For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sai Dharam Tejని కాపాడితే ఇలా చేస్తారా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కాపాడిన వ్యక్తి!

  |

  టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో ఇద్దరు వ్యక్తులు హుటాహుటిన స్పందించి ఆయనని హాస్పిటల్ కి వెళ్లే లాగా చేశారు. అయితే ఇప్పుడు అందులో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తన మీద జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో ఆయన పోలీసులను ఆశ్రయించారు అని అంటున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే

  అప్పుడు అలా హాస్పిటల్ కి తీసుకువెళ్లడంతో

  అప్పుడు అలా హాస్పిటల్ కి తీసుకువెళ్లడంతో

  మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే చాలా తొందరగా హాస్పిటల్ కు తీసుకు వెళ్లడం వల్ల పెను ప్రమాదం తప్పింది అని వైద్యులు చెబుతున్నారు. ఎంతటి ప్రమాదం జరిగినా కూడా మనిషిని వీలైనంతవరకు గోల్డెన్ టైమ్ లోనే హాస్పిటల్ కు తీసుకు వెళ్లగలిగితే ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆ సమయం ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సాయిధరమ్ తేజ్ ను వెంటనే హాస్పిటల్ కి తీసుకు వెళ్ళడానికి ఇద్దరు ప్రముఖంగా కారణమయ్యారని చెప్పవచ్చు.

  ఆ ఇద్దరు స్నేహితులు

  ఆ ఇద్దరు స్నేహితులు

  తేజ్ కేబుల్ బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైనప్పుడు అతని ముందు వెళుతున్న ఇద్దరు స్నేహితులు కాపాడేందుకు వచ్చారు. వారిలో ఒకరు సాధారణమైన సెక్యూరిటీ గార్డ్. రోడ్డుపై ఇసుక ఉండటంతో సాయి స్పోర్ట్స్‌ బైక్‌ హఠాత్తుగా స్కిడ్‌ అవ్వడం వల్ల బ్యాలెన్స్ కాలేకపోయింది. ఇక ఘటన స్థలంలో ఎంతమంది ఉన్నా వీకెండ్ కావడంతో కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు స్పందించారు. ఒకరి పేరు అబ్దుల్ కాగా మరొకరి పేరు ఫర్హాన్ .

  అప్పటికప్పుడు స్పందించి

  అప్పటికప్పుడు స్పందించి

  వారిలో అబ్దుల్ స్పందించి 108కు కాల్‌ చేసి తేజ్‌ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడటంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే పది నిమిషాల్లో అంబులెన్స్‌ రావడంతో అతను దగ్గరుండి అంబులెన్స్ లోనే మెడికోవర్‌ ఆస్పత్రికి కూడా తరలించాడు. ఇక ప్రమాదం జరిగిన దగ్గరలోనే విధులు నిర్వర్తిస్తున్న ఇస్లావత్ గోవింద్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా వెంటనే స్పందించారు. అతను ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం వలన అంబులెన్స్ కూడా సకాలంలో ఆసుపత్రికి చేరగలిగింది.

  ఆమ్మో ఇలానా

  ఆమ్మో ఇలానా

  అయితే ఇప్పుడు ప్రమాదంలో పడిన తేజ్ ను కాపాడిన సాయి ధరమ్ తేజ్ ను కాపాడిన యువకుడికి కారు గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మహమ్మద్ ఫర్హాన్ స్పందిస్తూ తనకు హీరో రామ్ చరణ్ కార్ గిఫ్ట్ ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేని, నాకు రామ్ చరణ్ కానీ, సాయి ధరమ్ తేజ్ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కాల్ చేయలేదని మహమ్మద్ ఫర్హాన్ పేర్కొన్నారు.

  సోషల్ మీడియా లో నాకు కార్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా వైరల్ అవుతుందని నా స్నేహితులు చెప్పారన్నా ఆయన ఈ అంశం మీద తాను రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాను అని వెల్లడించారు. నాకు మెగా ఫ్యామిలీ డబ్బులు ఇచ్చారని కూడా ప్రచారం చేస్తున్నారు, అందులో వాస్తవం లేదని కూడా ఆయన వెల్లడించారు.

  Farhan Aktha - Definitely Will Act If The Opportunity Arises To Act In Tollywood | Filmibeat Telugu
  మెరుగుగా తేజ్ ఆరోగ్యం

  మెరుగుగా తేజ్ ఆరోగ్యం

  మరోపక్క సాయి ధరమ్ తేజ్ చికిత్స నాలుగో రోజు కొనసాగుతోంది, ఇంకా ICUలోనే ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందంటున్న వైద్యులు, మధ్యాహ్నం తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. క్రమంగా తేజ్ ఆరోగ్యం మెరుగుపడుతున్నదని చికిత్సకు తేజ్ స్పందిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి వెంటి లెటర్ తొలగించే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు.

  సెకండ్ ఫ్లోర్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న తేజ్ దగ్గరకు వైద్యులు ఎవరినీ అనుమతించడం లేదు. సాయి ధరమ్ తేజ్ ను డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వం లోని వైద్య బృందం క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నారు.

  English summary
  Abdul Farhan Who Saved Sai Dharam Tej complain about fake news in social media in the raidurgam police station.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X