30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఆ స్టార్ హీరోయిన్ చేయాల్సిందట.. ఇప్పుడు రివీల్ చేసిన డైరెక్టర్!
ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు మరొకరు చేయడం అనేది చాలా సర్వసాధారణం.. సబ్జెక్ట్ నచ్చకో, లేక డేట్స్ ఇబ్బందిగా ఉండో చాలా సినిమాలు వదిలేసుకుంటారు నటీనటులు. అయితే ప్రదీప్ హీరోగా అమృత హీరోయిన్ గా తెరకెక్కిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? అనే సినిమా ఒక స్టార్ హీరోయిన్ కాదు అనుకున్నాక అప్పుడు అమృత అయ్యర్ కి అవకాశం వెళ్లిందట.. ఇంతకీ ఎవరా హీరోయిన్ ? ఏమిటా కధ అనే విషయంలోకి వెళితే

30 రోజుల్లో ప్రేమించడం ఎలా
బుల్లితెర యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన మొట్ట మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మున్నా అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ వచ్చి పడడంతో మంచి ఒటీటీ ఆఫర్లు వచ్చినా సరే థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించి ఈ ఏడాది మొదట్లో రిలీజ్ చేశారు.

నీలి నీలి ఆకాశం
అయితే సినిమాల మీద అంత నమ్మకం పెట్టుకున్నారు కానీ సినిమా మాత్రం ఆ మేరకు అంచనాలను అందుకోలేకపోయింది. సినిమా రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ఈ సినిమా మీద బజ్ ఏర్పడడానికి కారణం నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా అనే పాట. సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట సినిమా మీద అంత ఆసక్తి పెంచేసింది. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులు ఊహించనంత లేకపోవడంతో సరిగ్గా ఆదరించలేదు.

సమంతకి చెప్పాలని
అయితే ఈ సినిమా కథ ముందుగా స్టార్ హీరోయిన్ సమంతకు చెప్పానని చెప్పి షాక్ ఇచ్చాడు ఈ సినిమా దర్శకుడు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ సినిమా కథ చెప్పడానికి ముందు సమంత మేనేజర్ వద్దకు వెళ్ళినప్పుడు ఆమెకు కథ చెబుతాను అంటే పైనుంచి కింద దాకా చూస్తూ అలా ఎలా కుదురుతుంది అని ప్రశ్నించాడు అని చెప్పుకొచ్చారు. అయితే ముందు మీకు కథ చెబుతాను అని మీకు నచ్చితే ఆవిడ దగ్గరికి తీసుకు వెళ్ళమని కధ చెప్పానని పేర్కొన్నారు. కథ విన్న వెంటనే కన్నీళ్లు పెట్టుకున్న ఆయన సమంత దగ్గరకు పంపించాడట.

సమంత రియాక్షన్
అయితే సమంత దగ్గరకు వెళ్లి ముందు కథ చెబుతాను అని మీరు చేసినా చేయకపోయినా కథ మాత్రం వినండి అని చెప్పారట. అదేంటి అని ప్రశ్నిస్తే ఒక కామెడీ లాజిక్ చెప్పి కధ చెప్పానని కథ మొత్తం విన్నాక ఆమెకు బాగా నచ్చింది కానీ డేట్స్ సమస్య వల్ల సినిమా చేయలేకపోతున్నానని చెప్పిందట. అయితే అప్పటికి ప్రదీప్ హీరోగా అనుకోలేదని సమంత ఒప్పుకుంటే హీరోని కూడా వెతుక్కునే వాడినని ఆయన వెల్లడించారు.
Recommended Video

ప్రదీప్ ఎంట్రీ
ఇక ఆ తర్వాత ప్రదీప్ హీరోగా అనుకున్నాక అమృత అయ్యర్ ఫైనల్ చేశానని ఇక ఆమెలోనే సమంతను చూసుకున్నాను అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. అయితే
ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. సినిమా కథ ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ సినిమాకు సమంత ఓకే చెప్పిందని ఎలా అంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











