తెలుగు నుంచి మొత్తం ఎన్ని ప్యాన్ ఇండియా సినిమాలో తెలుసా ? మూమూలు రచ్చ కాదిది!
తెలుగు సినిమా స్థాయి పెరిగింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమాలన్నీ ఎక్కువగా ప్యాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకోసం ఇతర భాషల నుంచి నటీనటులను తెలుగు సినిమాల్లో కూడా నటింపచేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు షూట్ దశలో ఉండగా మరికొన్ని సినిమాలు ఇప్పటికే ప్రకటించారు. అవి షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది.. ఇక తెలుగులో ప్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న అన్ని సినిమాల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రభాస్ ఖాతాలో నాలుగు
బాహుబలి క్రేజ్ తర్వాత అందరికంటే ముందుగా ప్రభాస్ సాహో సినిమాతో మళ్లీ ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా ప్రభాస్ ఏకంగా నాలుగు ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అందులో మొదటిది రాధేశ్యామ్ సినిమా కాగా ఆ తర్వాత సలార్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమా కూడా ఆయన చేస్తున్నాడు. ఈ మూడు సినిమాలు కాకుండా ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది.

ఆర్ఆర్ఆర్ లింక్
ఇక ఇప్పటికే రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుండడమే కాక అయిదు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ 30వ సినిమా 31వ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ కాబోతున్నాయి. 30వ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా 3వ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క రామ్ చరణ్ 15వ సినిమా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లోనే రిలీజ్ కాబోతోంది.

హరిహర వీరమల్లు - లైగర్
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. అలాగే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతోంది. ఇక విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాను కూడా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అలాగే పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా కూడా పాన్ ఇండియాలో రిలీజ్ కాబోతోంది.

తమిళ హీరోలు ఇద్దరితో
ఇక తమిళ స్టార్ హీరో విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుబోతున్న సినిమా కూడా పాన్ ఇండియాలోనే రిలీజ్ కాబోతోంది. అలాగే ఈ రోజు శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్లో ప్రకటించిన సినిమాని కూడా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Recommended Video

మొత్తంగా 18
అలాగే సమంత హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. అలాగే మహేష్ బాబు నిర్మాతగా అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న మేజర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. ఇక నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న కార్తికేయ 2 సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్న దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికీ వెలువడలేదు. మొత్తం మీద లెక్క వేస్తే తెలుగు నుంచి 18 ప్యాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి.


Click it and Unblock the Notifications











