»   » బావా.. నన్ను పోలీసులు పట్టుకొన్నారు.. కాపాడు.. ప్రభాస్‌కు రానా ఫోన్.. ఏం జరిగింది? ఎక్కడ?

బావా.. నన్ను పోలీసులు పట్టుకొన్నారు.. కాపాడు.. ప్రభాస్‌కు రానా ఫోన్.. ఏం జరిగింది? ఎక్కడ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సిరీస్‌లో ప్రభాస్, రానా దగ్గుబాటి నువ్వా నేనా అనే తీరులో నటించారు. బాహుబలిగా ప్రభాస్ ఉన్నతమైన వ్యక్తిగా, ధైర్యవంతుడిగా కనిపించగా, రానా దుష్టుడిగా, అధికారం కోసం ఎంతకైనా తెగించే భళ్లాల దేవ పాత్రను పోషించాడు. తెరమీద ప్రాణాలు తీసుకోవడానికైనా వెనుకాడని వీరిద్దరూ నిజ జీవితంలో మంచి స్నేహితులు. ఇటీవల ప్రభాస్‌కు ఫోన్ చేసి పోలీసులు పట్టుకొన్నాడు తెలిపారు. అందుకు ప్రభాస్ ఏమన్నాడంటే..

నా పేరు చెప్పు వదిలి..

నా పేరు చెప్పు వదిలి..

రానా ఫోన్‌లో మాట్లాడినంత సేపు సావధానంగా ప్రభాస్ విన్నాడు. ఆ తర్వాత బదులిస్తూ.. బాహుబలితో నటించాను. అతడు నా మిత్రుడు అని చెప్పు. తప్పకుండా వదిలిపెడుతాడు అని ప్రభాస్ చాలా తాపీగా అన్నాడు. ఈ సరదా సంభాషణ ఇటీవల రానా పాల్గొన్న టెలివిజన్ కార్యక్రమంలో జరిగింది.

టీవీ షోలో భాగంగా..

బాహబులి2 విడుదలకు ముందు ఓ ప్రముఖ టెలివిజన్ సంస్థలో యాంకర్ ప్రదీప్ హోస్ట్‌గా వ్యవహరించే ‘కొంచెం టచ్ ‌లో ఉంటే చెప్తా' అనే కార్యక్రమంలో రానా పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో భాగంగా ఎవరికైనా కాల్ చేసే (ప్రాంక్ కాల్) చేసే ఆప్షన్ ఉంటుంది. ఈ సందర్బంగా రానా ఆ ఫోన్‌ను ప్రభాస్‌కు కలిపాడు. ఆ సంభాషణలో భాగంగా బావ నన్ను పోలీసుల పట్టుకొన్నారు. విడిపించానికి సహాయం చేయమని రానా ఆర్థించారు.

నువ్వే గుర్తొచ్చావ్ డార్లింగ్..

నువ్వే గుర్తొచ్చావ్ డార్లింగ్..

ఆ తర్వాత నేను ప్రదీప్ షో‌లో పార్టిసిపేట్ అవుతున్నాను. ఈ సందర్బంగా ఎవరికైనా కాల్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది. ఫోన్ చేయాలని సూచించగానే వెంటనే నాకు నువ్వే గుర్తొచ్చావు డార్లింగ్ అంటూ రానా చెప్పగానే ప్రభాస్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

స్నేహం బంధం మరింత..

స్నేహం బంధం మరింత..

బాహుబలి షూటింగ్ దాదాపు ఐదేళ్లు సాగింది. ఆ షూటింగ్ సమయంలో రానా, ప్రభాస్ మధ్య స్నేహబంధం మరింత ధృడపడింది. బాహుబలి2 ప్రమోషన్ సందర్భంగా వారి మధ్య ఉన్న స్నేహం గురించి పలుమార్లు మీడియాకు రానా చెప్పారు కూడా.

కలెక్షన్ల మోత..

కలెక్షన్ల మోత..

ఏప్రిల్ 28న విడుదలైన బాహుబలి2 సినిమా కలెక్షన్ల మోత మోగిస్తున్నది. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు రూ.500 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. వారాంతంలో కూడా అదే ఊపు కొనసాగుతున్నది. మే 1 తేదీ సోమవారం కూడా సెలవు దినం కావడంతో వసూళ్ల రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

English summary
Rana Daggubati in a recent episode of the chat show Konchem Touch lo Unte Chepta spilled out the beans about one such prank. Turns out, Rana made a prank call to Prabhas and said that he wanted help because the police has caught him!. Prabhas patiently listened to Rana and then said, "Tell the police that you are in Baahubali 2 as my companion and they will leave you."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu