Acharya మూవీపై శుభవార్త చెప్పిన చిరంజీవి: రామ్ చరణ్‌తో కలిసి సర్‌ప్రైజింగ్ పోస్టర్

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా ఆచార్య. భరత్ అనే నేను సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. చిరంజీవి వయస్సు రీత్యా ఈ సినిమా షూటింగ్ కూడా కరోనా పరిస్థితుల్లో చేయలేకపోయారు.

అందుకే లెక్క ప్రకారం ఈ సినిమా మే నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా ఇప్పటికే వాయిదా వేశారు. మళ్ళీ ఎప్పుడు సినిమా రిలీజ్ చేస్తారు అనే దాని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.. గత కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి సరైన అప్డేట్ ఏది లేకపోవడంతో పెద్ద ఎత్తున మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కావాలి అంటూ సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థకు వరుసగా విజ్ఞప్తి చేస్తూ ఉండడం తో ఎట్టకేలకు యూనిట్ రంగంలోకి దిగింది.

కొద్దిసేపటి క్రితం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్ ను సినిమా నిర్మిస్తున్న రామ్ చరణ్ కు చెందిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ విడుదల చేసింది. ఆచార్య సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా కేవలం రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని సోషల్ మీడియాలో కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ వెల్లడించింది.

అంతేకాక మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇద్దరూ కూడా ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో ఒక నది ఒడ్డున కూర్చున్నట్లుగా ఉన్న ఒక ఫోటోని కూడా విడుదల చేశారు. దీంతో ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. మెగా ఫ్యాన్స్ అందరూ రంగంలోకి దిగడంతో ప్రస్తుతానికి ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

Acharya talkie part shoot completed two songs pending

ఇక సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా రామ్ చరణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తో కలిసి నిర్మిస్తోంది.. ఇక నిర్మాతగా రామ్ చరణ్ తేజ్ అలాగే నిరంజన్ రెడ్డి ఇద్దరూ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్ పాత్రలో కనిపిస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది.

దానికి ఊతం ఇచ్చేలాగే ఆయన డ్రెస్సింగ్ కూడా కనిపిస్తూ ఉండటం అలాగే గతంలో విడుదల చేసిన ఒక పోస్టర్లలో గన్ తో నడుస్తూ ఉండటం కూడా ఈ సినిమా మీద ఆసక్తి పెరగడానికి కారణమవుతోంది. మొత్తం మీద మెగా ఫ్యాన్స్ ఊహించినట్లుగానే వారికి సినిమా నుంచి మంచి అప్డేట్ ప్రకటించడంతో వారైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేది ఎప్పుడు అనేదానిమీద మాత్రం ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. ఫ్యాన్స్ అయితే విడుదల ఎప్పుడు అనే విషయం మీద కూడా క్లారిటీ కోరుతున్నారు. చూడాలి మరి అది ఎప్పుడు వస్తుంది అనేది.

బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X