For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA Electionsలో మరో ట్విస్ట్.. తెర మీదకు మరో పేరు.. నేనే గెలుస్తానని ప్రకటన!

  |

  టాలీవుడ్ వుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కొన్నాళ్ల నుంచి చర్చనీయాంశంగా మారాయి. నిజానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. కానీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు ? ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది ? అని సమాచారం కోరుతూ ప్రకాష్ రాజ్ ప్రస్తుత పాలక వర్గానికి ఏప్రిల్ నెలలో ఒక లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆ లేఖ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ అంశం గురించి రెండు మూడు రోజులకు ఒకసారి ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అంటూ ప్రకటన చేసి కలకలం రేపారు ఒక నటుడు. ఆ వివరాల్లోకి వెళితే

  ఎప్పుడూ లేనిదీ

  ఎప్పుడూ లేనిదీ

  ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు అయింది. అప్పటి నుంచి కూడా ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ సహా ఇతర సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వచ్చేవారు. చాలా కాలం వరకు ఇదే పద్ధతి కొనసాగుతూ వచ్చింది. అయితే కొన్నేళ్ల నుంచి సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఒకరిద్దరు పోటీకి దిగే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల అనగానే అటు మీడియా కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం కనిపిస్తోంది. చివరిసారిగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినప్పుడు శివాజీ రాజా అలాగే నరేష్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. శివాజీ రాజా ప్యానల్ తరఫున పోటీ చేసిన వాళ్ళు అందరూ దాదాపుగా గెలుపొందగా శివాజీ రాజా మాత్రం నరేష్ చేతిలో ఓడిపోయారు

  రచ్చరచ్చ

  రచ్చరచ్చ

  ప్రస్తుతం నరేష్ మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్ వరకు ఉంటుందని ఒక అంచనా. అయితే తెలంగాణ రిజిస్ట్రేషన్ సొసైటీ చట్టం ప్రకారం ఒక సారి ఎన్నికైతే ఆరేళ్ల వరకు కొనసాగవచ్చని రూల్స్ చెబుతున్నాయని అంటున్నారు. అయితే ఈసారి తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని చెబుతూ ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు మాకు తెలియజేయండి అంటే ఏప్రిల్ నెలలో ఒక లేఖ రాశారు.. ఈ లేఖ వ్యవహారం చాలా రోజుల వరకు బయటకు రాలేదు కానీ ఎప్పుడు అయితే ఈ లేఖ వ్యవహారం బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఈ అంశం చర్చనీయాంశమైంది. లోకల్ నాన్ లోకల్ వ్యవహారాలు తెర మీదకు రావడం ఆ తర్వాత మంచు విష్ణు పోటీ చేస్తున్నాను అని ప్రకటన చేయడం వెంటనే ప్రకాష్ రాజశేఖర్ కి ఒక ప్రెస్ మీట్ పెట్టి తాను రంగంలోకి దిగుతానని ప్రకటించడమే జరిగాయి.

  ఏకంగా ఐదుగురు

  ఏకంగా ఐదుగురు

  ఈ మధ్యలో హేమ, జీవిత రాజశేఖర్ కూడా బరిలోకి దిగుతామని ప్రకటించారు. అక్కడికి నలుగురు సభ్యులు తాము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల బరిలో దిగుతున్నామని ప్రకటించినట్లు అయింది. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా cvl నరసింహారావు అనే నటుడు తాను రంగంలోకి దిగుతున్నా అని ప్రకటించారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ విషయంలో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందని చెబుతూ తాను తెలంగాణ వాదంతో బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. అలా మొత్తం మీద ఇప్పటిదాకా ఐదుగురు సభ్యులు బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించినట్లు అయింది. అయితే ఈ మధ్యకాలంలో హేమ, నరేష్ ఇంకొంతకాలం పదవీ కాలంలో కొనసాగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని మీ అందరూ సంతకాలు పెడితే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ క్రమశిక్షణా సంఘానికి తాను లెటర్లు పంపుతానని ఆమె పంపిన వాయిస్ నోట్ చర్చనీయాంశమైంది.

  మొదటి తప్పిదం అని

  మొదటి తప్పిదం అని

  ఈ విషయం మీద క్రమశిక్షణ సంఘానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన క్రమశిక్షణా సంఘం దీనిమీద వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.. తర్వాత కొన్నాళ్లకు హేమ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉందని ఇకమీదట ఆమె ఎలాంటి ఈ వ్యవహారంలో తలదూర్చనని మాట ఇచ్చిందని మొదటి తప్పిదం అని భావిస్తూ ఆమెకు ఒక హెచ్చరిక చేసి వదిలేస్తున్నామని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు మరో నటుడు తాను బరిలోకి దిగుతానని ప్రకటించాడు.

  Atharvaa Murali,Raj Kiran In Lyca Production NO 22 | Filmibeat Telugu
  ఊహించని పేరు

  ఊహించని పేరు

  ఆయన ఎవరో కాదు కాదంబరి కిరణ్.. నటుడిగా దాదాపు 200 సినిమాల్లో నటించిన కాదంబరి కిరణ్ చిత్రపురి కాలనీ అలాగే ఫిలిం ఛాంబర్ వ్యవహారాలలో కూడా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఆయనను ఇంటర్వ్యూ చేయగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయని ఆయన యూట్యూబ్ ఛానల్ లో తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల బరిలో దిగుతున్నా అని ప్రకటించి కలకలం రేపారు. అంతేకాదు తాను ఖచ్చితంగా గెలిచే తీరుతామని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు కేవలం 417- 420 మంది మాత్రమే ఓటింగ్ వేయడానికి వస్తారని ఆ వచ్చిన వారిలో 300కు పైగా ఓట్లు తనకే పడతాయని ఆయన ధీమాగా ఉన్నారు. తాను ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పడం లేదని ఎన్నిక జరిగింది తర్వాత మీరే ఒప్పుకుంటారు అని ఆయన చెబుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో?

  English summary
  Actor Kadambari Kiran announced that he is going to contest On MAA Elections 2021
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X