‘నా మొగుడితో తెల్లారి 4 గంటల వరకు.. నీ పెళ్లాం బాగోతాలు తెలిస్తే’
టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా ఎఫైర్లు, డేటింగ్‌లు, విడాకుల గోల కనిపిస్తోంది. నటీనటుల రిలేషన్ విషయాలు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఎవరు ఎవరితో రిలేషన్‌లో ఉంటారో? ఎవరినీ పెళ్లి చేసుకుంటారో తెలియక జనం జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా టాలీవుడ్‌లో యువ నటుడు ధర్మ మహేశ్ వ్యవహారం దుమారం రేపుతోంది. తన భర్తకు అమ్మాయిల పిచ్చి అని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని అతని భార్య గౌతమి సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధర్మ మహేశ్‌పై కేసు నమోదైంది. అలాగే నిత్యం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ మహేశ్ బాగోతాలను బయటపెడుతున్నారు గౌతమి.
మహేశ్‌కు డబ్బు పిచ్చి
మహేశ్ అర్ధరాత్రి సమయంలో అమ్మాయిలతో తిరిగి ఇంటికి వచ్చేవాడని.. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నన్ను చంపాలని కుట్ర పన్నాడని గౌతమి సంచలన వ్యాఖ్యలు చేసింది. నా బిడ్డను కొడుకుగా అంగీకరించలేదని.. కానీ నా డబ్బు, నా వ్యాపారం మీద వచ్చే లాభాలు మాత్రం అతనికి కావాలి.. అతని కుటుంబానికి డబ్బు పిచ్చి అని ఆమె ఆరోపించింది. వారికి వందల కోట్ల వరకట్నం కావాలని.. ఈ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించినట్లు గౌతమి మీడియాకు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశాననే పగతో నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తన బిడ్డ కోసమే తాను ఫైట్ చేస్తున్నానని గౌతమి తెలిపింది.

రౌడీలతో నీకు రిలేషన్ ఏంటీ?
తాజాగా ఓ ఛానెల్‌తో గౌతమి మాట్లాడుతూ.. మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. రాత్రయితే అమ్మాయిలు నీతో ఎందుకు ఉంటున్నారు నీ ఫ్లాట్‌లో.. అసలు సినిమాల్లో నటించేవాళ్లు, ఈ బిగ్‌బాస్‌లో యాక్ట్ చేసే అమ్మాయిలకి నీ ఫ్లాట్‌లో పనేంటి, ఏం చేస్తున్నారు? ఎందుకు హ్యాపీ డెంట్‌లు పట్టుకుని తిరుగుతున్నారు? అని గౌతమి ప్రశ్నిస్తున్నారు. వీటిపై అడిగే రైట్ నాకు ఉంది.. నాతో తెగతెంపులు చేసుకునే వరకు ఉంటుంది. నేనైతే ఖాళీగా కూర్చొను, చివరి వరకు ఫైట్ చేస్తూనే ఉంటా.. నువ్వు ఇల్లీగల్ గన్స్ తెచ్చుకో, ఏమైనా తెచ్చుకో.. పెద్ద పెద్ద రౌడీల పేర్లు చెబుతున్నావ్? అసలు రౌడీలతో పనేంటీ? అని ప్రశ్నించారు.
నీ కోసం ఎంతో చేశా
రౌడీలను, బిగ్‌బాస్ యాక్టర్స్‌ను నా లైఫ్‌లోకి ఎందుకు తీసుకొస్తావ్. అసలు నిన్ను ఎలా చూసుకున్నాను? కాస్తయినా కృతజ్ఞత ఉందా? మీ అమ్మానాన్నలు ఏం చెప్పలేదా? నువ్వొచ్చి నా ఫ్యామిలీని డిస్ట్రబ్ చేస్తున్నావ్? పెళ్లి చేసి బిడ్డ పుట్టాక, భర్త నుంచి కూతురు విడిపోతుందంటే నా కుటుంబం పరిస్ధితి ఏంటీ? నువ్వు తిరుగుతున్న అమ్మాయిలు, వాళ్ల పేరెంట్స్ నీకేం చేశారు? వాళ్ల మొగుళ్ల అమ్మానాన్నలు ఏం చేశారు? అని గౌతమి నిలదీశారు. బ్రిగేడ్ ఎట్ సెవెన్ అనే అపార్ట్‌మెంట్స్‌లో డాక్టర్ సాహిత్య అనే అమ్మాయితో నువ్వు రాత్రంతా ఉండి.. ఆ అమ్మాయిని ఒళ్లో కూర్చో బెట్టుకున్నావ్ అని మండిపడింది.
ఆ వీడియోలన్నీ నీకు పంపుతా
దాని మొగుడికో దండం.. ఏమన్నా పెళ్లాం ఉందా నీకు, అది నా మొగుడి ఒడిలో కూర్చోని వాడికి మటన్ తినిపిస్తూ, మందు తాగిస్తూ నా మొగుడంటే ఇష్టమని చెబుతుంది. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ... గౌతమీ చౌదరి. నువ్వు నాకు డీఎం చేస్తే నీ పెళ్లాం కలాపాల ఆడియో పంపిస్తానని గౌతమి తెలిపింది. నా మొగుడి ఒడిలో కూర్చొని నీ వైఫ్ ఏమీ అనదా? మార్నింగ్ 4 అవుతుంది, మనం ఇంత తాగుతున్నాం ఇంటికి వెళితే నీ వైఫ్ ఏం అనదా? ఈ పతివ్రతకు డౌట్స్. నన్ను అడిగేంత సీన్ లేదు, రాత్రిపూట నేను ఏ టైమ్‌కైనా ఇంటికెళ్తా, నా బెడ్‌రూమ్‌లోకి వాళ్లకి అనుమతి లేదని నా మొగుడు వాగుతున్నాడని గౌతమ్ ఆరోపించారు.
ఒకడు సూసైడ్ వరకు వెళ్లాడు
నా గురించి, నా బిడ్డ గురించి ఓ చండాలపు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటీ? నీ గురించి నువ్వు మాట్లాడుకో? నీ క్యారెక్టర్ అది కాబట్టి. మా గురించి నువ్వు తాగేసి ఎందుకు మాట్లాడతావు? సాహిత్య దగ్గర కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏంటీ? ఆ సాహిత్య అనే అమ్మాయి వాళ్ల హజ్బెండ్‌కు తెలియదు ఈ కార్యకలాపాలు. ఇది తెలిస్తే అతను ఏమవుతాడు. ఒకడిని చూసా సూసైడ్ వరకు వెళ్లాడు, అతని వైఫ్ ఇతనితో ఉందని. ఇప్పుడు ఇంకొడిని ఎందుకు చూడటం, నాకెందుకు ఆ పత్తాపారాలన్నీ అని గౌతమి ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











