10 మంది గర్ల్స్‌తో నా బెడ్ రూమ్‌లో.. నా లైఫ్ నాశనం.. యువ హీరోపై భార్య ఆరోపణలు
తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోగా మహేశ్ ధర్మ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. గతంలో ఆయన డ్రింకర్ సాయి అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇంకా కెరీర్ లో సరైన హిట్ పడలేదు. కానీ ఆయనకు పెళ్లై పాప కూడా ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా మహేశ్ ధర్మ భార్య గౌతమి చౌదరి బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూనే వస్తోంది. తన భర్త వల్ల తనకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు న్యాయం కావాలని గడప దాటి బటయకి వచ్చి నిర్భయంగా మాట్లాడుతోంది. ఈ సందర్భంగా పలు అంశాలను వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..
గౌతమి చౌదరి తాజాగా తన భర్త మహేశ్ గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. ఆమె మాట్లాడుతూ 'నేను సన్నగా, పొడుగ్గా, తెల్లగా ఉండేసరికి నచ్చేశానంట. బెడ్‌రూంలో ఒక వస్తువులాగా, పిల్లల్ని కనే మెషీన్‌లాగా చూశారు' అని భర్త మహేశ్ గురించి ఆమె చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. 'నా జీవితాన్ని సరదాగా టైంపాస్‌కి తండ్రీకొడుకులు కలిసి నాశనం చేశారు. తల్లికూతుళ్లు కలిసి క్యారమ్ బోర్డులో కాయిన్స్ లాగా ఆడుకున్నారు. సమాజంలో డబ్బుకు ఉన్న విలువ మనుషులకు లేదు. డబ్బు ఉంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా చెల్లుతుందా? నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు బ్రెయిన్ లేదా?' అంటూ ఆమె ప్రశ్నించారు.

భర్త మహేశ్ కు ఆమె సహకరించిన విషయాల గురించి చెబుతూ.. 'వన్ అండ్ ఓన్లీ అనే ట్యాగ్ లైన్ ఎవరికీ లేదు. నా మార్కెటింగ్ స్కిల్ అంతా తెచ్చి అతనికి పెట్టాను. అతన్ని ఒక కింగ్‌లా చూడాలనుకున్నాను. కానీ అతను మాత్రం 10 మంది అమ్మాయిలతో కనిపిస్తున్నాడు. అలాంటి మగాడి మీద ఎవరికి ఫీలింగ్స్ వస్తాయి?' అని ప్రశ్నించింది. తన భర్త ఇతర అమ్మాయిలతో తిరుగుతూ ఉండటాన్ని ఆమె తట్టుకోలేక పోతున్నానని తెలియజేసింది.
ఆయన ఇప్పుడే పెద్ద హీరోలా ఫీలవుతున్నారు. ఇప్పుడేమన్నా పెద్ద పెద్ద డైరెక్టర్స్ క్యూ కట్టారా ఇంటి బయట? అని ఆమె నిలదీశారు. తనకు న్యాయం జరిగేంత వరకు ఎంత దూరమైనా వెళ్తానని గౌతమి స్పష్టం చేశారు. నేను వాళ్ళ కాళ్ళ కింద? ఎందుకు బతకాలి, నాకు డిగ్రీ ఉంది, నాకంటూ ప్రొఫెషన్ ఉందని చెప్పుకొచ్చింది. తన కాళ్లపై తాను నిలబడగలనని ధైర్యంగా చెప్పింది. గౌతమి తన మాజీ భర్త గురించి ఇలా భయానక విషయాలు వెల్లడించారు.
మరోవైపు కొందరు నన్ను ఒంటరిగా తిరగొద్దు అని సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అతను చంపేస్తాడంట. అతని దగ్గర ఇల్లీగల్ గన్ కూడా ఉందని చెప్పారు. ఇలాంటి విషయాలతో నాకు ఆందోళనగా ఉందని చెప్పింది. గౌతమి తన మనోగతాన్ని వ్యక్తం చేశారు. ఎండ్ అఫ్ ద డే అతని కెరీర్ డిస్ట్రాయ్ చేయడం వల్లో, అతనికి ఏదో నష్టం చేయడం వల్లో నాకు వచ్చే ప్లస్ ఏం లేదని చెప్పింది. గౌతమి కోరుకుంటున్నదల్లా తన బిడ్డకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని తెలిపింది. మహేశ్ వక్రబుద్ధి మార్చుకొని తనకు న్యాయం చేయాలని కోరింది.


Click it and Unblock the Notifications











