వరుణ్ తేజ్, వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాకు అరుదైన గౌరవం.. తెలుగు నుంచి ఈ ఒక్కటే

వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కి సక్సెస్ సాధించిన F2 సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జ‌ర‌గ‌బోయే 50వ గోల్డెన్ జూబ్లీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఏఫ్ఏఫ్ఐ) ప్ర‌ద‌ర్శ‌న‌కు ఈ సినిమా ఎంపిక కావడం విశేషం. తెలుగు సినిమాల్లోని ఈ ఒక్క సినిమాకే ఈ అవకాశం దక్కింది.

న‌వంబ‌ర్ 20 నుండి 28 వ‌ర‌కు గోవాలో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిమ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఏఫ్ఏఫ్ఐ) వేడుక‌ జరగనుంది. ఈ వేడుకలో మొత్తం 76 దేశాల‌కు చెందిన‌ 250 సినిమాలు ప్ర‌ద‌ర్శితం కానున్నాయి. ఇందులో 26 ఫీచ‌ర్ ఫిలింస్‌ ఉండగా 15 నాన్ ఫీచ‌ర్ ఫిలింస్ ఉన్నాయి. అయితే ఈ 26 ఫీచ‌ర్ ఫిలింస్‌లో ఎంపికైన ఏకైక తెలుగు చిత్రంగా F2 తన పేరును లికించుకుంది.

A rare honor For Daggubati Venkatesh F2 movie

అనిల్ రావిపూడి తెరకెక్కించిన F2 సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పు పొందింది. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టించారు. ఈ వేడుక‌కి ప‌ది వేల మంది హాజ‌ర‌వుతార‌ని అంచనా వేస్తున్నారు. ఈ అరుదైన అవకాశం దక్కడం పట్ల చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుతం వెంకటేష్.. వెంకీమామ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుందని సమాచారం. మరోవైపు గద్దలకొండ గణేష్ రూపంలో వరుణ్ తేజ్ ఇటీవలే సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X