ఒక డ్రైవర్ ను ఎలా చూడలో జగపతిబాబును చూసి నేర్చుకోండి.. ఏకంగా హోటల్‌కు తీసుకువెళ్లి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ బెస్ట్ డిఫరెంట్ నటులలో జగపతిబాబు ఒకరు. మొదట హీరోగా చేసి అనంతరం విలన్ గా సపోర్టింగ్ యాక్టర్ గా అనేక రకాల ప్రయోగాలు చేశారు. ఎలాంటి పాత్ర చేసినా కూడా సినిమాలో హైలెట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా మంచితనం క్రమశిక్షణ కలిగిన నటులు. ఇటీవల ఆయన అసిస్టెంట్, డ్రైవర్ లతో నడుచుకున్న విధానం సోషల్ మీడియాలో అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.

Recommended Video

Jagapathi Babu Biography, హిట్లు కాదు వ్యక్తిత్వం ముఖ్యం ||| Oneindia Telugu
ఆస్తులు కూడా పోయి అప్పుల బాధ..

ఆస్తులు కూడా పోయి అప్పుల బాధ..

జగపతిబాబు తండ్రి నిర్మాత కావడం వలన మొదట్లో అవకశాలు బాగానే వచ్చాయి. అయితే కొన్నేళ్ళకు వరుస డిజాస్టర్స్ రావడం వలన జగపతిబాబు ఆర్థికంగా చాలానే వెనుకబడిపోయారు. ఆస్తులు కూడా పోయి అప్పులతో సతమతమవుతున్న తరుణంలో మళ్ళీ ఫ్యామిలీ కోసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సి వచ్చింది. వచ్చింది చిన్న అవకాశం అయినా సరే వదులుకోలేదు.

నటుడిగా మరో స్థాయికి

నటుడిగా మరో స్థాయికి

ఇక లెజండ్ సినిమాతో కెరీర్ యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. విలన్ గా జగ్గూ భాయ్ ఒక్కసారిగా తన రేంజ్ ను అమాంతంగా పెంచుకున్నాడు. ఇక రొటీన్ పాత్రలు కూడా ఎక్కువగా చేయకూడదని ప్రతి సినిమాలో కొంత డిఫరెంట్ గా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. రంగస్థలం, అరవింద సమేత వంటి సినిమాల్లో కూడా విబిన్నంగా కనిపించి నటుడిగా మరో స్థాయికి వెళ్లారు.

ఎవరిని ఇబ్బంది పెట్టకుండా..

ఎవరిని ఇబ్బంది పెట్టకుండా..

ఇక జగపతిబాబు తన స్థాయి ఎలా ఉన్నా కూడా ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు. నిర్మాతలను దర్శకులను ఏ మాత్రం ఇబ్బంది పెట్టరు. తోటి నటీనటులతో గౌరవంతో ఉంటారు. ఇక షూటింగ్ లో తన వాటర్ బాటిల్ ను కూడా తనే తెచ్చికొని అవసరం అయితే ప్రొడక్షన్ వర్కర్స్ తో కలిసి భోజనం చేస్తుంటారు.

డ్రైవర్ , అసిస్టెంట్ తో కలిసి భోజనం

డ్రైవర్ , అసిస్టెంట్ తో కలిసి భోజనం

ఇక జగపతిబాబు ఎదుటి మనిషి స్థాయిని బట్టి కాకుండా అతని మంచి వ్యక్తిత్వాన్ని గౌరవం ఇస్తారు. ఇటీవల తన డ్రైవర్ , అసిస్టెంట్ తో కలిసి భోజనం చేశాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. సాధారణంగా చాలామంది స్టార్స్ వారి డ్రైవర్, అసిస్టెంట్స్ ను దూరంగానే ఉంచుతారు.

వాళ్ళను ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని అనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ జగపతిబాబు మాత్రం ఏకంగా హోటల్ కు తీసుకువెళ్లి.. చాలా రోజుల అనంతరం నా డ్రైవర్ రాజు, అసిస్టెంట్ చిరులతో కలిసి భోజనం చేస్తున్నాను.. అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో ఒక డ్రైవర్ ను మన దగ్గర పని చేసేవాళ్ళని ఎలా చూడలో జగపతిబాబును చూసి నేర్చుకోండి.. అని ఓ వర్గం నేటిజన్లు పొగరున్న సెలబ్రెటీలకు కౌంటర్స్ వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X