సోదరికి అవమానం జరిగితే పట్టించుకోవా? మంచు విష్ణుపై నటి హేమ ఫైర్

టాలీవుడ్ స్టార్ నటి, ప్రొడ్యూసర్ మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునే దక్కించుకుంది. టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మంచు మోహన్ బాబు కూతురుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తన స్వయం కృషితో ఎదగడానికి ప్రయత్నించింది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ ప్రజెంటర్ గా మంచు లక్ష్మి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మాత్రం అలరిస్తూ వస్తున్నారు. తన లెటెస్ట్ ఫిల్మ్ ను ప్రమోట్ చేసుకునేందుకు వరుసగా ఇంటర్వ్యూలో ఇస్తూ వస్తోంది.

ఈ క్రమంలో మంచు లక్ష్మి ఓ తెలుగు సీనియర్ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చింది. కానీ ఆయన మంచు లక్ష్మి బట్టలు, వయస్సుపై కాస్తా ఇబ్బందికరంగా మాట్లాడాడని ఏకంగా పోలీసు కేసు నమోదు చేసింది. ఆయన తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. దీనిపై తాజాగా టాలీవుడ్ సీనియర్ నటి హేమ స్పందించారు. ఈ విషయంలో మంచు విష్ణు మౌనంగా ఉండటంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రత్యేకమైన వీడియో కూడా విడుదల చేసింది.

Actress Hema Reacted on Manchu Lakshmi Controversy

నటి హేమ మాట్లాడుతూ.. నేను ఇటీవల కాలంలో మీడియా వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. 3 దశాబ్దాలుగా ఇబ్బంది పడుతూనే వస్తున్నాను. ఇక ఈ ఉదయమే మంచు లక్ష్మి వివాదాన్ని చూశాను. ప్రముఖ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలు ఏంటో అర్థం కాలేదు. మంచు లక్ష్మి ఈ వయస్సులో ఈ డ్రెస్ లు అంటూ బాడీ షేమింగ్ చేయడం ఏంటీ? యాంకర్ సుమగారు కూడా టిఫిన్ టిఫిన్ లా భోజనంలా కాదని ఏదో సరదాగా అన్నందుకు ఫీల్ అవుతున్నారు. కానీ సెలబ్రెటీలను ఇలాంటివి ప్రశ్నించడం ఏంటి?

ఇక ప్రస్తుతం లీడ్ లో ఉన్న మా అసోసియేషన్ ను అడుగుతున్నాను. మంచు లక్ష్మిని బాడీ షేమింగ్ చేసిన వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ప్రస్తుత మా అసోసియేషన్ ఏం చేస్తుంది. మూవీ ఆర్టిస్ట్స్ ప్రెసిడెంట్ గారి సోదరికే ఇలాంటి పరిస్థితి ఉందంటే, మిగితా వారి పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులుగా మా అసోసియేషన్ ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు. ఆల్రెడీ మంచు లక్ష్మి ఫిల్మ్ చాంబర్ కు కూడా కంప్లైంట్ ఇచ్చినా మంచు విష్ణు మాత్రం ఎందుకు స్పందించడం లేదు. అసలు ఏం చేస్తున్నారు మీరు.

మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు మీరు ఉన్నారు మంచు విష్ణు, మీ సిస్టర్ గారెకే ఇలా జరిగింది. మీరు ఇంకా ఎందుకు రియాక్ట్ కావడం లేదు. మా అసోసియేషన్ ఉన్నదే మాలాంటి ఆర్టిస్ట్ లను కాపాడుకునేందుకే కదా. చిన్న ఆర్టిస్టుల పరిస్థితిని ఆలోచించాలి. ఇటీవల మార్ఫింగ్ వీడియోలతోనూ ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయంపైనా కూడా వెంటనే విష్ణు బాబు దయచేసి స్పందించాలని, న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను.. అంటూ నటి హేమ తన ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X