For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 6: షోలో నాగార్జునకు బిగ్ షాక్.. అలా అనడాన్ని తప్పుబట్టిన అమ్మాయిలు.. ఏడుస్తూ ఆరోపణలు

  |

  తెలుగు బుల్లితెర చరిత్రలోనే రియాలిటీ ఆధారంగా నడిచే షోలు చాలా తక్కువనే చెప్పాలి. ఈ మధ్య కాలంలోనే కొన్ని అలాంటి కార్యక్రమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో చాలా తక్కువ ప్రోగ్రామ్‌లకు మాత్రమే ఆదరణ దక్కుతోంది. దీంతో అవి విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. అలాంటి వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటికే ఎన్నో సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఆరో దాన్ని నడపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జునకు ఇద్దరు అమ్మాయిలు బిగ్ షాకిచ్చారు. ఆ వివరాలు మీకోసం!

  కొత్తగా వచ్చినా రేటింగ్ చెత్తగా

  కొత్తగా వచ్చినా రేటింగ్ చెత్తగా

  బిగ్ బాస్ తెలుగులో ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌లను భారీ రెస్పాన్స్‌తో పూర్తి చేసుకున్నాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఆరో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నా ప్రేక్షకుల ఆదరణ దక్కకపోవడంతో రేటింగ్ అంతగా రావట్లేదు.

  బట్టలు లేకుండా షాకిచ్చిన కేతిక శర్మ: ఈ ఫొటోలో ఆమెను చూస్తే పిచ్చెక్కిపోద్ది!

  ఈ వారంలో ఇలా.. లేడీ కెప్టెన్

  ఈ వారంలో ఇలా.. లేడీ కెప్టెన్

  నాలుగో వారం కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు నిర్వహకులు 'బీబీ హోటల్' అనే టాస్కును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఏకంగా 11 మందిని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేశారు. అందులో ముగ్గురు మాత్రమే చివరి దశకు చేరుకున్నారు. వీరి నుంచి కీర్తి భట్ ఈ వారం ఇంటి కెప్టెన్‌గా ఎంపికైంది. అలాగే, అర్జున్ చెత్త కంటెస్టెంట్‌గా నిలిచి జైల్లోకి వెళ్లాడు.

  వీకెండ్‌లో నాగార్జున క్లాస్ పీకి

  వీకెండ్‌లో నాగార్జున క్లాస్ పీకి

  అక్కినేని నాగార్జున గత సీజన్లలో కంటే ఇందులో కంటెస్టెంట్లపై విరుచుకుపడుతున్నాడు. తప్పు చేసిన వాళ్లను ఏమాత్రం మొహమాటం లేకుండా తిడుతున్నాడు. అంతేకాదు, గత వారం ఏకంగా ఇద్దరిని నేరుగా నామినేట్ కూడా చేశాడు. ఈ నేపథ్యంలో నాలుగో వారంలో చాలా తప్పులు జరగడంతో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో టాస్కులో సరిగా ఆడని వాళ్లకు క్లాస్ పీకేశాడు.

  యాంకర్ రష్మీ హాట్ షో: పై భాగాలు కనిపించేలా అందాల ప్రదర్శన

  కీర్తికి కటింగ్... వాసంతికి 200

  కీర్తికి కటింగ్... వాసంతికి 200

  శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కొందరు కంటెస్టెంట్లకు టిప్‌లు ఇచ్చాడు. ఇందులో భాగంగానే నాలుగో వారంలో కీర్తి భట్ చక్కగా ఆడి కెప్టెన్‌గా ఎంపికైంది. కానీ, ఆమెకు మాత్రం ఐదు వందలే ఇచ్చాడు. అందులోనూ మూడు వందలు తగ్గించి 200లే ఫైనల్ చేశాడు. అలాగే, మరో కంటెస్టెంట్ వాసంతి కృష్ణన్‌కు సైతం నాగార్జున కేవలం 200 మాత్రమే అందించాడు.

  ఏడ్చిన కీర్తి.. ఓదార్చిన నాగ్

  ఏడ్చిన కీర్తి.. ఓదార్చిన నాగ్

  శనివారం జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున బ్రేక్ తీసుకోగానే కీర్తి భట్ తన మనసులోని బాధను బయట పెట్టింది. 'నేను ఎంతో కష్టపడి కెప్టెన్ అయ్యాను. దీంతో నాగార్జున సార్ నుంచి చీరప్ ఆశించాను. కానీ, ఆయన మాత్రం నాకు 200లే ఇచ్చారు. బాగా ఆడకపోతే తిట్టినట్లే.. ఆడినప్పుడు ఎంకరేజ్ చేయాలి కదా' అని ఏడ్చింది. దీంతో నాగార్జున తర్వాత ఆమెను ఓదార్చాడు.

  శృతి మించిన ప్రియ ప్రకాశ్ హాట్ షో: తడిచిన దేహంతో మెంటలెక్కించేలా!

  వాసంతి మాత్రం ఒప్పుకోలే

  వాసంతి మాత్రం ఒప్పుకోలే

  'బీబీ హోటల్' టాస్కులో ఆటతీరును ఉద్దేశిస్తూ తనకు అక్కినేని నాగార్జున 200 రూపాయలే ఇవ్వడంపై వాసంతి కృష్ణన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 'నేను లాస్ట్ టైం మంచిగా ఆడలేదు. ఈ సారి ఎలాగైనా ముందుకు రావాలని 70 శాతం ఆడాను. ఈ టిప్‌పై నేను సంతృప్తిగా లేను సార్' అంటూ ఆయన ముఖం మీదనే చెప్పేసింది. దీంతో నాగ్ తెల్లముఖం వేసేశాడు.

  కూల్ అవలేదు.. విమర్శలు

  కూల్ అవలేదు.. విమర్శలు

  వాసంతి అభ్యంతరం వ్యక్తం చేయడంతో నాగార్జున ఆమెను ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ, ఆమె మాత్రం ఎపిసోడ్ ముగిసిన తర్వాత కూడా ఇదే విషయం గురించి బాధ పడింది. అంతేకాదు, గార్డెన్ ఏరియాలోకి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చేసింది. కానీ, హోస్ట్ మాత్రం ఇది పట్టించుకోలేదు. దీంతో నెటిజన్లు సైతం ఈ విషయంపై నాగార్జునను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

  English summary
  Bigg Boss Telugu Telugu 6th Season Running Successfully. Vasanthi and Keerthi Bhat Allegations on Nagarjuna in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X