X
తెలుగు » సినిమాలు » గీత గోవిందం
గీత గోవిందం

గీత గోవిందం

Romance | 15 Aug 2018 | U/A |
Telugu

2.6 /5 Users

3.5 /5 Filmibeat

గీత గోవిందం స్టోరీ

గీత గోవిందం సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ దేవరకొండ, రష్మిక మందన్న, నాగేంద్ర బాబు, రాహుల్ రవింద్రన్, అభయ్ బెతిగంటి   తదితరులు ప్రధానపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం పరశురామ్ వహించారు మరియు నిర్మాత బన్ని వాసు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపీసుందర్ అందించారు.   కథ జయ్ గోవిందం (విజయ్ దేవరకొండ) కాలేజీలో లెక్చరర్. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన విజయ్‌కి చెల్లెలు, తండ్రి (నాగబాబు) ఉంటారు. కాబోయే భార్య తనకు తల్లిలా ఉండాలని కోరుకొంటాడు. అలాంటి లక్షణాలు ఉన్న గీత (రష్మిక మందన్న)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ప్రేమ కోసం పరితపిస్తుండగా బస్‌లో విజయ్ చేసిన ఓ పనికి అతడిపై గీతకు అసహ్యం ఏర్పడుతుంది. తనతో తప్పుడుగా ప్రవర్తించారని తన అన్నకు గీత చెబుతుంది. కానీ ఆ పని చేసింది విజయ్ అని గీత అన్నకు తెలియక చంపడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో విజయ్ చెల్లెలికి గీత అన్న( సుబ్బరాజు)కు పెళ్లి కుదురుతుంది. ఆ తర్వాత కొన్ని సంఘటనలు విజయ్‌ని గీత మరింత అసహ్యించుకొనేలా చేస్తాయి. ఈ నేపథ్యంలో ఓ అనుకొని సంఘటన కారణంగా గీత, గోవిందానికి పెళ్లి కుదురుతుంది. కానీ గీతను పెళ్లి చేసుకోవడానికి విజయ్ రిజెక్ట్ చేస్తాడు. ప్రేమతో దగ్గర కావాల్సిన గీత, గోవిందం మధ్య విభేదాలు ఎంత వరకు వెళ్లాయి. గీతతో పెళ్లి కుదిరిన తర్వాత ఎందుకు రిజెక్ట్ చేశాడు. విజయ్ గోవిందం చెల్లెలి పెళ్లి గీత అన్నతో జరిగిందా? తన దగ్గరి బంధువు (వెన్నెల కిషోర్‌)తో గీత కుదిరిన పెళ్లి ఎంత వరకు వెళ్లింది. ఆ తర్వాత రియలైజ్ అయిన విజయ్ గోవిందం గీతను దక్కించుకోవడానికి ఏం చేశాడు? ఈ చిత్రంలోని కథకు నిత్య మీనన్, అను ఇమ్మాన్యుయేల్ పాత్రలేంటి అనే ప్రశ్నలకు సమాధానమే గీత గోవిందం సినిమా కథ. 
Read More

గీత గోవిందం కాస్ట్ & క్రూ

గీత గోవిందం సిబ్బంది సమాచారం

దర్శకత్వం పరశూరామ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత బన్ని వాసు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గీత గోవిందం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
గీత గోవిందం చిత్రం యూత్‌కు కిక్కించే మందులాంటిదైతే, ఫ్యామిలీ ఆడియెన్స్‌‌కు పండుగ భోజనం లాంటింది. కథ, కథనాలు ఈ సినిమాకు బలంగా మారాయి. వినోదంతోపాటు, ఓ ఫీల్‌గుడ్ సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రేక్షకుడు వెచ్చించిన ప్రతీ పైసాకు రెండింతల వినోదం దొరుకుతుంది. అర్జున్ రెడ్డి తర్వాత అంతకంటే గొప్ప కమర్షియల్ హిట్‌ విజయ్ దేవరకొండ ఖాతాలో పడటం ఖాయం.

గీత గోవిందం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

గీత గోవిందం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+