ఎంటీవీ రియాల్టీ షో: ఒక్కొక్కరు అందుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

'ఎంటీవీ రోడీస్'... ఇండియాలో బాగా పాపులరైన అడ్వంచర్ బేస్డ్ రియాల్టీ షో. రఘురామ్, రాజీవ్ లక్ష్మణ్, ఆర్‌జే అమిత్ క్రియేట్ చేసిన ఈ షో యువతను బాగా ఆకట్టుకుంటోంది. 2013లో మొదలవ్వగా ప్రస్తుతం 16వ సీజన్ రన్ అవుతోంది.

కొందరు ఇందులో బాగా పాపులర్ కావడంతో ఫస్ట్ సీజన్ నుంచి కంటిన్యూ అవుతున్నారు. ఈ షోలో పాల్గొన్నందుకు వారు అందుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక్కో ఎపిసోడ్‌కు లక్షల్లో చార్జ్ చేస్తున్నారు.

రన్విజయ్ సింఘా

రన్విజయ్ సింఘా

రన్విజయ్ సింఘా తొలి సీజన్లో పార్టిసిపేట్ చేశాడు. ఈ షోలో విజేతగా నిలవడం ద్వారా సెకండ్ సీజన్ హోస్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఇంతకు ముందు ఇతడు గ్యాంగ్ లీడర్‌గా షోలో కనిపించాడు. ఈ షోలో ఎక్కువకాలం అసోసియేట్ అయింది ఇతడే. ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 11 నుంచి 12 లక్షలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

నిఖిల్ చిన్నప్ప

నిఖిల్ చిన్నప్ప

పాపులర్ డిజే నిఖిల్ చిన్నప్ప కూడా ఈ షోతో చాలా కాలంగా అసోసియేట్ ఉన్నాడు. ప్రస్తుతం ఇతడు షోలో గ్యాంగ్ లీడర్‌గా ఉన్నాడు. ఇతగాడికి ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 9 లక్షల పేమెంట్ అందుతున్నట్లు సమాచారం. సెకండ్ హయ్యెస్ట్ పేమెంట్ ఇది.

ప్రిన్స్ నరులా

ప్రిన్స్ నరులా

ప్రిన్స్ నరూలా ఇంతకు ముందు స్పిట్స్ విల్లా, బిగ్ బాస్ లాంటి రియాల్టీ షోలలో పాల్గొన్నాడు. ఎంటీవీ రోడీస్ ఎక్స్ 2 విజేతగా నిలిచాడు. 2016 నుంచి ఇతడు గ్యాంగ్ లీడర్‌గా కొనసాగుతున్నాడు. ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 7 లక్షల రెమ్యూనరేషన్ అందుకుంటాడట.

నేహా ధూపియా

నేహా ధూపియా

ఈ షోలో బాలీవుడ్ యాక్టర్ నేహా ధూపియా కూడా 2016 నుంచి గ్యాంగ్ లీడర్‌గా ఉన్నారు. ఈ బ్యూటీ ప్రిన్స్ నరులాతో సమానంగా ఒక్కో ఓపిసోడ్ కోసం రూ. 7 లక్షలు తీసుకుంటోంది.

రాఫ్తార్, సందీప్ సింగ్

రాఫ్తార్, సందీప్ సింగ్

రాపర్ రాఫ్తార్ ఈ షోలో 2018లో గ్యాంగ్ లీడర్‌గా ఎంటరయ్యాడు. ఒక్కో ఎపిసోడ్ కోసం రూ. 4.5 లక్షలు అందుకుంటున్నట్లు సమాచారం. హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ రూ. 4 లక్షలు ఒక్కో ఎపిసోడ్‌కు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X