అమీర్ ఖాన్ గురించి తప్పుడు ప్రచారం.. స్పందించిన బాలీవుడ్ స్టార్.. క్లారిటీ
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సౌత్ లో చేసిన మొట్ట మొదటి చిత్రం కూలి. ఇండియాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఇక తమిళ ఇండస్ట్రీలో టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మాత కళానిధి మారన్ రూ.350 కోట్లతో రూపొందించారు. ఇక ఆగస్టు 14న తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ జరిగింది. కానీ ప్రేక్షకుల నుంచి మిక్డ్స్ టాక్ ను సొంతంచేసుకుంది.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్, బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ క్యామియో అప్పీయరెన్స్ ఇచ్చారు. ఆయన నటించిన మొట్ట మొదటి దక్షిణాది చిత్రం కూడా ఇదే. మరోవైపు ఈ చిత్రంలోనే కింగ్, టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా మొదటి సారిగా విలన్ పాత్రలో నటించడం విశేషం. అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా కీలక పాత్రలో నటించారు. దర్శకుడు లోకేష్ ఈ స్టార్ కాస్ట్ ను డీల్ చేయడం విశేషం.

అయితే సినిమా విడుదలైన తర్వాత స్టార్ కాస్ట్ కు సంబంధించిన క్యారెక్టరైజేషన్స్ చిత్రంలో అంతగా ఆకట్టుకోలేదని అభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా అమీర్ ఖాన్ పాత్రకు అర్థమే లేదని టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల అమీర్ ఖాన్ కూడా తన రీసెంట్ ఇంటర్వ్యూలో కూలి చిత్రంపై స్పందించినట్టు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. కూలి చిత్రంలో భాగమవ్వడం అస్సలు ఎలాంటి ప్రాధాన్యతను కలిగి లేదని ఆయన నిరాశ చెందినట్టు ఆ వార్తల సమాచారం.
తాజాగా అమీర్ ఖాన్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి అమీర్ ఖాన్ స్వయంగా స్పందించారు. ఆయన టీమ్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక సుదీర్ఘమైన నోట్ ను విడుదల చేశారు. ఇటీవల కాలంలో అమీర్ ఖాన్ కూలి చిత్రంపై ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వలేదని అమీర్ ఖాన్ టీమ్ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో కూలి చిత్రాన్ని విమర్శించినట్టుగా జరుగున్న ప్రచారం, వైరల్ అవుతున్న వీడియోలు ఫేక్ అని చెప్పారు. అమీర్ ఖాన్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా ఉన్న ఇంటర్వ్యూ ఫేక్ అని తెలిపారు.
అమీర్ ఖాన్ కు లోకేష్ వర్క్ పై మంచి అభిప్రాయం ఉంది, వాస్తావానికి అమీర్ ఖాన్ ఇంకా కూలి చిత్రాన్ని చూడలేదు. త్వరలో చూడాల్సి ఉంది. అది కూడా లోకేష్ తో కలిసి చూడబోతున్నారు. ఇక కూలి చిత్రం సక్సెస్ టీమ్ అందరి హార్డ్ వర్క్. ఇక ఇలాంటి తప్పుడు సమచారాలపై జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం.. అంటూ అమీర్ ఖాన్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇక లోకేష్ కనగరాజ్ నెక్ట్స్ అమీర్ ఖాన్ తో ఒక సూపర్ హీరో ఫిల్మ్ ను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కంటే ముందు రజనీకాంత్ -కమల్ హాసన్ మూవీ, ఖైదీ చిత్రాలపై ఫోకస్ పెట్టారు.


Click it and Unblock the Notifications











