For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హగ్ కావాలంటూ వరుణ్ దుప్పట్లో దూరిన వితిక.. వద్దు వద్దు అంటూనే రొమాన్స్

  |

  'బిగ్ బాస్' సీజన్ - 3 ఆసక్తికరంగా సాగుతోంది. వాస్తవానికి రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నప్పటికీ, మూడో సీజన్ మాత్రం బాగా వివాదాస్పదం అయింది. దీనికి కారణం ఈ షో బ్యాన్ చేయాలంటూ పలు అవాంతరాలు ఎదురయ్యాయి. అయినా.. వాటన్నింటినీ అధిగమించి బిగ్ బాస్ షో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ షోలో ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ, జంటగా ఎంటరైన వరుణ్ సందేశ్, వితికా షేరు మధ్య రొమాన్స్ మాత్రం అన్నింటికి మించి హైలైట్ అవుతోంది.

  స్పెషల్‌గా ఎంట్రీ

  స్పెషల్‌గా ఎంట్రీ

  ఈ సీజన్ మొత్తానికి వరుణ్ సందేశ్, వితిక షేరు కొంచెం స్పెషలనే చెప్పాలి. దీనికి కారణం వీరిద్దరూ భార్యభర్తలు కావడమే. ‘బిగ్ బాస్' చరిత్రలోనే దంపతులను షోకు తీసుకొచ్చిన దాఖలలు లేవు. ఇప్పుడు వీళ్లిద్దరూ రావడంతో అందరి కళ్లు వీళ్ల పైనే ఉన్నాయి. హౌస్‌లోకి ఎంటరయ్యే సమయంలోనే వరుణ్.. వితికను ఎత్తుకుని తీసుకెళ్లడం మరింత హైలైట్ అయింది.

  రొమాన్స్‌తో హైలైట్

  రొమాన్స్‌తో హైలైట్

  హౌస్‌లోకి ఎంటరైన తర్వాత వరుణ్ సందేశ్.. వితిక కలిసే ఉండడం కనిపిస్తోంది. ఒకరి బాగోగులు మరొకరు చూసుకోవడం.. మధ్య మధ్యలో బాతాకానీలు పెట్టడం సరిపోతుంది. మిగిలిన హౌస్‌మేట్స్ అందరూ ఒకటి.. మేమిద్దరం మాత్రమే ఒకటి అన్నంతగా ఈ జంట ఉంటోంది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు, డబుల్ మీనింగ్ డైలాగులు కూడా కనిపించాయి.

  భార్య కోసం మహేశ్‌తో గొడవ

  భార్య కోసం మహేశ్‌తో గొడవ

  తన భార్యను మహేశ్ విట్టా ఏదో అన్నాడని వరుణ్ సందేశ్ రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఆ గొడవ జరుగుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో ‘‘దమ్ముంటే నన్ను కొట్టు.. ఆడవాళ్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. సిగ్గు లేదు నీకు.. సిగ్గు లేనోడా'' అంటూ అతడు ఊగిపోయాడు. తర్వాత మహేశ్ సారీ చెప్పడంతో ఇది ముగిసిపోయింది.

  భార్యతోనే గొడవ - క్షమాపణ

  భార్యతోనే గొడవ - క్షమాపణ

  మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో వరుణ్.. వితిక మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. పునర్నవికి వితికకు మధ్య డిస్కర్షన్ జరుగుతున్న సమయంలో వరుణ్ తన భార్యకు వ్యతిరేకంగా మాట్లాడాడు. తనకు ఏది నిజమనిస్తే అటు వైపే ఉంటానని వరుణ్‌ తేల్చి చెప్పాడు. దీంతో వితిక కన్నీళ్లు పెట్టుకుంటూ పరిగెత్తింది. వరుణ్.. వితిక చేతిలో చేయి వేసి క్షమించమని కోరడంతో సుఖాంతం అయ్యింది.

  మరోసారి రొమాన్స్

  మరోసారి రొమాన్స్

  శనివారం జరిగిన ఎపిసోడ్‌లో వరుణ్ - వితిక మరోసారి హైలైట్ అయ్యారు. గతంలో హగ్గులు, ముద్దులు, బాత్ టబ్‌లో రొమాన్స్ చేసి చర్చనీయాంశం అయిన ఈ జంట.. మరోసారి రొమాన్స్ చేసి కెమెరాలకు దొరికిపోయింది. దీంతో ఇప్పుడు వీళ్లిద్దరి గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.

  భర్త దుప్పట్లో దూరి

  భర్త దుప్పట్లో దూరి

  తమ పక్కన ఎవరూ లేకపోవడంతో వితిక.. వరుణ్ దుప్పట్లో దూరిపోయింది. ఆ సమయంలో అడ్వాన్స్ అయిన వితిక.. భర్తను కౌగిలించుకునే ప్రయత్నం చేసింది. వరుణ్ దుప్పటిలో దూరి నీ హార్ట్ బీట్ వింటా అని అతని గుండెలపై తల పెట్టుకుని పడుకుంది. ఏంటి అలా మీద పడిపోతావ్.. ఓవర్ యాక్షన్ చేయకు అంటూ సర్దిచెప్తూ రొమాన్స్ పండించారు.

  English summary
  Bigg Boss Telugu 3 has been launched on Sunday and the reality show is making noise right from day one. At The Same Time Romance Also Started By Varun Sandesh and Vithika Sheru.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X