»   » సూపర్ గా ఉంది :చిరంజీవి విజిల్ ప్రోమోతో దుమ్ము రేపాడు (వీడియో)

సూపర్ గా ఉంది :చిరంజీవి విజిల్ ప్రోమోతో దుమ్ము రేపాడు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'మీలో ఎవరు కోటీశ్వరుడు' నాలుగో సీజన్ కు చిరు హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఈ షోకు సంబందించిన ప్రోమోను 'మెగా సర్ ప్రైజ్' పేరుతో మాటీవీ ఛానెల్ కొద్ది రోజుల క్రితం విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ షో కు సంభందించిని కొత్త ప్రోమోని విడుదల చేసింది. ఈ ప్రోమో మొత్తం విజిల్ తో సాగటం విశేషం. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

నాలుగు రోజుల క్రితం వదిలిన ప్రోమోలో.. 'కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టినవాడు మీతో కోటి గెలిపించేందుకు వస్తున్నాడు' అంటూ సాగే ఈ ప్రోమోలో చిరంజీవి ఎంట్రీ ఇస్తున్న దృశ్యాలను షూట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రోమోటో మెగా అభిమానాలు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. ఇకపోతే ఈ షో 1డిసెంబర్ 2 నుండి మాటీవీలో ప్రసారం కానుంది. ఆ ప్రోమోని మీరు ఇక్కడ చూడవచ్చు.

ఈ టీజర్ లో చిరంజీవి అదిరిపోయాడనే చెప్పాలి. 'వెండితెర మీద మీరు నన్ను గెలిపించారు. బుల్లి తెర మీద మిమ్మలని గెలిపించటానికి వస్తున్నాను. కమాన్. లెటజ్ ప్లే ' అంటూ చిరంజీవి చెప్పే డైలాగుకు విజిల్స్ వేయాల్సిందే. ఇలాంటి డైలాగుతో చిరంజీవిని ఎంట్రీ ఇచ్చిన మా టీవి క్రియేటివ్ టీమ్ ని అభినందించాల్సిందే. ఈ షో గురించిన మరిన్ని విశేషాలు క్రింద చదవండి...

మీలో ఎవరు కోటీశ్వరుడు ఎందుకు నో చెప్పానంటే

మీలో ఎవరు కోటీశ్వరుడు ఎందుకు నో చెప్పానంటే

మూడవ సీజన్ పూర్తి కాకముందే నాలుగవ సీజన్ చేయనని ముందే చెప్పాను. అంతే కాకుండా నాగచైతన్య, అఖిల్‌తో సినిమాలు చేస్తానని మాటిచ్చాను. ఆ ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలి. దీనికి చాలా సమయం పడుతుంది. అందుకే మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి తప్పుకున్నాను అంటూ నాగార్జున వివరణ ఇచ్చారు.

చిరు, నాగ్ ఎదురెదురుగా...

చిరు, నాగ్ ఎదురెదురుగా...

నాగార్జున కంటిన్యూ చేస్తూ నాలుగవ సీజన్‌లో చిరంజీవిగారు హోస్ట్‌గా వ్యవహరిస్తారు. త్వరలో దీనికి సంబంధించిన చిత్రీకరణ మొదలౌతుంది. ఈ కార్యక్రమంలో ఎపిసోడ్‌లో చిరంజీవితో కలిసి హాట్ సీట్‌లో అతిథిగా నేనూ కనిపిస్తాను అని చెప్పుకొచ్చారు. అంటే నాగార్జున హాట్ సీట్ లో కూర్చుంటే భలే గమ్మత్తుగా ఉంటుంది కదూ.

సెప్టెంబర్ నుంచే..

సెప్టెంబర్ నుంచే..

డిసెంబర్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రసారం ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ లోనే షూటింగ్ మొదలుపెట్టేస్తారని తెలుస్తోంది. త్వరలో ఎంఈకే4 షూటింగ్ మొదలుపెట్టి.. ఈ నెలలో కొన్ని ఎపిసోడ్స్ ను.. అక్టోబర్ లో కొన్ని ఎపిసో్డ్స్ ను పిక్చరైజ్ చేయనున్నారట. ప్లానింగ్ సరిగ్గా చూసుకోకపోతే ఇబ్బందులు ఎదురౌతాయని, తన 150 వ చిత్రానికి దెబ్బ కొట్టకుండా ప్లాన్ చేస్తున్నారట.

ఎన్ని చెప్పినా రెస్పాన్స్ చూసే..

ఎన్ని చెప్పినా రెస్పాన్స్ చూసే..

అలాగే.. చిరంజీవి చేయబోతున్న ఈ 4 వ సీజన్ కి వచ్చిన రియాక్షన్ ను బట్టి.. మీలో ఎవరు కోటీశ్వరుడు 5కి కూడా మెగాస్టార్ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే.. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి కనిపించనుండనే సరికి... బోలెండత ఆసక్తి జెనరేట్ అవుతోంది. అయితే చిరంజీవి ఏ మేరకు బుల్లి తెరపై విజృంభిస్తాడన్నది తెలియాల్సి ఉంది.

150 వ సినిమాకు సైతం ఇదే..

150 వ సినిమాకు సైతం ఇదే..

డిసెంబర్ లోనే చిరంజీవి వ్యాఖ్యాతగా చేయనున్న మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం ప్రసారం కానుండడం.. జనవరిలో చిరంజీవి150 సినిమా ఖైదీ నెంబర్ 150కి బాగా ప్లస్ అవుతుందని అంచనాలు ఏర్పడుతున్నాయి.

సినిమా ప్రమోషన్ లో ఇదో భాగం

సినిమా ప్రమోషన్ లో ఇదో భాగం

అదే టైంలో.. మెగా 150 విడుదలకు ముందు ప్రసారం కానుండడం.. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ పై ఆడియన్స్-ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపించేందుకు కారణం కానుంది. అందుకే ఇలా తన 150 వ సినిమాని ప్రమోషన్ చేసుకునేందుకు చిరంజీవి ఈ పోగ్రామ్ ని వేదికగా చేసుకుంటారని చెప్పుకుంటున్నారు.

అమితాబ్ ప్లేసునే..ఇప్పుడు చిరు

అమితాబ్ ప్లేసునే..ఇప్పుడు చిరు

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ హిందీలో కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి లాంటి బుల్లితెర షోను ఓ రేంజ్‌లో హిట్ చేశారు. ఇక ఇక్క‌డ మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోను కూడా నాగార్జున సైతం అదే రీత‌లో ర‌క్తిక‌ట్టించి అంద‌రూ ఈ షోకు అతుక్కుపోయేలా చేశారు. మోదటి మూడు సిరీస్ లలోనూ మంచి రేటింగ్ నే రాబట్టుకుంది. ఒక్కొక్క ప్రశ్నతో ఒక్కొక్క మెట్టే ఎక్కిస్తూ మన తెలివితేటలతోనే లక్షలు సంపాధించుకునే కాన్సెప్ట్ తో వచ్చిన ప్రోగ్రాం లు తెలుగులో తక్కువే.

చిరుకు సవాలే మరి

చిరుకు సవాలే మరి

ఈ పోగ్రామ్ ని ..మళయాలం లో మమ్ముట్టి కోటీశ్వరన్ అంటూ అప్పట్లో మంచి మార్కెట్ నే రాబట్టుకునే ప్రయత్నం చేసాయి.ఈ సిరీస్ కొన్నాళ్ళూ సురేష్ గోపి కూడా హోస్ట్ గా చేసారు . కానీ ఈ షోలు ఏవీ కూడా అమితాబ్ స్టామినా ముందు నిలబదలేక పోయాయి. తర్వాత మన తెలుగులో నాగార్జున మాత్రమే సక్సెస్ అయ్యారు. దాంతో ఇది చిరుకు సవాల్ లాంటిదే.

సినిమా టెన్షన్ తో పాటు ఇది కూడా

సినిమా టెన్షన్ తో పాటు ఇది కూడా

మెగాస్టార్ చిరంజీవి హాట్ సీట్ మీదికి వెల్కం అంటూ మనల్ని తీసుకు వెళ్తాడన్న మాట అని ఫ్యాన్స్ అంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దాదాపు పదేళ్లపాటు వెండితెరకు దూరమై ఇప్పుడు మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు మెగాస్టార్‌ . వినాయక్‌ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తానని మెగాస్టార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

టైమింగ్ మారదు

టైమింగ్ మారదు

నాగార్జున స్థానంలో చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఆయన రాకతో ఆ ప్రోగ్రామ్‌ రేంజ్‌ మరింత పెరుగుతుంద'ని ఆయన వ్యాఖ్యానించాడు. చిరు కోసం టైమింగ్స్ కూడా మార్చారు. సోమవారం నుంచి గురువారం దాకా ప్రతీరోజూ రాత్రి 8-30 గంటలకే ఇది ప్రసారమవుతుంది.

షారూఖ్ చేస్తే ఫ్లాఫ్..మరి చిరు చేస్తే..

షారూఖ్ చేస్తే ఫ్లాఫ్..మరి చిరు చేస్తే..

గతంలో హిందీ వెర్షన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి' సమయంలోనూ ఇలాంటి సమస్యే ఏర్పడింది. తొలుత అమితాబ్ బచ్చన్ తో ప్రారంభమైన షో సూపర్ హిట్టయింది. ఆయన తప్పుకోవడంతో షారుక్ ఖాన్ తో చేసారు. అయితే షారుక్ తో చేసిన షో అట్టర్ ప్లాప్ అయింది. మళ్లీ అమితాబ్ బచ్చన్ తో చేయడంతో పుంజుకుంది.

రెండూ బ్యాలన్స్ చేస్తాడా చిరు

రెండూ బ్యాలన్స్ చేస్తాడా చిరు

ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న తన 150 వ చిత్రం చాలా ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్నాడు చిరు. మరో ప్రక్క తను జనంలోకి వెళ్లటం కోసం మీలో ఎవరు కోటీశ్వరుడు పోగ్రాంలోకి వస్తున్నాడు. అయితే ఈ రెండు గుర్రాల సవారి ఎంతవరకూ లాభిస్తుంది అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. చిరంజీవి వంటి మల్టి టాలెంట్ ఉన్న వ్యక్తికి ఇది సాధ్యమే అంటున్నారు అభిమానులు.

English summary
After the initial promo, MAA has come up with a new ad, where Chiranjeevi is seen walking past a wall to which photoframes that feature him at various ages are hung.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu