For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కేబీఆర్ పార్క్‌లో వాకింగ్.. మీరు హాట్ అన్న నెటిజన్.. లైవ్‌లో హేమ షాకింగ్ ఆన్సర్!

  |

  నటి హేమ తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు.1989లో వచ్చిన 'చిన్నారి స్నేహం' అనే సినిమాతో ఆమె తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. అలా మొదలు పెట్టిన ఆమె తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటికే 200లకు పైగా సినిమాల్లో నటించింది.ఇంకా నటిస్తూనే ఉంది. సినిమాల్లో ఆమె వదిన, అత్త, అమ్మ వంటి పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. తాజాగా ఆమె తన సోషల్ మీడియా లైవ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి

  బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి


  సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన హేమ తద్వారా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 3 కి వెళ్లిన ఆమె కేవలం తొమ్మిది రోజుల్లోనే వెనక్కి వచ్చేయడం అప్పట్లో చర్చనీయాంశమే. అయితే తాను అన్ని చోట్లా నటించలేనని అందుకే తనను బయటకు పంపేశారు ఏమోనని తర్వాత ఆమె చెప్పు వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే ఆమె ఈ మధ్య రాజకీయాల్లో సైతం యాక్టివ్ గా అయింది.

  రాజకీయాల్లో సైతం

  రాజకీయాల్లో సైతం


  హేమకు రాజకీయాలు అంటే సైతం ఆసక్తి ఎక్కువే. రాష్ట్ర విభజన అనంతరం హేమ అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అయితే ఆ సమయంలో ఆమెకు డిపాజిట్లు సైతం దక్కలేదు. ఇక ఆ తర్వాత మొన్నటి ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆమె ఎన్నికలు పూర్తయ్యాక రాజకీయాల వైపు వెళ్లడం మానేసింది. ఆమెకు రాజకీయాలలో యాక్టివ్ గా ఉండదేమో అని భావించిన తరుణంలో తాజాగా బిజెపిలో చేరి అందరికీ షాక్ ఇచ్చింది.

  సోషల్ మీడియాలో క్రేజ్

  సోషల్ మీడియాలో క్రేజ్


  ఆ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ నటి తాజాగా తన ఫాలోవర్స్ కోసం ఒక లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ లైవ్ సెషన్ లోనే ఆమెను ఒక నెటిజన్ హాట్ అంటూ సంభోదిస్తూ కామెంట్ పెట్టగా దానికి ఆమె ఆసక్తికరంగా స్పందించింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆమె ప్రతి రోజూ ఉదయాన్నే కెబిఆర్ పార్క్ లో వాకింగ్ వెళుతుందట.

  నేను హాట్ ఏంట్రా బాబు

  నేను హాట్ ఏంట్రా బాబు


  అలా వాకింగ్ కి వెళ్లిన సమయంలో కెబిఆర్ పార్కులో ఒక చోట చింతచెట్టు కనిపించడంతో ఆ చింతచిగురు కోసే పనిలో ఆమె నిమగ్నమై ఉంది.. తన కుమార్తె కూడా రావడంతో ఇద్దరూ కలిసి కొంచెం సేపు లైవ్ సెషన్ నిర్వహించారు. ఈ సమయంలో ఒక ఫాలోవర్ ఆమెను సంభోదిస్తూ హాట్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఆమెకు ఏమనాలో అర్ధం కాక ఇప్పుడు హాట్ ఏంట్రా నాయనా నన్ను చూస్తే పిచ్చాదానిలా ఉన్నా, ఎవరైనా చూస్తె చిల్లర వేస్తారు, అలాంటిది నీకు హాట్ గా కనిపిస్తున్నానా అంటూ స్పందించింది. ఇక ఆ తర్వాత కూల్ అయిన ఆమె లైవ్ సెషన్ లో మరి కాసేపు ముచ్చటించింది.

  Shakeela విషయంలో ఇది జరిగి ఉంటే గొప్ప నటి అయ్యేది ! || Filmibeat Telugu

  కేబీఆర్ పార్క్ లో

  ఇక ప్రతి రోజు ఉదయాన్నే వాకింగ్ కి వస్తానన్న హేమ ఈ రోజు రాగానే ఎందుకో చింత చెట్టు తనను ఆహ్వానిస్తున్నట్లు అనిపించిందని అందుకే తన కుమార్తెతో కలిసి కాస్త చింతచిగురు కోసుకున్నాను అని చెప్పుకొచ్చింది.. ఇక నిన్న ఆమె సురేఖ వాణితో కలిసి వంటలు చేస్తున్న వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంట్లోనే ఉంటూ.. ఇలా చెమటోడ్చి కష్టపడుతున్నామంటూ తాము వండుతున్న కూరలు ఆ వీడియోలో చూపించారు.

  English summary
  Character actress Hema is trying her best to defy age, at least look like she is trying to look young. The lady has recently attended a live session in her instagram. In that session she made some intresting comments on a netizen who called her hot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X