ఆది సాయికుమార్, వేదిక జంటగా కొత్త సినిమా ప్రారంభం
ఆది సాయికుమార్, వేదిక హీరో హీరోయిన్లుగా కొత్త సినిమా ప్రారంభం అయింది. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కార్తీక్ విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ సురవరం చిత్రాన్ని నిర్మించిన అరా సినిమాస్ పై.లి. బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.
గతంలో తెలుగులో విజయ దశమి, బాణం చిత్రాల్లో నటించిన వేదిక 2011లో చివరగా 'దగ్గరగా దూరంగా' అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో నటిస్తోంది. ప్రమకథా చిత్రంగా ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది.
మార్చి 25 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చిత్తూరు జిల్లాలోని తలకోనలో ప్రారంభం కానుంది. రోబో, 2.0 చిత్రాలకు అసోసియేట్ కెమెరామెన్‌గా పనిచేసిన గౌతమ్ జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సి.సత్య సంగీతం సమకూరుస్తున్నారు.

ఈ చిత్ర నిర్మాణంలో న్యూ ఏజ్ సినిమా, తిరు కుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అసోసియేట్ అవుతున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.
దర్శకత్వం: కార్తీక్ విఘ్నేశ్
నిర్మాత: కావ్య వేణుగోపాల్
నిర్మాణ సంస్థలు: ఎంవి అరా సినిమాస్ ప్రై.లి, న్యూ ఏజ్ సినిమా, తిరు కుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్స్
మ్యూజిక్: సి.సత్య
సినిమాటోగ్రఫీ: గౌతమ్ జార్జ్


Click it and Unblock the Notifications











