twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam మోనిత కుట్రలను తెలుసుకొన్న కార్తీక్.. ట్యాబ్లెట్ల గుట్టురట్టు!

    |

    మోనిత చేయించిన దాడిలో గాయపడిన వారణాసిని చూసి కార్తీక్ ఆవేదన చెందారు. హాస్పిటల్‌కు వెళ్లిన కార్తీక్.. డాక్టర్‌ను కలిసి వారణాసి పరిస్థితిని అడిగాడు. వారణాసి పరిస్థితి ఎలా ఉందని అడిగితే.. ఇంకా కోమాలోనే ఉన్నాడు. పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. త్వరగా కోలుకొంటాడని ఆశిద్దాం అని డాక్టర్ చెప్పాడు. కార్తీక్‌ను చూసి మీరు హైదరాబాద్‌లో పనిచేశారు కదా.. మీ ప్రొఫైల్ బాగుంది.

    మీరు ఇక్కడెందుకు ఉన్నారు? ఇక్కడ ఏదైనా హాస్పిటల్‌లో పనిచేస్తున్నారా? అని డాక్టర్ అడిగితే.. లేదు డాక్టర్.. అనుకోని కారణాల వల్ల ఇక్కడే ఉన్నాను. కొంతకాలం ఇక్కడే ఉంటాను. సర్జరీలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని కార్తీక్ అన్నాడు. దాంతో తప్పకుండా.. ఏదైనా ఉంటే.. తప్పకుండా తెలియజేస్తాం అని డాక్టర్ చెప్పాడు. ఇంకా కార్తీకదీపం సీరియల్ 1487 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

     సౌందర్య, ఆనందరావు అంటే తెలుస్తుందా?

    సౌందర్య, ఆనందరావు అంటే తెలుస్తుందా?

    హాస్పిటల్‌ నుంచి వచ్చిన కార్తీక్‌ను ఎక్కడికి వెళ్లావు అని మోనిత నిలదీసింది. దాంతో ఫ్రెండ్‌ను కలిశాను అని అంటే.. నాకు తెలియని ఫ్రెండ్ నీకు ఎవరు తెలుసు? అని అంటే.. నీకే ఫ్రెండ్స్ ఉంటారా? అని కార్తీక్ ఎదురు ప్రశ్న వేశాడు. దాంతో నాకు ఎవరు ఫ్రెండ్స్ ఉన్నారు? భర్త అయినా.. ఫ్రెండ్ అయినా నువ్వే అంటూ మోనిత కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే నా ఫ్రెండ్ సుబ్బారావు అంటే తెలుస్తుందా? అప్పారావు అంటే తెలుస్తుందా? సౌందర్య అంటే తెలుస్తుందా? ఆనందరావు అంటే తెలుస్తుందా? అని మోనితకు ఎదురు ప్రశ్న వేశాడు.

    ట్యాబ్లెట్లు చూసి కార్తీక్ షాక్

    ట్యాబ్లెట్లు చూసి కార్తీక్ షాక్

    కార్తీక్‌ నుంచి ఊహించిన పేర్లు రావడంతో మోనిత కంగారుపడిపోయింది. సౌందర్య, ఆనందరావు పేర్లు అదోలా చెప్పారా? లేక కావాలనే చెప్పారా? అని ఆందోళన పడింది. అంతలో పనిమనిషిని పిలిచి కాఫీ తీసుకురా అంటే.. నేను తెస్తాను. కానీ మీరు నిన్నటి నుంచి మెడిసిన్ వేసుకోలేదు. అని కొన్ని టాబ్లెట్లు చేతిలో పెట్టింది. అయితే ఏం టాబ్లెట్లు ఇస్తుందని చూసి.. వాటిని కార్తీక్ పడేశాడు. అంతలోనే కాఫీ పట్టుకొని వచ్చిన మోనితను చూసి.. దేనికి ఆ టాబ్లెట్ల అని అడిగితే.. గతం గుర్తుకు రావడానికి ఇస్తున్నాను అని మోనిత చెప్పింది. ఓహో నాకు గతం గుర్తుకు రాకుండా చేసి.. దీపను దూరం చేయాలనుకొన్నావా? అని కార్తీక్ మనసులో అనుకొన్నాడు.

    ఇల్లే దీపకు పర్ణశాల అంటూ

    ఇల్లే దీపకు పర్ణశాల అంటూ

    దీప తన ఇంటిలో ఒక్కరే ఉండటం చూసి చిక్‌‌మంగళూరు డాక్టర్.. మీరు.. కార్తీక్ మా ఇంట్లో ఉండవచ్చు కదా.. అంటుంటే.. లేదు.. దీప ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. ఆమె పర్ణశాలలో ఉన్నట్టు అనిపిస్తుంది డాక్టర్ చందూ. ఇల్లు బాగాలేదని కంగారు పడకు.. నేను క్లీన్ చేస్తాను అంటూ కార్తీక్ అన్నాడు. తనని పేరు పెట్టి పిలవడంతో డాక్టర్ ఆశ్చర్యపోయారు. దాంతో మీ పేరు అలా ఎలా గుర్తుపెట్టుకొని ఉన్నారని అనుకొంటున్నారా? ఈ మధ్య నాకు కొన్ని గుర్తుకు ఉంటున్నాయి అని అన్నాడు. దాంతో అవును అని దీప కూడా సపోర్ట్ చేసింది. ఆ తర్వాత కార్తీక్, దీప కలిసి వంటపనిలో పడ్డారు.

     శివ.. ఉద్యోగంలో నుంచి తీసేస్తా

    శివ.. ఉద్యోగంలో నుంచి తీసేస్తా

    కార్తీక్ అప్పజెప్పిన పని చూసుకొని ఇంటికి వస్తున్న శివ.. మోనితకు ఎదురుపడ్డాడు. ఎక్కడికి వెళ్లి వస్తున్నావని అడిగితే.. బయటకు పని మీద వెళ్లి వస్తున్నానని చెప్పాడు. అయితే నీ పనులు నీవు చూసుకొ.. నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నానని మోనిత బెదిరించింది. అయితే కార్తీక్ అప్పగించిన పని గురించి చెబుతూ.. ఒక రోజు గణేష్ బొమ్మలు అమ్మిన అమ్మాయి గురించి ఆచూకీ తెలుసుకొమ్మని చెప్పాడని శివ తెలిపారు. దాంతో ఓహో.. శౌర్య, దీపను తీసుకొచ్చి.. నన్ను ఇంటి నుంచి తరిమివేయాలనుకొంటున్నాడా అని మోనిత ఆలోచనల్లో పడగానే.. దుర్గ అక్కడికి వచ్చాడు.

    దీప, డాక్టర్ బాబు ఇంటిలో

    దీప, డాక్టర్ బాబు ఇంటిలో

    దుర్గను చూసిన శివ పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో మోనిత వారించబోయింది. అంతలోనే దుర్గ వచ్చి నేను వచ్చినప్పుడు ఉండవద్దని చెప్పానుగా.. నువ్వు ఉంటే.. కాళ్లు చేతులు విరిగిపోతాయని హెచ్చరించాడు. అంతేకాకుండా ఎవరి చేతులు, కాళ్లు విరిగితే అందుకు నేను బాధ్యుడిని కాదు అని దుర్గ అన్నాడు. అక్కడ దీప, కార్తీక్‌కు అడ్డు రావొద్దని అనుకొన్నాను. అందుకే ఇక్కడికి వచ్చాను అని దుర్గ చెప్పగానే.. మోనిత అక్కడ నుంచి పరుగెత్తుకెళ్లి వంటలక్క ఇంటికి చేరింది.

    నీవు మంచిగా ఉంటే.. బుద్దిగా ఉంటాగా?

    నీవు మంచిగా ఉంటే.. బుద్దిగా ఉంటాగా?

    మోనిత వంటలక్క ఇంటికి చేరగానే.. దీప, కార్తీక్ ఇద్దరు భోజనం చేయడానికి రెడీగా ఉన్నారు. ఏంటి కార్తీక్..ఏం చేస్తున్నావో తెలుసా? అని మోనిత అంటే.. వంట చేశాను. రా.. భోజనం చేద్దామంటూ పిలిచాడు. అయితే నాలుగు రోజులు దీప వద్దకు వచ్చావో లేదో.. వంట చేయాలనిపించిందా అని మోనిత అంటే.. నీ బుద్ది సరిగా ఉంటే.. నేను వంట చేయాల్సి వచ్చేది కాదు అని కార్తీక్ సమాధానం ఇచ్చాడు.

    దాంతో నేను ఏం చేశాను అని అంటే.. నీకు అడ్డుగా ఉన్నానని.. ఎవరెవరితోనో చెప్పి బయటకు పంపిస్తున్నావు. మొన్న దుర్గ వచ్చాడని.. 2 గంటలు బయటకు తీసుకెళ్లి తిప్పుకురా అన్నావట. నీవు మంచిగా ఉంటే..నేను బుద్దిగా ఇంటిలోనే ఉండేవాడిని అని కార్తీక్ అంటే.. భార్య అలా చెబితే.. భర్త తట్టుకోగలడా? అని దీప సమాధానం ఇచ్చింది.

    English summary
    Karthika Deepam October 19th Episode number 1487.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X