Don't Miss!
- News
బడ్జెట్‌ను ఆమోదించిన తెలంగాణ కేబినెట్: కేసీఆర్ దిశానిర్దేశం
- Finance
Twitter Blue: శుభవార్త చెప్పిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ బ్లూ ఖాతాదారులకు కనకవర్షం..
- Sports
INDvsAUS : ఆసీస్‌కు అది అలవాటే.. అది వాళ్ల మైండ్ గేమ్.. అశ్విన్ ఘాటు రిప్లై!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Bigg Boss లో మానస్‌కు ప్రియాంక సింగ్ మసాజ్.. కాష్మోరాల ఉన్నావంటూ వీజే సన్నీ షాకింగ్ కామెంట్స్
బిగ్‌బాస్ ఇంటిలో 14వ వారం ఇంటి సభ్యుల మధ్య సరదా సరదాగా టాస్క్‌లు జరుగుతున్నాయి. ఇంటిలో రెండో సంఘటన అనే టాస్క్ సందర్భంగా ప్రియాంక ఇంటి నుంచి వెళ్లే వరకు మానస్, ప్రియాంక జర్నీని ఎపిసోడ్‌గా చేయాలి అని బిగ్‌బాస్ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇంటిలో కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి ఎమోషనల్ సన్నివేశాలు ఎలా ఉన్నాయంటే..
Photos Courtesy: Star MAA and Disney+Hotstar

కాజల్ నాటకాలు వేయొద్దు అంటూ మానస్ వార్నింగ్
అయితే జర్నీని జర్నీగా చేయండి. కానీ ఎక్స్‌ట్రా చేయకండి. నేను వందసార్లు ఐలవ్ యూ చెప్పానా? నాటకాలు చేయవద్దు అంటూ మానస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆమె చేసేది నీ క్యారెక్టర్ మాత్రమే. ఎదుటి వాళ్ల మూడ్‌ను వేస్ట్ చేయకు అని సన్నీ అంటే.. నాది మూడ్ కాదా అంటూ మాసన్ గొడవ పడ్డాడు. దాంతో నేను జర్నీనే చేస్తాను. ఐ లవ్ యూ చెప్పను అంటూ కాజల్ చెప్పింది. అయితే కాజల్‌కు వీజే సన్నీ సలహాలు ఇస్తూ.. ఏదైనా బయటకు రాంగ్ వెళ్తుందేమోనని మానస్ భయపడుతున్నాడు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా చేయాలి అంటూ చెప్పాడు. అయితే నేను ఏదైనా చేస్తే మానస్ బాధపడుతాడు. కాబట్టి నేను మానస్ పాత్రను చేయను అంటూ ఆర్జే కాజల్ తప్పుకొన్నది.

మానస్ పాత్రను చేయ్యను అంటూ
అయితే రెండో సంఘటన టాస్క్ విషయంలో అలిగిన మానస్‌కు ఆర్జే కాజల్ నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అయితే మానస్ మాత్రం నా క్యారెక్టర్‌ను డామేజ్ చేయవద్దు అంటూ మానస్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో నేను మానస్ పాత్రను నేను చేయను అంటూ ఆర్జే కాజల్ అలిగింది. దాంతో క్యారెక్టర్‌లో ఉండు.. ఎందుకు మానస్ పాత్ర చేయనంటే ఎలా అంటూ వీజే సన్నీ చెప్పాడు. అయితే మానస్ పాత్ర చేయనని తెగేసి ఆర్జే కాజల్ చెప్పడంతో వీజే సన్నీ కూడా ప్రియాంక పాత్రను చేయనని చెప్పాడు. దాంతో మానస్ పాత్రను వీజే సన్నీ, ప్రియాంక పాత్రను మానస్ వేశారు

మానస్, వీజే సన్నీ మధ్య కెమిస్ట్రీ
అయితే ఈ టాస్క్‌లో ప్రియాంక సింగ్‌గా మానస్, జస్వంత్ పడాలగా షణ్ముఖ్ జస్వంత్, మానస్‌గా వీజే సన్నీ, లోబోగా శ్రీరామచంద్ర, వీజే సన్నీగా ఆర్జే కాజల్ నటించారు. మానస్ ప్రియాంక పాత్రను వేయడం నచ్చలేదు. నీవు వేస్తే బాగుండేది అని షన్ను, సిరి అన్నారు. అయితే ఆర్జే కాజల్ ఆత్రం పడింది. ఏం చేద్దాం అంటూ వీజే సన్నీ అన్నాడు. ప్రియాంకగా తయారైన మానస్ వచ్చాడు. అన్నయ్య నీ జట్టు బాగుందని.. లోబోగా నటించిన శ్రీరామచంద్రతో అంది. ఇదిలా ఉండగా, ప్రియాంకగా మానస్, మానస్‌గా వీజే సన్నీ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. బుగ్గమీద ఎర్రగా ఉంటే.. ఏమైంది అంటే అది బ్లష్.. ప్యారిస్ నుంచి తెచ్చుకొన్నాను అంటూ ప్రియాంకగా నటించిన మానస్ చెప్పాడు.

పింకి, మానస్ రొమాంటిక్ సీన్లు రీక్రియేట్
ప్రియాంక, మానస్ మధ్య రొమాన్స్ సీన్లను సన్నీ క్రియేట్ చేశాడు. పింకి నాకు హాట్ వాటర్ కావాలి అంటూ ఇప్పడే తెస్తాను అంటూ వెళ్లిపోయింది. టాస్క్‌లో గాయపడిన మానస్‌కు ప్రియాంక మసాజ్ చేసింది. ప్రియాంకతో రొమాంటిక్‌గా మాట్లాడుతూ... నడుముపై బామ్ రాస్తూ.. ఇక్కడేనా అంటూ రుద్దడం మొదలుపెట్టింది. వెంటనే చాలూ అంటే.. అలానే పింకి పాత్రలో ఉన్న మానస్ రాస్తూనే ఉన్నాడు. అయితే చాలూ చాలూ అంటే అలానే రాస్తున్నావు.. ఒక్కసారి చెబితే నీకు అర్ధం కాదా అంటూ ప్రియాంకపై మానస్ అరిచాడు. అలా అరవకుండా చెప్పవచ్చు కదా అంటూ ప్రియాంక వెళ్లిపోయింది. అలాగే ప్రియాంకకు కూడా మానస్ మసాజ్ చేశాడు.

నిజంగా ప్రియాంక లాంటి అమ్మాయి దొరకడం
ప్రియాంక (మానస్) నడిచి వస్తుంటే.. మానస్ (వీజేసన్నీ)తో ఆర్జే కాజల్ మాట్లాడుతూ... నీకు ఇలాంటి అమ్మాయి దొరకడం నిజంగా అదృష్టం అంటూ కనిపించింది. అయితే దారుణమైన మేకప్ వస్తున్న ప్రియాంకను చూసి.. నీవు కాష్మోరాలా ఉన్నావు. పొరపాటున డోర్లు తీస్తే బయటకు పారిపోతాను అంటూ కామెంట్ చేశాడు. దాంతో అరేయ్ ఆ మాట అనకు అంటూ ప్రియాంక పాత్రలో ఉన్న మానస్ అంటూ బెదిరించాడు.
Recommended Video

ప్రియాంకకు గోరు ముద్దలు తినే సీన్
మానస్‌తో ప్రియాంక పదే పదే ఏం ఆశిస్తున్నావు అంటూ సాగే ఎపిసోడ్‌ను క్రియేట్ చేస్తానని ఆర్జే కాజల్‌కు వీజే సన్నీ చెప్పడంతో ఆమె షాక్ అయింది. అయితే తాను భయపడేది లేదు. తప్పనిసరిగా నేను చేస్తాను అంటూ కిచెన్‌లోకి వెళ్లి ప్రియాంకు గొరుముద్దలు తీనే సీన్‌ను క్రియేట్ చేశాడు. చాలా ఎమోషనల్‌గా కౌగిలించుకొంటూ సీన్‌ను రక్తికట్టించాడు. ప్రియాంకగా మానస్, మానస్‌గా వీజే సన్నీ అద్భుతంగా నటించారు.