ఆ వయసులో టార్చర్ అనుభవించా.. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా అందుకే.. హేమ షాకింగ్ కామెంట్స్
వివాదాస్పద వ్యాఖ్యలు, చేతలతో నిత్యం వార్తల్లో ఉంటారు టాలీవుడ్ నటి హేమ. గతేడాది బెంగళూరులో వెలుగుచూసిన రేవ్ పార్టీ వ్యవహారంలో హేమ పేరు తెరపైకి రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. తాను ఆ పార్టీలో లేనని ఆమె చెప్పినప్పటికీ ఆ తర్వాత పోలీసులు, కేసులు, కోర్టుల వరకు విషయం వెళ్లింది. తర్వాత కొద్దికాలం సైలెంట్‌గా ఉన్న హేమ తిరిగి ఇటీవల యాక్టీవ్ అవుతున్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
చిన్న వయసులోనే ఎంట్రీ
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన భలే దొంగ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టారు హేమ. తొలినాళ్లలో హీరోయిన్ల ఫ్రెండ్‌గా కనిపించిన ఆమె కెరీర్ పీక్స్‌లో ఉండగానే కేవలం 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిలైంది. నటుడు మీర్ తమ్ముడు జాన్‌తో ప్రేమలో పడి ఆయనను పెళ్లాడింది. పెళ్లి, పిల్లలు వంటి కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండటంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన హేమ.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

రాజకీయాల్లోనూ యాక్టీవ్
మంచి హైట్‌తో, గోదావరి యాసతో, తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు హేమ. అమ్మ, అక్క, వదిన, పిన్ని పాత్రలతో బాగా బిజీ అయ్యింది. మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం హేమ స్టైల్. పలుమార్లు తన దూకుడుతో వివాదాల్లో చిక్కుకున్నారు. సినిమాలలో తనను తాను నిరూపించుకున్న హేమ.. రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి మండపేట నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు హేమ. బెంగళూరు రేవ్ పార్టీ ఘటన తర్వాత ఇంటికే పరిమితమైన ఆమె తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
36 ఇయర్స్ ఇండస్ట్రీ
కెరీర్ పరంగా చాలా మంచి పేరు తెచ్చుకున్నా.. పరువు కోసమే పాకులాడా. ఎన్ని జన్మలెత్తినా మా అమ్మ రుణం తీర్చుకోలేను. ఇండస్ట్రీకి వచ్చి 36 ఏళ్లు అయ్యింది, అందరూ హేమక్క హేమక్క అని పిలుస్తున్నారంటే ఎంతో కష్టపడ్డాను. నా ఫ్యామిలీని, నన్ను నేను కాపాడుకోవడానికి సముద్రం లాంటి ఇండస్ట్రీలో ఓ చేప పిల్లలా ఈదుకొచ్చాను. మా హజ్బెండ్ డేట్ ఆఫ్ బర్త్‌ని నాకు వేసేసి 58, 60, 70 ఏళ్లని నా వయసును ఇష్టమొచ్చినట్లు వేసేసుకుంటున్నారు అని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెప్పినా అర్ధం చేసుకోడు
లైఫ్‌లో ఓ రోజున కూర్చొని ఆలోచిస్తే.. జీవితంలో షూటింగ్స్, కిచెన్ తప్పించి ఏం లేవు. నా ఫ్యామిలీని చూసుకుంటున్న సమయంలో ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను బాగానే చూసుకుంటున్నాడు, పెళ్లి తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి సెకండ్ ఎంట్రీ ఇస్తే ఒక్కరోజు కూడా నిద్ర ఉండేది కాదు, పరిగెత్తుతూనే ఉన్నా. నా జీవితంలో ఎంటర్‌టైన్‌మెంట్ లేదు, సినిమాకి, ఫంక్షన్‌కి, ఒక ఇంటర్వ్యూకి దేనికి నా భర్త రాడు. ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా నువ్వెళ్లొచ్చేయ్ బుజ్జి అని చెబుతాడు.
నా లైఫ్‌లో ఇవి తప్పించి ఏం లేవు.. లాక్‌డౌన్‌లో ఇల్లు కొనుక్కున్నా, సినిమాల్లో బాగానే సంపాదించాను .. 42 ఏళ్ల వయసులో మోనోపాజ్ కావడంతో మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడ్డా. ఈ సమయంలో నన్ను జాగ్రత్తగా చూసుకోమ్మని మా ఆయనకి చెప్పా. నాకు ఏం కొనిపెట్టాలో ఆయనకి తెలియదు.. లక్ష రూపాయలు వచ్చినా నాకే ఇస్తాడు, వెయ్యి రూపాయలు వచ్చినా నాకే ఇస్తాడు. ఎన్నిసార్లు చెప్పి చూసినా ఆయనకి అర్ధం కాలేదు.. తన మైండ్‌లో ఏముందో తెలియదు. ఆ ఇరిటేషన్‌తో బిగ్‌బాస్‌లో ఆఫర్ వస్తే వెళ్లిపోయా.. కోపం, బాధ, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలా చేశానని హేమ ఎమోషనల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











