»   » కుక్కకు విసిరినట్లు విసిరితే..: చిరు‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో పై యండమూరి కామెంట్స్

కుక్కకు విసిరినట్లు విసిరితే..: చిరు‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో పై యండమూరి కామెంట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పటికే యండమూరి కి మెగా ఫ్యామిలీకు మధ్య చాలా దూరం పెరిగిపోయింది. ఆ మధ్యన రామ్ చరణ్ మీద యండమూరి వీరేంద్రనాథ్ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. అంతా మర్చిపోయారనుకున్న సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఆ కామెంట్లను తవ్వి మరింత చర్చ జరిగేలా చేశాడు. దాంతో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న యండమూరి.. ఆయనకు చాలా దూరమైపోయారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ముగిసింది అనుకునేలోగా మరో అద్యాయానికి తెర లేచింది.

చిరు హోస్ట్ చేసే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రాం మీద ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే కావాలనో లేక క్యాజవల్ గానో ఈ షోను ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేసారు. అయితే పర్టికులర్ గా చిరును ఉద్దేశించి యండమూరి ఏమీ అనలేదు కానీ.. ఎంఈకే షో మీద మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం చర్చనీయాంశం అయ్యింది.

ఇంతకీ ఈ షో విషయంలో యండమూరి ఏమంటారంటే...''టీవీ అంటే ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్. నీ మొగుడే నా మొగుడు.. నీకు నాకు ఒకడే మొగుడు.. నీ కొత్త మొగుడే నా పాత మొగుడు. ఇలాంటి సీరియల్స్ చూసి నా జన్మ ధన్యమైపోయిందనుకుంటారు. ఇక కౌన్ బనేగా కరోడ్ పతి.. మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి షోలు వచ్చాయి. ఆ షోలో పాల్గొనాలంటే ముందు మూడు మెసేజ్ లు పంపాలి. ఒక్కో మెసేజ్ కు 5 రూపాయల చొప్పున.. 15 రూపాయలు సమర్పించుకోవాలి.

Yandamuri Comments On Chiranjeevi Meelo Evaru Koteeswarudu

పది లక్షల మంది దగ్గర 15 రూపాయల చొప్పున వసూలు చేసి కోటిన్నర జేబులో వేసుకుంటాడు. తర్వాత ఐదారు లక్షలు కుక్కకు విసిరినట్లు విసిరితే.. చొంగ కార్చుకుంటూ తీసుకుంటాం. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇంతకంటే హీనం ఇంకొకటి ఉండదు. ఎరవేసి డబ్బులు సంపాదిస్తున్నారు.

పేదవాళ్లు.. తినడానికి బియ్యం కూడా లేనివాళ్లు ఆశతో మెసేజ్ లు పంపించి.. 15 రూపాయలు పోగొట్టుకుంటున్నారు. దీని కంటే లాటరీ టికెట్ కొనడం మేలు. లాటరీల్ని బ్యాన్ చేసినందుకు నాకీ ప్రభుత్వం మీద చాలా కోపం ఉంది. దాన్ని బ్యాన్ చేస్తే ఇలాంటి గ్యాంబ్లింగ్స్ అన్నీ బ్యాన్ చేయాలి'' అనేసారు యండమూరి.

మనసు ఏముందో అది మొహమాటం లేకుండా బయటకు చెప్పేయడం రచయిత యండమూరి వీరేంద్రనాధ్ నైజం అలాగే ఈ మాటలు కూడా ఆయన అన్నారని ఆయన అబిమానుల అంటున్నారు. ఈ విషయంలో ఎవరేమన్నా ఆయన పెద్దగా పట్టించుకోరు. సొసైటీలో జరుగుతున్న దాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారాయన అంటున్నారు.

అయితే ఇప్పుడు ఆయన వ్యాఖ్యలను పెడర్ధాలు తీయడం కొంతమంది మొదలుపెట్టారు. చిరంజీవి ఆ షో చేయడంవల్లే ఆయన ఇలా అన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే...'ఖైదీ నెంబర్ 150'తో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎంఈకే షోకు రెస్పాన్స్ అదిరిపోతుందని టీవి ఛానెల్ వాళ్లే కాకుండా సామాన్య ప్రేక్షకులు కూడా భావించారు. దానికి తోడు ..ఈ షో ఆరంభంలోనే నాగార్జున గెస్ట్ గా విచ్చేశాడు. ఒక పార్టిసిపెంట్ కోటి రూపాయల ప్రశ్న వరకు వెళ్లాడు. అయినా ఈ ప్రోగ్రాంకు ఆశించిన స్థాయిలో రేటింగ్స్ రాలేదనే విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది.

ఈ షో ప్రసారమైన వారంలో టీఆర్పీ రేటింగ్స్ లిస్టులోనూ 'ఎంఈకే'కు టాప్ ప్లేస్ లో ఉంటుందనుకుంటే అలాంటిదేమీ దక్కలేదు. అసలు టాప్-5లోనే ఎంఈకే లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమైంది. బార్క్ రేటింగ్స్ ప్రకారం గత వారం 'జనతా గ్యారేజ్' ప్రిమియర్ షో అగ్రస్థానంలో ఉంటే.. తర్వాతి నాలుగు స్థానాల్ని టీవీ సీరియల్స్ దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చాయి.

English summary
Yandamuri comments Chiranjeevi’s MEK Show Is Cheating People, Watch Megastar Chiranjeevi made his grand comeback into the Tollywood with Khaidi No 150. He also entered the small screen with the hit show Meelo Evaru Koteeswarudu as host.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu