అశ్లీలత, రంకు బాగోతాలతో బిగ్‌బాస్ షో.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు

Venu Swamy on Bigg Boss: వేణు స్వామి.. తెలుగు రాష్ట్రాల్లో ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా స్టార్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు అందరి జాతకాలు చెప్పి.. సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అయ్యాడు. ఎవరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? ఎవరు విడిపోతారు? ఎవరికి ప్రమాదాలు వస్తాయి? అంటూ చెప్పేవారు. ఆయన జోస్యాలు ఒకపక్క ఆసక్తి రేకెత్తిస్తే, మరోపక్క ట్రోలింగ్‌కు గురయ్యాయి. ఆ విమర్శలు, ట్రోల్స్ ఎక్కువ కావడంతో వేణు స్వామి కొంతకాలం సైలెంట్ అయ్యారు. "ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పను" అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ తాజాగా బిగ్ బాస్ షోపై స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?

తాజాగా బిగ్ బాస్ షోపై, అందులో పాల్గొంటున్న కంటెస్టెంట్లపై, సోషల్ మీడియాలో వినిపిస్తున్న "బిగ్ బాస్ బ్యాన్ చేయాలి" అనే డిమాండ్లపై ఘాటుగా స్పందించారు. ఈ మేరకు జోత్యిష్యుడు వేణుస్వామి ఓ వీడియోషేర్ చేశారు. ఈ వీడియోలో "చాలా రోజుల తర్వాత కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాం" అంటూ ప్రారంభించారు. ఈసారి ఆయన జాతకాల గురించి కాదు, బిగ్ బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్లు, వారిపై వస్తున్న విమర్శలు గురించి మాట్లాడారు. తెలుగు మీడియా, సోషల్ మీడియా కాంట్రవర్సీలతో నిండిపోయాయని, అందుకే ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు.

Venu Swamy Reacts to Bigg Boss Controversy Slams Trolls Supports Viral Contestants

వేణు స్వామి మాట్లాడుతూ.. "తెలుగు రాష్ట్రాలు, తెలుగు మీడియా, తెలుగు సోషల్ మీడియాలు అంటేనే కాంట్రవర్శీ.. గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని మీడియాలో నేనూ చూసిన విషయం బిగ్‌బాస్ షోని బ్యాన్ చేయాలని.. అక్కడెక్కడో కంప్లెయింట్ కూడా ఇచ్చారట.. బిగ్ బాస్ షోని బ్యాన్ చేయాలని గొంతు చించుకుంటున్నారు. ఆ డిమాండ్ ఎవరి వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చు కానీ దాని వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం వేరేలా ఉంది. నిజానికి వాళ్లకు షోపై కంటే, అందులో పాల్గొంటున్న వారిపై అసూయ ఎక్కువగా ఉంది."అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, దువ్వాడ మాధురి, రీతూ చౌదరి వంటి కంటెస్టెంట్ల పేర్లను వేణుస్వామి ప్రస్తావించారు. ఈ ముగ్గురిని టార్గెట్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారని, కానీ అదే విమర్శల వల్ల వాళ్లు ఈరోజు సెలబ్రిటీలుగా మారారని వ్యాఖ్యానించారు. "అలేఖ్య పికిల్స్ అనే అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే సాధారణ అమ్మాయి. ఓ కస్టమర్ తో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆ ఆడియో వైరల్ కావడంతో ఆమె పేరే రెండు రాష్ట్రాల్లో వినిపించింది. ఇప్పుడు అదే అమ్మాయి బిగ్ బాస్ హౌస్‌లో ఉండడం కొంతమందికి తట్టుకోలేకపోతున్నారు" అన్నారు.

ఇక దువ్వాడ మాధురి, శ్రీనివాస్ వ్యక్తిగత జీవితాలను బయటపెట్టి మీడియా హడావుడి చేసింది. ఇక రీతూచౌదరి వందల కోట్ల స్కామ్‌ చేసిందని కథనాలతో కొందరు తమకు నచ్చిన విధంగా రూమర్స్ క్రియేట్ చేశారు. వ్యూస్ సంపాదించుకున్నారని చెప్పారు. వారి జీవితాలను పెంట పెంట చేశారు. ఇప్పుడు వారికి అసూయ పెరిగింది. వారి జీవితాలను నాశనం చేయాలని ప్రయత్నిస్తే.. ప్రజాదరణ పొంది, నేడు సెలబ్రిటీలు గా మారారు. వారికి వచ్చిన ఫేమ్ చూసి కొంతమంది తట్టుకోలేకపోతున్నారు.

"ఇప్పటి తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ ఒకటే. ఎవరినైనా టార్గెట్ చేయొచ్చు, ఎవరి జీవితాన్నైనా నాశనం చేయొచ్చు. కానీ ఆ టార్గెట్ చేసినవాళ్లే చివరికి సెలబ్రిటీగా మారుతున్నారు. అదే బిగ్ బాస్ షోలో కూడా కనిపిస్తోంది. ఈ రోజు ఉన్న కంటెస్టెంట్లలో ముగ్గురు కాంట్రవర్సీ నుంచి వచ్చినవాళ్లు, ఇద్దరు డ్రగ్స్ కేసుల్లో కూడా ఉన్నారు. అయినా వారు ఇప్పుడు స్టార్‌లు అయ్యారు. వారిపై ట్రోల్ చేసినవాళ్లే ఇప్పుడు కంట్రోల్ తప్పుతున్నారు. వాళ్లు ఎవరినైనా డౌన్ చేయాలని ప్రయత్నిస్తే, వారు స్టార్ అవుతున్నారు" అని వేణు స్వామి వ్యాఖ్యానించారు.

వేణు స్వామి వ్యాఖ్యల్లో మరో ముఖ్యమైన అంశమేమిటంటే.. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. "రంకులు, బూతు ఆడియోలు, సీఎంని తిట్టే వీడియోలు ఇవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కానీ ఒక జ్యోతిష్యుడు ఎవరి వివాహం గురించి మాట్లాడినా, మనోభావాలు దెబ్బతింటాయని అంటారు. మహాత్మా గాంధీని తిట్టినా ఎవరికీ మనోభావాలు దెబ్బతినవు. ఇదే మన సమాజం ధోరణి."అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఇలా వేణు స్వామి మాటల్లో మరో హైలైట్ విషమేమింటే.. "బిగ్ బాస్‌కి సోషల్ మీడియానే కంటెస్టెంట్లను సప్లై చేస్తుంది." ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ టీమ్ కొత్త కంటెస్టెంట్లను వెతికే పనిలేదు. సోషల్ మీడియా వాళ్లకే కంటెస్టెంట్లను తయారు చేస్తుంది. ఎవరినైనా వైరల్ చేస్తారు, తర్వాత వారినే షోలో చూస్తాం. కాబట్టి సోషల్ మీడియా విమర్శించడం కాదు, కొత్త సెలబ్రిటీలను పుట్టిస్తోంది."అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"మీ మీద ట్రోలింగ్ జరుగుతుందంటే బాధపడకండి. మీ జాతకం చాలా బావుంది. వాళ్లు మీమీద మీమ్స్ వేస్తే, మీరు స్టార్ అవుతారు. రేపు మీరు కూడా బిగ్ బాస్‌లో కనిపించే అవకాశం ఉంది. కాబట్టి భయపడకండి." అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నారు.
వేణు స్వామి గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయనకు పెద్ద ఇమేజ్ ఇచ్చినా, విమర్శల దాడి కారణంగా కొంతకాలం పబ్లిక్ లైఫ్‌ నుంచి దూరమయ్యారు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ కామెంట్స్‌తో ఆయన మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X