For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బన్నీ అలా అనడంతో షాకయ్యా.. త్రివిక్రమ్ ఏమో టాప్ లేచెలా... అల వైకుంఠపురంలో సీక్రెట్స్ బయట పెట్టిన నటుడు!

  |

  టాలీవుడ్ నటుడు, దర్శకుడు, రచయిత కమెడియన్ అయిన హర్షవర్ధన్ అందరికీ సుపరిచితుడు. ఆయన నటుడి నుంచి మాటల రచయితగా మారి 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాకు డైలాగులు అందించారు. ఆ సినిమా తర్వాత మనం సినిమాకి కూడా పని చేశారు. 'గుండె జారి గల్లంతయ్యిందే' నచ్చడంతో అక్కినేని నాగార్జున పిలిచి మరీ 'మనం' సినిమాకు డైలాగ్ రైటర్ అవకాశం ఇచ్చారు. ఆ సినిమాకు కూడా పని చేసి తక్కువ సమయంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆయన. అల వైకుంఠపురంలో సినిమాలో టబు తమ్ముడి పాత్రలో నటించి మెప్పించిన ఆయన సినిమాకు సంబంధించిన ఒక కీలక విషయం వెల్లడించారు. ఆ వివరాలు మీ కోసం..

  అల వైకుంఠపురంలో మెప్పించి

  అల వైకుంఠపురంలో మెప్పించి

  అమృతం అనగానే గుర్తొచ్చే వారిలో హర్షవర్ధన్ ఒకరు. అమృతం డైలీ సీరియల్ ద్వారా నటుడిగా మారిన ఆయన ఆ తరువాత రైటర్ గా మారి మనం, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సినిమాల్లో మంచి డైలాగులు అందించారు. అయితే ఆయన అల వైకుంఠపురంలో సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఆ సినిమాలో టబు తమ్ముడిగా ఆయన నటించారు. ఆ ఇంటిని మొత్తాన్ని ఆయనే చూసుకుంటూ ఉండేవారు.

  ముందు అనుకోలేదు

  ముందు అనుకోలేదు

  అలా ఆ పని చేస్తూ డబ్బు నొక్కేస్తున్న ఆయనను ఉద్దేశించి బన్నీ చెప్పిన ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ సార్ అనే ఒక డైలాగ్ చెబుతాడు. ఈ సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఈ సీన్ గురించి తాజాగా హర్షవర్ధన్ కొన్ని కీలక వివరాలు పంచుకున్నారు. నిజానికి ఈ సినిమాలో ముందు బన్నీ చెప్పే డైలాగ్ స్క్రిప్ట్ లో లేదట. కానీ అల్లు అర్జున్ అప్పటికప్పుడు దానిని ఇంప్రూవైజ్ చేశారని చెప్పుకొచ్చారు.

  బన్నీ స్పాట్ లో ఇంప్రూవైజ్ చేశాడు

  బన్నీ స్పాట్ లో ఇంప్రూవైజ్ చేశాడు

  ''బన్నీ స్పాట్ లో ఇంప్రూవైజ్ చేసిన డైలాగ్ ఇది.. దూరంగా మానిటర్ దగ్గర ఉన్న త్రివిక్రమ్ గారికి ముందు మెల్లగా చెప్పాడు. (ఒరిజినల్ స్క్రిప్ట్ లో ఆ డైలాగ్ లేదు) వినగానే విపరీతంగా నచ్చడంతో.. త్రివిక్రమ్ గారు.. ఆయనదైన పద్దతిలో టాప్ లేచిపోయెలా నవ్వడం స్టార్ట్ చేశాడు (బుల్లెట్ స్టార్ట్ ఐయ్యిన మాదిరి గట్టిగా, రిథమిక్ గా ఉండే ఆయన నవ్వు ఆయన పరిచయం ఉన్నవాళ్ళకి మాత్రమే తెలుసు) .. ఆ సౌండ్ కి ఉలిక్కిపడి లొకేషన్ లో సభ్యులందరి అటెన్షన్ వాళ్లిద్దరి మీదనే.. నాతో త్రివిక్రమ్ గారు ఆ ఇంప్రూవైజేషన్ షేర్ చేసుకోబోతూ ఉంటే బన్నీ ఆయన్ని ఆపేశాడు'' అని హర్ష వర్షన్ పేర్కొన్నారు.

  నాకేమో రవ్వంత కూడా తట్టలేదు

  నాకేమో రవ్వంత కూడా తట్టలేదు

  "టేక్ లో డైరెక్ట్ గా అనేస్తాను.. అక్కడ ఉన్న డైలాగ్ కి ప్రిపేర్ ఐయ్యి ఉన్న హర్ష షాక్ ఐతే ఆ ఎక్స్ప్రెషన్ ఎంత ఫన్నీగా ఉంటుందో చూడండి" అని బన్నీ అన్నారు. త్రివిక్రమ్ గారు ఒక్క క్షణం ఊహించుకుని మళ్ళీ గట్టిగా రిథమిక్ గా బుల్లెట్ స్టార్ట్ చేశారు. నాకేమో రవ్వంత కూడా తట్టలేదు.. టేక్ అనే సరికి రెడీ ఐయ్యా.. స్క్రిప్ట్ ప్రకారం.. "మీరు సూపర్ సార్" అనాల్సిన ఫినిషింగ్ లైన్ కి.. స్పాట్ లో ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ సార్ అనే డైలాగ్ వేశాడు'' అని హర్శ వర్ధన్ పేర్కొన్నారు.

  Gangavva ఇంటి పనులు.. ఓ పనైపోయింది ! || Filmibeat Telugu
  ఇన్ని రకాలుగా ఏసుకునే డైలాగ్

  ఇన్ని రకాలుగా ఏసుకునే డైలాగ్

  ''నేను న్యాచురల్ షాక్ కి గురయ్యా.. సింగిల్ టేక్ లో ఒకే అవ్వడం తో పాటు.. లొకేషన్ లో త్రివిక్రమ్ గారి బుల్లెట్ తో పాటు ఇంకొంతమంది గోలీ సోడాలు కొట్టారు. ఆ క్షణం.. "భలే వేశాడులే బన్నీ" అనుకున్న గానీ.. ఇంతమంది ఇన్ని రకాలుగా ఏసుకునే డైలాగ్ అవ్వుద్దని అస్సలు ఊహించలేదు'' హర్ష పేర్కొన్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చారు అంటే వీరిద్దరితో కూడిన ఒక మీమ్ వేశారు. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ గురించి మీమ్ వేయడంతో ఈ విషయం ఆయన పంచుకున్నారు.

  English summary
  Actor Harshavardhan who acted in a crucial role in ala vaikunthapurramuloo movie Shares an interesting incident at the time of shooting. In his recent facebook post shares that funny incident.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X