For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vadinamma : షాపు మీద కస్టమర్స్ దాడి.. భరత్ చేసిన పనికి చిక్కుల్లో ఫ్యామిలీ.. పోలీసు కేసులు కూడా?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ 641వ ఎపిసోడ్ కి చేరింది. ఎలా అయినా తన భర్త కుటుంబంలో ముసలం పుట్టించిం వాళ్ళ అందరి మధ్య గొడవలు రేపి ఈ తన భర్తను తనతో ఇల్లరికం తీసుకువెళ్లాలని శిల్ప అనేక రకాల ప్లాన్లు వేస్తున్న సంగతి తెలిసిందే.. తన కూతురి కోసం దమయంతి కూడా ఒక ప్లాన్ సిద్ధం చేసి రంగంలోకి దిగింది. ఇక ఆ ప్లాన్ ప్రకారమే నిన్న ఒక గొడవ జరగగా ఈరోజు దానికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

  Photos Courtesy: Star MAA and Disney+Hotstar, ఫొటోస్ కర్టసీ : స్టార్ మా అండ్ డిస్నీ హాట్ స్టార్

  మల్లెపూల పురాణం

  మల్లెపూల పురాణం

  పొద్దున్న ఏసీ పెట్టించమని రఘురాం చెప్పి షాప్ కి వెళ్ళి పోయిన తర్వాత, సాయంత్రం శిల్పా, సిరి, సీత, శైలు అందరూ ఒకచోట కూర్చుని మాటలు చెప్పుకుంటూ ఉంటారు. శిల్పా మల్లె పూలు తీసుకు వచ్చి అందరికీ ఇస్తుంది. అయితే ఈ మల్లెపూలు భర్తలు, భార్యలకు ఇద్దరికీ బాగా ఉపయోగపడతాయని చెబుతూ భర్తలు భార్యలను కూల్ చేయడానికి ఈ మల్లెపూలు వాడతారని, భార్యలు కూడా భర్తల మీద పంతం నెగ్గించుకోవడానికి ఈ మల్లెపూలు తోనే సమాధానం చెబుతారని శైలు, సిరి ఇద్దరు చెబుతారు. అనుభవంతో చెబుతున్నావా అక్క అని ప్రశ్నిస్తే నువ్వు కూడా కొద్ది రోజుల్లో ఈ అనుభవాలు అన్నీ నేర్చుకుని మాకు ఎదురు చెబుతావు అని అంటారు ఇద్దరు. ఇంతలో నాని బండి శబ్దం వినగానే అదిగో నాని వచ్చాడు అని ఆనందపడుతుంది శిల్పా, అబ్బో నాని బండి శబ్దం కూడా బాగా గుర్తు పెట్టుకున్నావుగా ఎక్కడా తగ్గట్లేదుగా అని శైలు, సిరి ఏడిపిస్తారు.

  పాపం నాని

  పాపం నాని

  అయితే నాని అనూహ్యంగా మల్లెపూలు తీసుకొస్తాడు, వీళ్లందరినీ హాల్ లో చూసి ఎందుకైనా మంచిదని మల్లెపూలు దాచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా నానిని అక్కడే ఆపేసి పొద్దున్నుంచి ఆఫీసులో కష్టపడితే బాగా అలసిపోయినట్లు కనిపించాలి గాని నువ్వేంటో ఫ్రెష్ గా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి అన్నట్టు ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే చేతిలో మల్లెపూలు చూసి బలే తీసుకు వచ్చావుగా కొత్త పెళ్ళాం కోసం అని ఏడిపిస్తుంటారు, అయితే తాను తీసుకురాలేదని శిల్ప తీసుకు రమ్మంటే నేను తీసుకు వచ్చాను అని నా అని అంటారు, శిల్ప మాత్రం నేనైతే తీసుకు రమ్మన లేదు అని కుండ బద్దలు కొడుతుంది, దీంతో తప్పక తానే తన భార్య కోసం ఈ పూలు తీసుకు వచ్చాను అని నాని ఒప్పుకుంటాడు. మరోపక్క శిల్ప తల్లి దమయంతి తాను నియమించిన బియ్యం వ్యాపారికి చెప్పినట్లుగానే డబ్బు ఇస్తుంది.

  ప్లాన్లో భాగంగా మిస్సింగ్

  ప్లాన్లో భాగంగా మిస్సింగ్

  నేను నటించనున్నట్లు నటించి డ్రామాను రక్తి కట్టించావు, అయితే ఈ వ్యవహారం పోలీస్ కేసులు దాకా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి నువ్వు కొన్నాళ్లపాటు ఎక్కడ కనిపించకు, వీలైతే రాష్ట్రాలు దాటి వెళ్ళి పో ఈ పోలీస్ కేసులు హడావుడి అంతా తగ్గాక నేనే నిన్ను ఇక్కడికి రమ్మని పిలుస్తాను అప్పటిదాకా ఫోన్ నెంబర్ కూడా తీసేయ్ అని చెబుతుంది. మీరు ఎంత చెబితే అంత అమ్మ గారు ఒక గంట ఆగితే మీరు కూడా నన్ను పట్టుకో లేరు నేను ఎక్కడికి వెళుతున్నానో కూడా నీకు చెప్పను అంటూ అతను జారుకుంటాడు. ఇక మరో పక్క అప్పుడే లక్ష్మణ్, భరత్ షాపు మూసి ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి రావడంతోనే మీ అన్నయ్య చెప్పిన పని ఏమైంది అని అడుగుతుంది సీత. అయితే అది నేను చెప్పలేను అని భరత్ వంక చూపిస్తాడు. భరత్ ఇప్పుడే ఏమీ చెప్పద్దు నేనే అన్నయ్యకి నేరుగా చెబుతాను అని అంటారు.

  అన్నయ్య కి అసలు విషయం

  అన్నయ్య కి అసలు విషయం

  ఇక తెలవారుతుండగానే లక్ష్మణ్ షాపు తెరవాలని తొందరలో అన్నయ్యకి కూడా చెప్పకుండా వెళ్ళి పోతాడు, షాప్ కి వెళ్ళాక అక్కడికి వచ్చిన కస్టమర్లతో మాట్లాడుతూ వాళ్ళకి కావలసిన సరుకులు ఇస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో ప్లాస్టిక్ బియ్యం అని చెబుతూ బియ్యం కొనుక్కొని వెళ్ళిన కస్టమర్లు షాప్ మీద గొడవ కు వస్తారు, ఇంతలో జరిగిన విషయం అంతా భారత్ తన అన్నయ్యకు చెబుతాడు, ఇలా తాను కొత్త రైస్ డీలర్ నుంచి రైస్ వేయించుకున్నాను అని దాని కోసం డబ్బు ఖర్చు పెట్టాను అని అంటాడు. అయితే అలా ఎందుకు చేసావు అని ప్రశ్నించగా గతంలో నువ్వే కదా కొన్ని విషయాల్లో తెగించి నిర్ణయం తీసుకోమని చెప్పావు అందుకే ఇలా నిర్ణయం తీసుకున్నాను అని చెప్పడంతో సీత అభినందిస్తుంది, నువ్వు అభినందించడం కాదు అన్నయ్య అభినందించాలి కదా అని భరత్ అంటాడు, తండ్రి లాంటి వాడు కొడుకు ఎదుగుదల చూసి ఆనందపడతారు గానీ అభినందనలు చెప్పడని ఆమె అంటుంది.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  షాపులో గొడవ

  షాపులో గొడవ

  ఇంతలో షాపు లో జరిగిన గొడవ విషయం అంతా లక్ష్మణ్ తన అన్నయ్య కి ఫోన్ చేసి చెప్పాడు. తను వెంటనే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇంట్లో వాళ్లందరికీ టెన్షన్ పడకండి అని చెప్పి మరి బయలుదేరుతారు. షాప్ కి వెళ్ళేసరికి లక్ష్మణ్ కాలర్ పట్టుకుని మరీ కస్టమర్లు గొడవ పడుతూ ఉంటారు ఈ విషయం చూసి భరత్ పట్టలేని కోపంతో వాళ్ళ మీద యుద్ధానికి వెళతాడు. రఘురాం రంగంలోకి దిగి అతనిని ఆపి అసలు ఏం జరిగింది అనే విషయం తెలుసుకుని ఆ బియ్యం నిజంగానే ప్లాస్టిక్ బియ్యం అనే నిర్ధారణకు వస్తాడు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ లో కుటుంబం మళ్లీ బాధపడుతూ రెండు రోజుల నుంచి అన్నం కూడా తినడం లేదన్నట్లు చూపించారు. చివరికి శిల్ప తతంగం అంతా బయట పెట్టే సమయం బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అన్న.

  English summary
  Vadinamma Episode 641: Bharat comes up with a plan to impress Raghuram. Later, Raghuram gets shocked after learning about the truth.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X