బాలయ్య ఫాన్స్ కి గుడ్ న్యూస్.. ఆదిత్య 369 నుంచి స్పెషల్ వీడియో.. ఆ ప్రకటన కూడా?
నందమూరి బాలకృష్ణ, లెజెండ్ సింగీతం శ్రీనివాస్‌తో కలిసి శ్రీ దేవి మూవీస్ భారతదేశపు మొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ఆదిత్య 369' ను అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక స్పెషల్ పేజ్ క్రియేట్ చేసుకుండు. ఈ టైమ్‌లెస్ క్లాసిక్ రిలీజ్ అయ్యి రేపటికి 30 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అవును, జూలై 18, 1991 న, సింగీతం శ్రీనివాస్ - నందమూరి బాలకృష్ణ కాంబోలో వచ్చిన ఈ సిరీస్ రిలీజ్ అయింది.
భూత - భవిష్యత్తు -వర్తమాన కాలాలకు చెందిన కధ చూపిస్తూ చరిత్ర సృష్టించారు. రేపు, ఆదిత్య 369 రిలీజ్ అయి మూడు దశాబ్దాలు పూర్తయిన ఉదయం 10:26 గంటలకు ఒక ప్రత్యేక వీడియో విడుదలవుతోంది. లెజెండ్స్ ఎస్.పి.బి, జంధ్యాల, ఇళయరాజా ఈ సినిమాకి పని చేసి అద్భుతాలు సృష్టించారు. ఈ క్రమంలో ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇక నందమూరి అభిమానులు అందరూ బాగా ఎదురు చూస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే అది నటసింహ నందమూరి బాలకృష్ణ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి. లెజెండ్ సినిమా సమయంలో షూటింగ్ లో కనపడి అందరి కళ్ళల్లో పడిన మోక్షజ్ఞ ఆ తర్వాత ఎందుకు సినిమాల మీద ఆసక్తి కనబరచలేదు.

ఇక ఆయన సినిమాలు చేయడు ఏమో అని ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్ కి బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ వినిపించారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి స్పందిస్తూ ఆయన వివరాలు వెల్లడించారు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని ఆయన ప్రకటించారు. ఆదిత్య 369 సీక్వెల్ సినిమాకి తాను కానీ లేదా సింగీతం శ్రీనివాసరావు కానీ దర్శకత్వం వహించే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. తనకు ఎలా అయితే తన తండ్రి తాతమ్మకల అనే సినిమాలో మొదట తనకు అవకాశం ఇచ్చి ఎలా మెళుకువలు నేర్పించారో తాను కూడా తన కొడుకుకు ఈ మొదటి సినిమాలో మెళకువలు నేర్పిస్తానని అన్నారు. దీంతో ఈ సినిమా గురించి కూడా రేపు ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయో వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











