Don't Miss!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- News
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం..!!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
బిజినెస్‌లో రూ. 9 కోట్ల మోసం: పోలీస్ స్టేషన్‌కు సీనియర్ నటుడు నరేశ్
వైవిధ్యమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న నటుడు నరేశ్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. హీరోగా ఎన్నో మరపురాని సినిమాల్లో నటించిన ఈయన.. సపోర్టింగ్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలన్నీంటిలోనూ నటిస్తున్నారు. అదే సమయంలో వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నరేశ్ తాజాగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
ప్రస్తుతం నరేశ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. పలు రకాల బిజినెస్‌లు కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా ఓ కంపెనీపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీస్టోన్ అనే కంపెనీ తనను మోసం చేసిందని పేర్కొంటూ ఈ సీనియర్ నటుడు ఆదివారం ఉదయం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార లావాదేవీల్లో ఆ కంపెనీ తనకు రూ. 9 కోట్లు బాకీ ఉందని.. దాన్ని చెల్లించమని అడిగినా వాళ్లు స్పందించడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారాయన. అంతేకాదు, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు.

సీనియర్ నటుడు నరేశ్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు సీసీఎస్ పోలీసులు. దీనిపై విచారణ జరిపి వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయం బయటకు రావడంతో సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఘటనతో నరేశ్ వార్తల్లో నిలుస్తున్నారు.