»   »  'అత్తారింటికి దారేది' తర్వాత ' దృశ్యం' కే ఆ క్రెడిట్

'అత్తారింటికి దారేది' తర్వాత ' దృశ్యం' కే ఆ క్రెడిట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిన్న తెరపై 'అత్తారింటికి దారేది' చిత్రం ఓ సంచలనం. ఆ తర్వాత ప్లేస్ లో ఇప్పుడు వెంకీ ' దృశ్యం' నిలిచింది. రీసెంట్ గా టీవిలో ప్రసారమైన ఈ చిత్రం 18.6 రేటింగ్ తెచ్చుకుంది. 'అత్తారింటికి దారేది' చిత్రం 19 రేటింగ్ తెచ్చుకుంది. ఇప్పటివరకూ అల్లుడు శ్రీను, రేసుగుర్రం సెకండ్ ప్లేసులో ఉన్నాయి. ఇప్పుడు ' దృశ్యం' చిత్రం సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్టు కావటంతో ఈ చిత్రానికి ఈ రేటింగ్ లు వచ్చాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రై. లిమిటెడ్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొంది విడుదలైన చిత్రం 'దృశ్యం'. ఓపినింగ్స్ పెద్దగా తెచ్చుకోలేక పోయిన ఈ చిత్రం బడ్జెట్, బిజినెస్ పరంగా భాక్సాఫీస్ వద్ద భారీగా సక్సెస్ అయ్యింది.

24 రోజులకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ షేర్ 23.75 కోట్లు కలెక్టు చేసింది. అలాగే... శాటిలైట్ రైట్స్ నిమిత్తం...5.5 సంపాదించింది. అలాగే...వీడియో రైట్స్ నిమిత్తం ...40 లక్షలు వచ్చాయి. మొత్తం ఈ రెవిన్యూ..29.65 వచ్చింది. ఫైనల్ రన్ కి మొత్తం 30 కోట్లు వస్తుందని అంటున్నారు.

ఇక ఈ చిత్రం ఖర్చు విషయానికి వస్తే...రీమేక్ రైట్స్ , ప్రింట్స్ , పబ్లిసిటి తో కలిపి 8 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో ఈ చిత్రం మిగతా ఖర్చులు పోను దాదాపు 20 కోట్లు లాభాలు వచ్చినట్లే అంటున్నారు.

Venkatesh's Drishyam is next to AD

దర్శకురాలు శ్రీప్రియ తన దర్శకత్వ ప్రతిభ ని కేవలం అక్కడ సీన్స్ ని ఇక్కడ అనువదించటానికి మాత్రమే ఉపయోగించని విమర్శలు వినపడ్డాయి. అయితే వెంకటేష్ మాత్రం భావోద్వేగ సన్నివేశాల్లో చాలా బాగా చేయడంతో, అతనికో ల్యాండ్ మార్క్ సినిమాగా మారుతుందని అంటున్నారు.

మోహన్‌లాల్ హీరోగా నటించిన మలయాళ హిట్ సినిమా 'దృశ్యం'కు రీమేక్ ఇది. డా.డి.రామానాయుడు సమర్పించారు. వెంకటేష్ తొలిసారి ఇద్దరు పిల్లల తండ్రిగా, మధ్య వయస్కుడిగా నటించారు. మీనా కీలక పాత్రధారి. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. అరకు, విజయనగరం, వైజాగ్, హైదరాబాద్, కేరళలో షూటింగ్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదల చేసారు.

నరేష్, నదియ, రవి కాలే, పరుచూరి వెంకటేశ్వరరావు, సమీర్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సమర్పణ: డా.డి.రామానాయుడు, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: శరత్, కథ: జీతూ జోసెఫ్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, రచన: పరుచూరి బ్రదర్స్, మాటలు: స్వామి, ఆర్ట్: వివేక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: సురేష్ బాలాజి, జార్జ్ పైయస్.

English summary
Victory Venkatesh's 'Drishyam' has garnered second highest TRP rating (18.6) in Telugu. Pawan Kalyan Attarintiki Daredi got over 19 TRP rating.
Please Wait while comments are loading...