For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డియర్ వర్మా అంటూ రెండో పెళ్లి గురించి సుమంత్ వీడియో.. చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నా, మీడియాకి థాంక్స్!

  |

  గత కొద్ది రోజులుగా అక్కినేని నట వారసుడు సుమంత్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగడంతో ఈ వ్యవహారం రసవత్తరంగా మారింది. నిన్న తనను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ల గురించి రామ్ గోపాల్ వర్మకు అలాగే మీడియాకు క్లారిటీ ఇచ్చారు సుమంత్. ఆ వివరాల్లోకి వెళితే.

  మళ్లీ రావాతో మంచి కంబ్యాక్

  మళ్లీ రావాతో మంచి కంబ్యాక్

  అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే చాలా కాలం పాటు వరుస ఫ్లాప్ సినిమాలు రావడంతో ఆయన గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ రావా అని ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీతో కం బ్యాక్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత కూడా ఆయన కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ప్రస్తుతం సుమంత్ మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

  సుమంత్ రెండో పెళ్లి

  సుమంత్ రెండో పెళ్లి

  ఇదిలా ఉండగా సుమంత్ పవిత్ర అనే ఒక అమ్మాయిని రెండో వివాహం చేసుకోబోతున్నారని మీడియాలో గత రెండు మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందుకు ఊతం ఇచ్చే లాగా సుమంత్ వెడ్స్ పవిత్ర అంటూ శుభలేఖ ఉన్న కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవిత్ర కూడా అక్కినేని కుటుంబానికి సన్నిహితంగా మెలిగే వ్యక్తి అని వీరిద్దరి మధ్య చాలా కాలం నుంచి సాన్నిహిత్యం ఉందని ఒకరినొకరు అర్థం చేసుకున్నాక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరిగింది.

  బుద్ధి రాలేదా సుమంత్ ?

  బుద్ధి రాలేదా సుమంత్ ?

  ఇదంతా బాగానే ఉన్నా ఈ విషయంలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ ఒక పెళ్లి నూరేళ్ల పెంట అయితే రెండో పెళ్లి ఏంటయ్యా స్వామి ? నా మాట విని మానెయ్యి, పవిత్ర గారు మీ జీవితాన్ని పాడు చేసుకోకండి, తప్పు నీది కాదు, తప్పు మన వ్యవస్థది, అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఒకసారి అయ్యాక కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా సుమంత్ ? నీ కర్మ, ఆ పవిత్ర కర్మ, అనుభవించండి!. అంటూ రెండు ట్వీట్లు చేయడం ఒక రకంగా టాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది అని చెప్పాలి.

  వర్మ దెబ్బకు తప్పలేదు

  వర్మ దెబ్బకు తప్పలేదు

  అయితే మీడియాలో సోషల్ మీడియాలో ఎంత ప్రచారం జరిగినా స్పందించని సుమంత్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ కి మాత్రం స్పందించాడు. ఏకంగా దీనికి సంబంధించి ఆయన ఒక చిన్న వీడియో విడుదల చేశారు. తన గురించి ఇంతగా ఆలోచిస్తున్న వారికి అలాగే తన గురించి ఇంత ప్రాధాన్యత తీసుకున్న రామ్ గోపాల్ వర్మ వంటి వారికి చెప్పేదొకటే, తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని సుమంత్ చెప్పుకొచ్చారు. తనకు మళ్ళీ పెళ్లి మీద ఎలాంటి ఆసక్తి లేదని ఆయన వెల్లడించారు.

  సినిమా కాన్సెప్ట్ అది

  సినిమా కాన్సెప్ట్ అది

  అయితే తాను చేయబోతున్న సినిమా ఒకటి పెళ్లి విడాకులు, ఆ తరువాత మళ్ళీ అనే కాన్సెప్ట్ కి సంబంధించిన సినిమా అని ఆ సినిమా సెట్స్ నుంచి లీకైన శుభలేఖ ఫోటో బయటకు రావడంతో ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చిందని అన్నారు. అది నిజం పెళ్లి కాదని కేవలం సినిమా కోసమే అని ఆయన చెప్పుకొచ్చారు.. అంతకాక ఈ సినిమాకి సంబంధించి తాను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కూడా విడుదల అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

  Actor Nanda Kishore Excellent Philosophy For Life | Narasimhapuram
  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే

  ఇక సుమంత్ గతంలో కీర్తి రెడ్డి అనే హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్న ఈ క్రమంలో ప్రేమలో పడ్డారు, అది వివాహం వరకు వెళ్ళింది. అయితే వీరిద్దరూ కలిసి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. కానీ రెండేళ్లు తిరగకుండానే వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత కూడా సుమంత్ నటుడిగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే అనుకోకుండా ఈ ఫోటోలు బయటకు రావడంతో ఆయనకు రెండో పెళ్లి అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇక చివరిగా కపటధారి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన అనగనగా ఒక రౌడీ అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే మరో పేరు పెట్టని సినిమాలో కూడా నటిస్తున్నారు.

  English summary
  From past 2-3 days speculations about actor sumanth second marriage is going through the social media. Yesterday director ram Gopal Varma criticised sumanth about his second marriage decision. Recently actor sumanth responded to ram Gopal Varma tweet about his second marriage and gave clarity about his second marriage with video
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X