వాడితో సెటైతే సంసారం.. లేకపోతే సన్యాసం.. సార్ట్ యాంకర్ షాకింగ్ స్టేట్మెంట్
సెలబ్రిటీల జీవితం ఎప్పుడూ ప్రజల దృష్టిలోనే ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్లినా, ఏం మాట్లాడినా, ఏం చేసినా అది క్షణాల్లోనే వార్తగా మారిపోతుంది. వారు తమ జీవితాన్ని గోప్యంగా ఉంచడం చాలా కష్టం. సోషల్ మీడియా యుగంలో అయితే ఇది మరింత వేగంగా జరుగుతోంది. చిన్న కామెంట్, ఫోటో, లేదా వీడియో కూడా లక్షల వ్యూస్ సంపాదించి, నిమిషాల్లో ట్రెండ్‌గా మారిపోతుంది. అదే సమయంలో ట్రోల్స్, రూమర్స్ బారిన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ స్టార్ యాంకర్ 'అనుకున్నవాడు వస్తే.. పెళ్లి, లేదంటే సన్యాసం తీసుకుంటా' అని ప్రకటించింది. దీంతో ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ స్టార్ యాంకర్ ఎవరు? అసలేం జరిగింది?
ఆ స్టార్ యాంకర్ ఎవరో కాదు.. యాంకర్ గా, నటిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ (Vishnu Priya). తొలుత షార్ట్‌ఫిల్మ్స్, సినిమాలు, ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమెకు అసలు పాపులారిటీ తెచ్చినది "పోవే పోరా" అనే టీవీ షో. ఆ షోలో సుడిగాలి సుధీర్‌తో కలసి చేసిన అల్లరి, కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ షో తర్వాత విష్ణుప్రియ పేరు ప్రతి ఇంట్లో వినిపించేది. బుల్లితెరపై తనదైన స్టైల్‌తో, ఎక్స్‌ప్రెషన్స్‌తో, గ్లామర్‌తో ప్రేక్షకులను అలరించింది.

అదే సమయంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పాల్గొని మరింత ఫేమ్ సంపాదించింది. షోలో నటుడు పృథ్వీ (Prithvi)తో ఉన్న అనుబంధం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. వీరిద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారిందని అప్పట్లో సోషల్ మీడియాలో అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. బిగ్ బాస్ హౌస్‌లోనూ, బయటకీ వీరిద్దరూ కలిసే కనిపించడం వల్ల అభిమానులు వారిని "లవ్ బర్డ్స్"గా పిలవడం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రేమాయణం నిజమా కాదా అన్నది మాత్రం ఎవరు స్పష్టంగా చెప్పలేదు. బిగ్ బాస్ తర్వాత విష్ణుప్రియ కెరీర్ కొత్త దశలోకి అడుగుపెట్టింది. "కిరాక్ బాయ్స్", "ఖిలాడీ గర్ల్స్" వంటి షోలలో యాంకర్‌గా మెరిసి యూత్‌లో మరింత పాపులర్ అయింది.
అయితే.. ఈ యాంకర్ ఇప్పుడు కొత్త దారిలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు తెలుగు టెలివిజన్‌లో వరుస షోలతో హల్‌చల్ చేసిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అవుతోంది. కానీ ఇటీవల విష్ణుప్రియలో కనిపిస్తున్న మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పుడు మాత్రం ఆధ్యాత్మికత వైపు మళ్లింది. భగవద్గీత, దైవచింతన, ధ్యానం వంటి విషయాలపై పోస్టులు పెడుతూ, భక్తి భావంతో కూడిన జీవనశైలిని అనుసరిస్తోందని తెలుస్తోంది. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
జబర్దస్త్ ఫేమ్ లేడీ కమెడియన్ వర్ష (Varsha) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'కిస్సిక్ టాక్స్' షోలో ఈసారి గెస్ట్‌గా హాజరైంది విష్ణు ప్రియ (Vishnu Priya). ఫన్నీగా సాగే ఈ షోలో వర్షా చేసిన ఓ ప్రశ్నకు విష్ణు ప్రియ ఇచ్చిన సమాధానం మాత్రం అందరినీ షాక్‌కు గురిచేసింది.
యాంకర్ వర్షా నవ్వుతూ.. "ఇంత పద్ధతిగా వచ్చావు ఇవాళ... లవ్‌లో పడ్డావేమో అనిపిస్తోంది.. ఏదైనా మార్పు వచ్చిందా?" అని అడగగా, విష్ణు ప్రియ ఒక్కసారిగా సిగ్గుతో ఎర్రబడిపోయింది. వెంటనే వర్షా మాట్లాడుతూ.. "మేమూ చాలా ఎదురు చూస్తున్నాం ! నీ కాబోయే భర్త ఎవరో, ఎలా ఉంటారో తెలుసుకోవాలనుకుంటున్నాం!" అని మరో ప్రశ్న సంధించింది వర్ష.
అప్పుడే విష్ణు ప్రియ స్పందిస్తూ "నాకు శివుడు లాంటి బ్యాలెన్స్‌డ్ పర్సన్ కావాలి," అని చెప్పింది. వెంటనే వర్షా సరదాగా "అంటే పృథ్వీరాజ్‌లా అనుకుంటున్నావా?" అని ప్రశ్నించగానే, విష్ణు ప్రియ వెంటనే రియాక్షన్ మార్చింది. "మీరు ఎలా అనుకుంటే అలా," అంటూ నవ్వేసింది. అయితే ఆ తర్వాత విషయాన్ని కాస్త సీరియస్ చేసిందీ విష్ణు "అందరూ అనుకున్నట్లుగా వస్తే పెళ్లి చేసుకుంటాను... లేకపోతే సన్యాసం తీసుకుంటాను" అంటూ బాంబ్ పేల్చేసింది.
దీనితో స్టూడియోలో ఉన్నవాళ్లు షాక్ అయ్యారు. "అంటే నీకు నచ్చిన అబ్బాయి రాకపోతే నిజంగానే సన్యాసం తీసుకుంటావా?" అని వర్షా అడగగా "అవును, నా మైండ్‌లో ఉన్న ఆలోచన అదే. నేను ఒకరినే ఇష్టపడతాను... ఆయన వస్తే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే జీవితాన్ని ఒంటరిగా గడిపేస్తాను," అంటూ క్లారిటీ ఇచ్చింది.
ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "విష్ణు ప్రియ నిజంగా చాలా నిజాయితీ గల అమ్మాయి", "ప్రేమలో ఇంత స్థాయిలో నిబద్ధత చూపడం అరుదు" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నప్పుడు విష్ణు ప్రియ నిజాయితీని అందరూ చూశారు. ఆ సమయంలో ఆమె పృథ్వీరాజ్ శెట్టిని ప్రేమించింది. అతనికోసం గేమ్‌ను కూడా లెక్క చేయకుండా మెలిగింది.
టైటిల్ రేసులో ఉండగలిగినప్పటికీ ప్రేమ కోసం హౌస్ నుంచి బయటకు వచ్చింది. తర్వాత కూడా స్టార్ మా ఈవెంట్లలో జంటగా కనిపించారు. ఇప్పుడు ఈ కామెంట్స్‌తో పృథ్వీరాజ్ నిజంగానే విష్ణు ప్రియను పెళ్లి చేసుకుంటాడా? లేక అది షో కోసమా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా, "నచ్చినవాడు రాకపోతే సన్యాసం" అంటూ విష్ణు ప్రియ వేసిన ఈ డైలాగ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











