Vadinamma Serial June 11th Episode:రఘురామ్ కుటుంబానికి మరో టెన్షన్..సీత యాక్సిడెంట్ తో కుప్పకూలిన రఘురామ్!

ప్రస్తుతానికి సినిమాలు ఏవి పెద్దగా రిలీజ్ కి లేకపోవడంతో దాదాపుగా అందరూ సీరియల్స్ మీద దృష్టి పెడుతున్నారు. అలా తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో ఒకటిగా వదినమ్మ సీరియల్ కూడా నిలుస్తోంది. ప్రభాకర్, సుజిత కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సీరియల్ ప్రతి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతోంది. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రశాంత్ ఫోన్

ప్రశాంత్ ఫోన్

సీత ఎంతకూ రాకపోవడంతో రఘురామ్ కుటుంబమంతా ఆమె కోసం కంగారుపడుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోయంబత్తూరు ప్రశాంత్ నుంచి రఘురామ్ కి ఫోన్ వస్తుంది. రఘురామ్ కి ఫోన్ చేసిన ప్రశాంత్ సీత కిడ్నీ ఇవ్వడానికి వచ్చిన సంగతి తర్వాత కిడ్నీ తమకు బ్రెయిన్ డెడ్ వ్యక్రి నుంచి దొరికిన సంగతి పూర్తిగా వివరిస్తాడు. అయితే సీత ఇప్పటికి కూడా రాలేదని రఘురామ్ చెప్పడంతో అసలు ఏమైందో కనుక్కుంటాను అని ప్రశాంత్ ఫోన్ పెట్టేస్తాడు.

ఆనందంలో కుటుంబం

ఆనందంలో కుటుంబం

అయితే సీత కిడ్నీ ఇవ్వలేదు అన్న సంగతి తెలుసుకుని కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందిస్తారు వాళ్ళఅందరిలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ సమయంలో శైలు కూడా సీతక్క కిడ్నీ ఇచ్చి ఉంటే తాను ఆ విషయంలో జీవితాంతం బాధపడే ఉండేదానిని అని ఆవిడ కిడ్నీ ఇవ్వకుండా రావడం తనకెంతో ఆనందం కలిగిస్తోందని చెబుతుంది. ఇక ఈ సమయంలోనే రఘురామ్ నాని సంతకం పెట్టిన పొలం కాగితాలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకు వెళ్లి అపార్ట్మెంట్ వాళ్ళకి కట్టాలని భాస్కర్ ని, తన తమ్ముడు లక్ష్మణ్ ని కోరుతాడు.

ఇరవై కోట్ల సమస్య తీరింది

ఇరవై కోట్ల సమస్య తీరింది

వాళ్ళిద్దరూ ఆ డబ్బు కట్టేందుకు వెళ్ళిపోతారు, అయితే ఇదంతా జరుగుతున్న సమయంలో సిరి తల్లి భాస్కర్ భార్య ఇద్దరూ కూర్చుని ఈ విషయం గురించి చర్చిస్తూ ఉంటారు. కిడ్నీ అమ్మడం నేరమని సీత కిడ్నీ అమ్మటానికి ఎలా రెడీ అయిందో అంటూ సీతను ఎప్పటిలాగే టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు. ఇక మరో పక్క డబ్బు కట్టేందుకు వెళ్లిన భాస్కర్, లక్ష్మణ్ ఇద్దరూ డబ్బులు కట్టేసి తిరిగి వస్తారు. చెప్పిన సమయం లోపు డబ్బులు కట్టిన అందుకుగాను వాళ్ళందరూ మెచ్చుకున్నారని చెబుతారు.

సీత బస్సుకు యాక్సిడెంట్

సీత బస్సుకు యాక్సిడెంట్

ఇక ఈ సమస్య తీరిపోవడంతో కుటుంబంలో అంతా ఆనందం వెల్లివిరుస్తుంది. సరైన సమయంలో సంతకం పెట్టినందుకు సిరి నానిని అభినందిస్తుంది. దీంతో నాని అభినందిస్తున్నారా ? ఎద్దేవా చేస్తున్నారా ? అని అడగగా భరత్ కల్పించుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని కుటుంబానికి అండగా నిలబడ్డావు అని మెచ్చుకుంటాడు. ఇక ఇంతలో ప్రశాంత్ నుంచి ఫోన్ వస్తుంది. మీకు ఒక దుర్వార్త చెబుతున్నాను అని చెబుతూ సీత ప్రయాణిస్తున్న బస్సు యాక్సిడెంట్ అయిందని బస్సు మొత్తం లోయలో పడిపోయిందని చెబుతాడు.

కుప్పకూలి పోయిన రఘురామ్

కుప్పకూలి పోయిన రఘురామ్

ఈ మాట విన్న వెంటనే రఘురామ్ కుప్పకూలి పోతాడు, కుటుంబ సభ్యులందరూ కంగారుపడి ఆయనను లేపే ప్రయత్నం చేస్తారు. అయితే సీత వెళుతున్న బస్సు యాక్సిడెంట్ అయింది మాత్రం నిజమేనని అయితే ఎవరికి ప్రాణాపాయం ఉందన్న వార్త మాత్రం బయటకు రాలేదని ప్రశాంత్ చెబుతారు. ఈ విషయం కాస్త ఊరట కలిగించేదే అయినా సీతకు ఏమైంది అనే విషయం మీద ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇక సిరికి ఫోన్ చేసి విషయం తెలుసుకున్న సిరితల్లి ఈ విషయాన్ని భాస్కర్ భార్యకు చెప్పి ఇద్దరు కలిసి ఆనందిస్తుంటారు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటూ సామెతలు చెబుతూ ఉంటారు.

గుండె ఇలా కొట్టుకోదు

గుండె ఇలా కొట్టుకోదు


ఇక కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం సిరి తల్లి భాస్కర్ భార్య కలిసి రఘురామ్ ఇంటికి వస్తారు. కుటుంబంలో అందరూ సీత కోసం బాధ పడుతున్న తరుణంలో భోజనం తయారు చేసి తినమని కోరుతారు. ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించని తరుణంలో పోయిన వారి కోసం ఇలా ఏడుస్తూ కూర్చుంటారా అని సిరి తల్లి అనడంతో రఘు సీరియస్ అవుతాడు. ఎవరు పోలేదని పోయి ఉంటే తన గుండె ఇలా కొట్టుకోదు అని చెబుతాడు. సీతకు ఏమయింది అనే అంశం తర్వాతి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X