»   » మామయ్య మెగాస్టార్‌పై ఉపాసన కామెంట్స్.. ఏమన్నారంటే..

మామయ్య మెగాస్టార్‌పై ఉపాసన కామెంట్స్.. ఏమన్నారంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తాజగా మరో అవతారమెత్తారు. గతంలో ఎన్నడూలేని విధంగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో టెలివిజన్ హోస్ట్‌గా కనిపించారు. తాజాగా 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో కార్యక్రమం స్టార్ మాటీవీలో సోమవారం (ఫిబ్రవరి 13) నుంచి ప్రసారం అవుతున్నది. ఈ షోలో కనిపించిన చిరంజీవిపై కోడలు, రాంచరణ్ సతీమణి ఉపాసన కామినేని సోమవారం రాత్రి ట్విట్టర్‌లో స్పందించారు. ఆ షోలో కనిపించిన చిరంజీవి చిత్రాలను ఆమె ట్వీట్ చేశారు.

'కొద్ది నిమిషాల క్రితం చానెళ్లు మారుస్తూ మాటీవీ చూశాను. ఆ సందర్భంగా మామయ్య కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. దాంతో నేను టీవీకి అత్తుకుపోయి చూశాను' అని ఉపాసన ట్వీట్ చేశారు. చిరంజీవి నిర్వహించిన ఈ కార్యక్రమంపై అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

English summary
Megastar Chiranjeevi started Meelo Evaru Koteeshwarudu on Star Maa Television. It got huge response from the viewers.His sister in law Upasana Kamineni gives big applause to Megastar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu