twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA elections గురించి బాబూమోహన్ సంచలనం.. వాళ్ళు చీడపురుగులు, వాళ్ళ వల్లే ఇలా!

    |

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి స్పందిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu
    రాజకీయాల్లో బిజీబిజీగా

    రాజకీయాల్లో బిజీబిజీగా

    తెలుగులో అనేక వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్న బాబు మోహన్ తర్వాత కాలంలో రాజకీయ తెరంగేట్రం చేశారు. ముందుగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంటరైన ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక పదవులు అనుభవించారు. అయితే తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆయన తన స్నేహితుడు, ఒకప్పటి కొలీగ్ అయిన కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీచేసి ఎన్నికయ్యారు.

    బీజేపీలో యాక్టివ్ గా

    బీజేపీలో యాక్టివ్ గా

    అయితే గతంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరి బీజేపీ నుంచి పోటీ చేసి బాబు మోహన్ ఓడిపోయారు. అయితే ఓడిపోయినా సరే ప్రజల్లోనే ఉంటూ ఆయన ఇంకా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అడపాదడపా ఆయన టీవీలో కనిపించడమే తప్ప సినిమాల్లో అయితే ఆయన ఈ మధ్యకాలంలో కనిపించడం లేదు. అయితే తాజాగా ఆయనని ఒక యూట్యూబ్ ఛానల్ అయిన ఇంటర్వ్యూ చేసింది.

    ఇప్పుడే మాట్లాడం

    ఇప్పుడే మాట్లాడం

    ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి మీ స్పందన ఏమిటి అని ప్రశ్నించగా బాబు మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాలేదన్న ఆయన దానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది అని చెప్పుకొచ్చారు. అప్పుడే దాని గురించి తాము మాట్లాడమని పేర్కొన్న ఆయన ఎలక్షన్ జరుగుతున్న 10 రోజులు మాత్రమే దాని గురించి ప్రస్తావిస్తామని అన్నారు. సాధారణంగా ఈ ఎన్నికలు కూడా ఉండవని కానీ ఈ మధ్య కొందరి వల్ల ఎన్నికలకు వెళ్లాల్సి వస్తోందని అన్నారు.

    కొందరి వలనే

    కొందరి వలనే

    చెడగొట్టే చీడపురుగులు అన్నిచోట్లా ఉంటాయని పేర్కొన్న బాబు మోహన్, అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని వృత్తులలో ఈ చీడ పురుగులు ఉంటాయి అని అన్నారు. ఇప్పుడు మా నటనా వృత్తిలో కూడా ఈ చీడ పురుగులు దాపురించాయి అని అన్నారు. చాన్నాళ్ల తర్వాత ఎలక్షన్ ఉండాల్సిందేనని కొందరు పట్టుబడుతున్నారని, అది కూడా తాము ఒక ఎన్నిక లాగా తీసుకోమని తన అన్నకు తమ్ముడుకు, లేక తన సోదరికి ఓటు వేశామని భావిస్తామని చెప్పుకొచ్చారు. మేమందరం వేరు వేరు కాదని అందరూ ఒక కుటుంబానికి చెందిన వారమేనని ఆయన అన్నారు.

    చీడ పురుగు చీడపురుగే

    చీడ పురుగు చీడపురుగే

    సాధారణంగా ఫ్యామిలీ మీటింగ్ లాగా ఉండే దానిని ఇప్పుడు పొలిటికల్ ఎలక్షన్ లాగా మార్చారని ఆయన ఆరోపించారు. కొందరు దూరి చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు అని, చిరంజీవి లాంటి పెద్ద వారు, ఒకప్పుడు దాసరి లాంటి పెద్ద వారు ఇలాంటివి జరగకుండా చూశారని కానీ చీడపురుగు చీడపురుగే అని, అది చెడగొట్టడానికి మాత్రమే పనికి వస్తుందని అన్నారు.

    నాకు తెలియదు

    నాకు తెలియదు

    అయితే ఇప్పటికే ప్రకాష్ రాజ్ కి చిరంజీవి సపోర్ట్ చేస్తున్నారనే వార్త స్ప్రెడ్ అయింది అనగా అక్కడ స్ప్రెడ్ అయ్యేది ఒకటి, వెనక జరిగేది ఒకటని బాబు మోహన్ పేర్కొన్నారు. ఇక చిరంజీవి ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. తనకు ఆ విషయం మీద సమాచారం లేదని అన్నారు.

    English summary
    Actor Babu Mohan made sensational comments on MAA elections. in a recent actor turned politician made these comments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X