X
తెలుగు » సినిమాలు » పండగ చేస్కో
పండగ చేస్కో

పండగ చేస్కో

Action | Romance | 29 May 2015 | U/A |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

పండగ చేస్కో స్టోరీ

పండగ చేస్కో సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌ , సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర ముఖ్య తారాగణం నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపిచంద్ మలినేని నిర్వహించారు మరియు నిర్మాత పరుచురి కీర్తి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకత్వం తమన్ యస్ యస్ నిర్వహించారు. కథ ఎన్నారై...కార్తీక్ (రామ్) చాలా తెలివైనవాడు..స్వశక్తితో ఎదిగినవాడు...కమర్షియల్ మైండ్ ఉన్నవాడు..ఎలాంటి సమస్యను అయినా చిటికెలో పరిష్కారం చూపగలవాడు....ముఖ్యంగా పేద్ద బిజినెస్ మ్యాన్...మిలియనీర్. ఇలా బోల్డ్ లక్షణాల...అంతులేని ఆస్దితో విరసిల్లే లోకల్ గా ఉండే బిజినెస్ వుమెన్ అనుష్క (సోనాల్ చౌహన్) ని పెళ్లి చేసుకుని, వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకుంటాడు. అందుకోసం ఆమెను ఎప్రోచ్ అయ్యి...ఎంగేజ్ మెంట్ సైతం చేసుకుంటాడు. అయితే ఈ లోగా అతను ఇండియా వెల్లాల్సిన అర్జెంట్ పని ఏర్పడుతుంది. ఎందుకయ్యా అంటే ఇండియాలో ఉండే హీరోయిన్... దివ్య (రకుల్ ప్రీత్ సింగ్) అతని ఫ్యాక్టరీమీద పొల్యూషన్ కేసు వేస్తుంది. ఇంతకీ దివ్య ఏం చేస్తుంది అంటే గో గ్రీన్..గ్రీన్ ఆర్మీ అంటూ మొక్కలు,కాలష్యం గురించి ఉద్యమాలు గట్రా చేస్తూంది. అయితే ఆమెకో కుటుంబ సమస్య ఉంటుంది. మేనమామ సాయిరెడ్డి (సాయికుమార్),తండ్రి భూపతి(సంపత్) కు ఉన్న కక్షలు మధ్య నలిగిపోతూంటుంది. ఈ క్రమంలో...మన హీరో గారు ఇండియాకు రావటం...ఆమెను కలవటం..కొన్ని అనుకోని పరిస్దితుల్లో ఆమె కుటుంబంలో ఉన్న గొడవలు తీర్చి , చక్కదిద్ది...ఆమె చేయి పట్టుకోవాలని నిర్ణయించుకోవటం జరుగుతాయి. ఈ లోగా అసలు కార్తీక్ ఎవరో ట్విస్ట్ రివిల్ అవుతుంది. ఇంతకీ దివ్య కుటుంబానికి ఉన్న గొడవలు ఏంటి... కార్తీక్ ఎవరూ...దివ్య కేసు విత్ డ్రా చేసుకుందా...హీరో...మొదట పెళ్లి చేసుకుందామనుకున్న అనుష్క పరిస్దితి ఏమిటి.. వీకెండ్ వెంకట్రావు పాత్రలో కనిపించిన బ్రహ్మానందం రోల్ ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా ఓపికగా చివరి దాకా చూడాల్సిందే.
Read More

పండగ చేస్కో కాస్ట్ & క్రూ

పండగ చేస్కో సిబ్బంది సమాచారం

దర్శకత్వం గోపిచంద్ మలినేని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత పరుచూరి కిరిటి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

పండగ చేస్కో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
తను గతంలో చేసి, ట్రెండ్ సెట్టర్ గా నిలిపిన రెడీ కథనే కొద్దిగా మార్చి, అందులో అత్తారింటికి దారేది కలిపి చేయాలనే ఆలోచన రామ్ కు వచ్చినందుకు మొదట ఆశ్చర్యం వేస్తూంటుంది. పోనీ అదీ సవ్యంగా చేసారా అంటే అదీ కనపడదు..తెలుగులో హిట్టైన సినిమాల్లోని.... అన్ని ఎలిమెంట్స్ తీసుకువచ్చి ఇందులో కలిపేసి తిరగమొత పెట్టే పనిచేసారు. దాంతో ప్రతీ సీన్ ఎక్కడో చూసినట్లు...ప్రతీ డైలాగు ఎక్కడో విన్నట్లు (తమన్ పాటలు ఎలాగో ఎప్పుడో విన్నట్లు ఉంటాయనుకోండి)కిచిడీలాగ తయారైంది. హీరో సేఫ్ జోన్ కోసం చేసిన ప్రయత్నం...చూసేవాడికి సేఫ్ జోన్ లోంచి ప్రక్కకు జారిన ఫీలింగ్ తీసుకువచ్చింది. దర్శకుడు సైతం తన ప్రతిభను ఈ కథతో ఏమీ చూపలేక ...డల్ గా ,ఫ్లాట్ గా ఫ్రేమ్ లు పేర్చుకుంటూ సీన్స్ తీస్తూ పోయాడు.

పండగ చేస్కో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

పండగ చేస్కో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+