Vadinamma Serial May 20th Episode: చావు బతుకుల్లో లక్ష్మణ్, ఊహించని ట్విస్ట్ తో జనార్ధన్ కి షాక్!

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దాదాపు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. ఈ క్రమంలో జనం మొన్నటి దాకా సినిమాలని ఎంజాయ్ చేసినా ఇప్పుడు మళ్ళీ సినిమాల కంటే ఎక్కువ సీరియల్సే చూస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆడవాళ్ళతో పాటు మగవారు కూడా సీరియల్స్‌కి అభిమానులు అయ్యారు. ఇక తెలుగులో టాప్ 5 సీరియల్స్ లో ఒకటిగా కొనసాగుతున్న వదినమ్మ ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..

అరెస్ట్ అయి

అరెస్ట్ అయి

546 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌ 547 ఎపిసోడ్ ఈ రోజు ప్రసారం కానుంది. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సుజిత లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌గా ఈ సీరియల్ ప్రసారం అవుతోంది. లక్ష్మణ్ కడుతున్న అపార్ట్మెంట్ కూలిపోయిన నేపథ్యంలో అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే నాలుగు రోజుల్లో 20 కోట్లు కడతామని హామీతో రఘురాం, సీతలు లక్ష్మణ్ ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి ఇంటికి తీసుకు వస్తారు. ఎలాగోలా నాలుగు రోజుల్లో 20 కోట్లు సర్దుబాటు చేసి కడదాం అనుకుంటున్న క్రమంలో లక్ష్మణ్ ఇంటి మీదకు కొంతమంది దాడికి వస్తారు.

చనిపోవాలని నిర్ణయించుకుని

చనిపోవాలని నిర్ణయించుకుని

లక్ష్మణ్ కడుతున్న అపార్ట్మెంట్ కి డబ్బులు కట్టిన కొంతమంది లక్ష్మణ్ ఇంటి మీదకి దాడికి వస్తారు. అలా ఎలా తమను మోసం చేస్తావని వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో అనుకోకుండా రఘురామ్ తలకు గాయం అవుతుంది. అయితే ఇదంతా తన వల్లే జరిగిందని లక్ష్మణ్ బాధపడుతూ ఉంటాడు. రాత్రంతా మెలకువగానే ఉన్న లక్ష్మణ్ చనిపోవాలని నిర్ణయించుకుంటాడు..

వదిన చేత్తో అన్నం

వదిన చేత్తో అన్నం

అంతకుముందు తనను ఓదార్చడానికి వచ్చిన వదిన సీత చేత అన్నం కూడా తినిపించుకుంటాడు. ఎప్పుడూ లేనిది చిన్నపిల్లాడిలా ఏంటి ఇది అని ప్రశ్నించగా ఇదే చివరి సారి అని ఇక మీదట తాను మారిపోతానని మాట ఇవ్వడంతో సీత సంతోషించి అప్పటికప్పుడు అన్నం కలుపుకొని తీసుకు వచ్చి తినిపిస్తుంది. అనంతరం ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు.

నిద్ర మాత్రలు మింగి

నిద్ర మాత్రలు మింగి

అయితే చనిపోవాలని నిర్ణయించుకున్న లక్ష్మణ్ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే ఇదంతా ఒక పీడ కలలాగా సీతకు ముందే తెలుస్తుంది. కిందకి వెళ్లి చూడగా అక్కడ లక్ష్మణ్ చెమటలతో కనిపిస్తాడు, ఏంటి ఇలా ఉన్నావు అని ప్రశ్నించగా లక్ష్మణ్ అదేమీ లేదని చెబుతూ వదినకి దండం పెట్టి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం కూడా తీసుకుంటాడు. అప్పుడే సీతకు అనుమానం వస్తుంది.

శైలు అరుపులతో

శైలు అరుపులతో

అయినా తనను తాను సర్దిచెప్పుకొని రూమ్ కి వెళ్ళిన సీత కాసేపటికి శైలు అరుపులతో లక్ష్మణ్ వాళ్ళ గది దగ్గరికి వెళుతుంది. అప్పటికే నిద్రమాత్రలు మింగిన లక్ష్మణ్ వాళ్ల మంచం మీద పడిపోయాడు.. దీంతో వెంటనే లక్ష్మణ్ను హుటాహుటిన హాస్పిటల్ కి తరలిస్తారు. రఘురామ్ కుటుంబం అంతా హాస్పిటల్ కి చేరుకుంటుంది

రఘురాం ఆగ్రహం

రఘురాం ఆగ్రహం

అయితే లక్ష్మణ్ ఇలా ఆత్మహత్యాయత్నం చేయడంతో రఘురాం ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ సమస్య మన అందరిదీ అని చెబితే వాడు వినకుండా తానొక్కడే దానికి బాధ్యుడిని అని భావించి ఆత్మహత్యాయత్నం చేయడం సరికాదని అండగా ఉంటామని చెప్పినా ఇలా చేయడం మోసం చేయడమేనని సీతతో చెబుతాడు. అయితే లక్ష్మణ్ ని ఏమీ అనవద్దని సీత కోరుతుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
జనార్ధన్ కి షాక్

జనార్ధన్ కి షాక్

ఇక ఇంతలో హాస్పిటల్ కి శైలు తండ్రి జనార్ధన్ చేరుకుంటాడు.. ఒక సమర్ధుడైన అన్నకి తమ్ముడిగా పుట్టడం వల్ల తన అల్లుడు ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రఘురాంని నిందిస్తాడు. దీంతో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక జరగబోయే ఎపిసోడ్ లో శైలు తండ్రి మాటను కాదని సీత వద్దకు వెళ్లి సీతను హత్తుకోవడం చూపించారు. జనార్ధన్ సర్ది చెప్పడానికి ప్రయత్నించినా శైలు వినకపోవడంతో ఆయనకు షాక్ తగిలినట్లయింది. అసలు ఏం జరిగింది ? శైలు తండ్రి మాట ఎందుకు కాదు అన్నది ? అనే వివరాలు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X