twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముందు పద్దతిగా ఆ పని చేయండి.. కరోనాపై విజయ్ దేవరకొండ కామెంట్స్

    |

    ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్.. వివిద దేశాల్లోకి వ్యాప్తి చెంది ప్రస్తుతం భారతదేశంలో తన ప్రతాపాన్ని చూపుతోంది. ఇండియాలో ఇప్పటికే కరోనా వైరస్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. తాజాగా తెలంగాణలోనూ కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఓ వ్యక్తికి కరోనా సోకడంతో రాష్ట్రమంతా.. గజగజవణికిపోయింది. కరోనాపై అవగాహన కలిగేంచేందుకు ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టింది.

    కరోనాపై తప్పుడు ప్రచారం..

    కరోనాపై తప్పుడు ప్రచారం..

    అదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు మారింది కరోనా వ్యవహారం. కరోనా అని నిర్థారించకముందే.. దగ్గు, జలుబు అని వస్తే కరోనాయే అంటూ వార్తలు ప్రచురితమవుతున్నాయి. ఇలాంటి వాటిపై ప్రభుత్వం సీరియస్ అయింది.

    అవగాహన కార్యక్రమాలు..

    అవగాహన కార్యక్రమాలు..

    ఈ వైరస్ పట్ల, అది వ్యాప్తి చేందే పద్దతి, నివారణ మార్గాల గురించి అవగాహన కార్యక్రమలు చేపట్టి కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. దీని కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. ప్రజలు పరిశుభ్రతను పాటించాలంటూ కొన్ని సూచనలను చేసింది.

    విజయ్ దేవరకొండతో..

    విజయ్ దేవరకొండతో..

    టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తెలంగాణ ఐకాన్‌గా మారిన విజయ్ చేత ప్రభుత్వం కరోనాపై అవగాహన కలిగించేందుకు ఓ ప్రకటనను తయారు చేయించింది. ప్రస్తుతం ఈ యాడ్ వైరల్ అవుతోంది.

    Recommended Video

    Prabhas Spotted At Hyderabad Airport With Coronavirus Mask || Filmibeat Telugu
     పద్దతిగా నమస్కారం చేయండి..

    పద్దతిగా నమస్కారం చేయండి..

    కరోనాను అరికట్టేందుకు ముందు పద్దతిగా నమస్కారం చేయండి.. షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని సూచించాడు. దగ్గు, జలుబు వంటివి ఉంటే వారికి కనీసం మూడు అడుగుల దూరంలో ఉండాలని తెలిపాడు. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే 104కు కాల్ చేసి సమాచారమివ్వండి కోరాడు. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో తిరగకండని ప్రజలకు సలహా ఇచ్చాడు.

    English summary
    Vijay Deverakonda About Coronavirus. Telangana Government Catches Vijay To Aware Of CoronaVirus In Peoples.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X