుర్తుకు వచ్చింది. మనసులో లీలగా ఏదో బోర్డు కనిపించింది. అయితే విషయాన్ని శివకు చెబుతూ.. ఆదిత్య అంటూ మీ మేడమ్ ఎప్పుడైనా ఈ పేరు చెప్పిందా? ఈ పేరుకు నాకు ఏదో కనెక్షన్ ఉందనిపిస్తున్నది. మీ మేడమ్ నాకు ఏమీ చెప్పడం లేదు. నాకు పిచ్చి ఎక్కుతున్నది అని తలపట్టుకొని బాధపడ్డారు. బతుకమ్మ ఆడే చోటుకు కార్తీక్ చేరుకొన్నాడు. అంతలోనే దీప బతుకమ్మను పట్టుకొని అక్కడకు వచ్చింది. అయితే దీపను మరోసారి అవమానించేందుకు మోనిత, దీప ప్లాన్ వేసుకొన్నారు.

    గ్రామ పెద్ద మోనితకు షాక్

    గ్రామ పెద్ద మోనితకు షాక్


    ఊరిపెద్ద రాజేశ్వరికి మోనిత స్నేహితురాలు ఫిర్యాదు చేస్తూ.. ఆమె ఉంది కదా.. పెద్ద టక్కులమారి అని అంటే.. ఆమెనా అంటూ రాజేశ్వరి అడిగింది. దాంతో అవును. ఆమె మొగుడిని వదిలేసి.. మోనిత మొగుడిని వలవేసి.. కాపురంలో నిప్పులు పోయాలని చూస్తున్నది అని మోనిత స్నేహితురాలు అంది. అయితే దీప అలాంటిది కాదు.. మా అబ్బాయితో కలిసి మా ఇంటికి వచ్చింది. మా అబ్బాయికి ఆమె దేవుడిచ్చిన చెల్లెలు అని గ్రామపెద్ద రాజేశ్వరి చెప్పింది. అయితే మా మాట కూడా విను అని మోనిత అంటే.. నాకు ఏమీ చెప్పవద్దు. నిన్ను ఈ ఊరిలో చూడలేదు. ఆమెను కూడా చూడలేదు. మీ ఇద్దరిది ఈ ఊరుకానప్పుడు.. ఈ కథకు నీకు ఏమి సంబంధం. నలుగురు మనుషులను పెట్టి.. నాలుగు మాటలు చెబితే నమ్మాలా? కథ నీవు సృష్టించావు. నిజాలను కప్పి పుచ్చాలని ప్రయత్నిస్తున్నావు అని రాజేశ్వరి అంటే.. నీవు ఊరిలో ఉండటం లేదు కదా..నీకు ఏమీ తెలియదు అని మోనిత స్నేహితురాలు అంటే.. ఊర్లో జరిగే విషయాలు నాకు అన్ని తెలుసు. ఇలాంటి అబద్దాలను వెనుకేసుకొని వచ్చి ఊరి పరువు తీయకు అని రాజేశ్వరి వార్నింగ్ ఇచ్చింది.

    English summary
    Twist October 10th Episode number 1479 in Karthika Deepam serial: Mounita get insulted at Batukamma celebrations
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X