Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్‌మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఏపీ ఎన్నికల బరిలోకి తారకరత్న.. లోకేష్‌తో భేటీ.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటికే పొలిటికల్ హీట్ భారీగా క్రియేట్ అయింది. ఏపీలోని అన్ని పార్టీలు రానున్న ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలను సిద్దం చేసుకొంటున్నాయి. అంతేకాకుండా గెలుపు గుర్రాలపై దృష్టిపెట్టి అభ్యర్థులను ఖరారు చేసుకొంటున్నాయి. ఇప్పటికే చంద్రబాబు రాజకీయ పర్యటన చేస్తుండగా, పవన్ కల్యాణ్ త్వరలోనే బస్ యాత్రకు సిద్దమవుతున్నారు.
అయితే చాలాకాలంగా టీడీపీకి సేవ చేస్తున్న దివంగత ఎన్టీఆర్ మనవడు, నటుడు తారకరత్న క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్‌తో భేటీ కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లోకేష్, తారకరత్న భేటీ వివరాల్లోకి వెళితే..

గత ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల్లో తారకరత్న చురుకుగా పాల్గోన్నారు. పార్టీ ప్రచారా కార్యక్రమాల్లో భాగం పంచుకొని సేవలు చేశారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కూడా తన సేవలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలను కోరినట్టు సమాచారం. ఈ మేరకు లోకేష్‌ను కలిసి తన భవిష్యత్ కార్యచరణను తెలియజేసినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో నందమూరి కుటుంబానికి పార్టీలో పెద్ద పీట వేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. ఆ నిర్ణయంలో భాగంగానే లోకేష్‌ను కలిసి అంతర్గత వ్యవహారాలను చర్చించుకొన్నారు.

ఇదిలా ఉండగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగేందుకు తారకరత్న సిద్దమవుతున్నట్టు సమాచారం. ఏపీ రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించాలని తారకరత్న నిర్ణయం తీసుకొన్నారు. వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లా గానీ, మరో నియోజకవర్గం నుంచి గానీ పోటీ చేయాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తన క్రియాశీలక రాజకీయాలు, పార్టీ సేవల వినియోగం గురించి తారకరత్న, లోకేష్ మధ్య చర్చ జరిగినట్టు సమాచారం.