twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Harom Hara సుధీర్ బాబు మాస్ అవతారంతో.. కుప్పం బ్యాక్‌డ్రాప్‌గా హరోమ్ హర!

    |

    నైట్రో స్టార్ సుధీర్ బాబు కెరీర్‌లో 18వ చిత్రంగా వస్తున్న చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ విశేషంగా ఆకట్టుకొంటున్నది. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరోమ్ హర అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సెహారి చిత్రంతో దర్శకుడిగా మారిన జ్ఞాన సాగర్ ఈ సినిమాను రూపొందించారు. ఈ టైటిల్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    హరోమ్ హర టైటిల్ ఆవిష్కరించడానికి ముందు.. ఇటీవల మాస్ సంభవం అంటూ.. సుధీర్ బాబు 18వ సినిమా టైటిల్‌ను ప్రకటిస్తున్నట్టు ప్రకటన చేశారు. అనుకొన్నట్టుగానే సుధీర్ బాబు 18 సినిమాకు హరోమ్ హర అని టైటిల్‌ని పెడుతున్నట్టు ప్రకటించారు. ఈ టైటిల్‌ పోస్టర్‌లో అధ్యాత్మికంతోపాటు ప్రతీకారం అనే భావన కూడా కనిపించింది.

     Actor Sudheer Babus 18th film title as Harom Hara, Title poster looks crazy

    ఇక హరోమ్ హర సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే.. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989లో జరిగిన కథను ఈ మూవీగా తెరకెక్కించారు. ఈ టైటిల్ రిలీజ్ మోషన్ పోస్టర్‌లో సుబ్రమణ్యస్వామి, జగదాంబ టాకీస్, రైల్వే స్టేషన్‌ కనిపించాడు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా సుధీర్ బాబు మాస్ అవతారంలో చెలరేగిపోయాడు. ఇక చేతిలో తుపాకి.. మరో చేతిలో సుబ్రమణ్యస్వామి ఆయుధమైన శూలంతో కనిపించాడు. సుధీర్ బాబు అవతారం స్పష్టంగా కనిపించకపోయినా.. మేకోవర్ మాత్రం అదిరిపోయిందనే ఫీలింగ్ కనిపించింది.

    హరోమ్ హరలో నటీనటులు, సాంకేతిక నిపుణులు విషయానికి వస్తే.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. రమేశ్ జీ సమర్పిస్తున్నారు.

    ఇక హరోమ్ హర సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్నది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు త్వరలోనే వెల్లడించనున్నారు.

    నటీనటులు: సుధీర్ బాబు తదితరులు
    రచన, దర్శకత్వం: జ్ఞాన సాగర్
    నిర్మాత: సుమంత్ జీ నాయుడు
    సమర్పణ: రమేష్ కుమార్ జీ
    మ్యూజిక్: చైతన్ భరద్వాజ్
    డీవోపీ: అరవింద్ విశ్వనాథన్
    ఎడిటర్: రవితేజ గిరిజాల
    బ్యానర్: శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్
    పీఆర్వో: వంశీ శేఖర్

    English summary
    Nitro Star Sudheer Babu’s 18th film will be helmed by talented director Gnanasagar Dwaraka who debuted with the youthful entertainer Sehari. However, the director chose a concept with a gigantic canvas for his second movie. It will be produced by Sumanth G Naidu under SSC (Sree Subrahmanyeshwara Cinemas) banner. The makers recently announced, “Mass Sambhavam on October 31st”. Here’s the big update. They locked the title Harom Hara, and it comes with the caption- The Revolt. While the title is spiritual, the tagline discloses the revenge aspect of the story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X