Drugs Case: ఈడీ అదుపులో ముమైత్ ఖాన్.. వెంటాడిన మీడియాకు ముఖం చాటేస్తూ..
డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ తారలకు ఉన్న సంబంధాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ కేసు దర్యాప్తును తిరగదోడటంతో మళ్లీ టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు ఈడీ విచారణకు హాజరకు హాజరువుతున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 15వ తేదీన ఈడీ అధికారులు ముందు శృంగారతార ముమైత్ ఖాన్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన విషయాలు ఏమిటంటే..

బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలుపై విచారణ
నాలుగేళ్ల క్రితం నాటి టాలీవుడ్ తారల డ్రగ్స్ కేసు విచారణ మరోసారి వేగవంతమైంది. మానిలాండరింగ్ కోణంలో ఈ కేసును ఈడీ విచారిస్తున్నది. అక్రమంగా నిధులను విదేశాలకు తరలించిన కోణంలో సినీ ప్రముఖులను విచారిస్తున్నది. బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన లావాదేవీలు అనుమానంగా ఉండటంతో సినీ తారలను విచారిస్తున్నారు. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్, ఆయన ఆడిటర్, రవితేజ, ఛార్మి, రానా దగ్గుబాటి, నవదీప్ తదితరులతోపాటు మొత్తం 62 మందిని విచారించాలని నిర్ణయించారు.

రకుల్ ప్రీత్, పూరీ, రానాలతో
టాలీవుడ్‌తో సంబంధమున్న డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఆగస్ట్ 31వ తేదీన, సెప్టెంబర్ 6వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8 తేదీన రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9వ తేదీన రవితేజ విచారించారు. బ్యాంకు అకౌంట్లలో అవకతవకలు, అనుమానాస్పద విషయాలపై సినీ ప్రముఖులను ప్రశ్నలు వేసి సమాచారాన్ని రాబట్టినట్టు సమాచారం.

సూట్ కేసు పట్టుకొని ముమైత్ ఖాన్
అయితే ముమైత్ ఖాన్‌కు కూడా ఈడీ అధికారులు ముందస్తుగా సమన్లు జారీ చేసి సెప్టెంబర్ 15వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరడంతో ఆమె బుధవారం ఈడీ కార్యాలయానికి వచ్చారు. తెల్లటి దుస్తులు ధరించి చేతిలో సూట్‌కేసు, ముఖానికి మాస్క్ పెట్టుకొని ఈడీ కార్యాలయానికి వచ్చింది. ముమైత్ రాకతో ఈడీ కార్యాలయం ముందు మీడియా హంగామా చేసింది. ఆమెతో మాట్లాడించడానికి మీడియా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.

వెంటాడిన మీడియా రిపోర్టర్లు
ఈడీ కార్యాలయానికి తన కార్యాలయానికి వచ్చిన ముమైత్ ఖాన్‌ను మీడియా కెమెరాలు వెంటాడాయి. ఈడీ కార్యాలయంలోకి మీడియా రిపోర్టర్లు దూసుకెళ్లారు. డ్రగ్స్ కేసు గురించి ఏదైనా మాట్లాడండి అంటూ వెంటపడ్డారు. అయితే మీడియాతో మాట్లాడకుండా ముమైత్ ఖాన్ ముఖం చాటేసింది. ఇద్దరు బాడీగార్డులు వెంట రాగా ముమైత్ ఈడీ కార్యాలయంలోని మొదటి అంతస్తుకు చకచకా వెళ్లిపోయింది.
Recommended Video

రిజస్టర్‌లో సంతకం చేసిన ముమైత్ ఖాన్
ముమైత్ ఖాన్ వెంట మీడియా రిపోర్టర్లు వెంటపడటంతో ఈడీ కార్యాలయ సిబ్బంది వారిని నియంత్రించేందుకు ప్రయత్నించింది. కార్యాలయంలోకి రాకూడదు అంటూ పదే పదే రిక్వెస్ట్ చేసినా రిపోర్టర్లు ప్రయత్నాలు ఆపలేదు. మేడమ్ మేడమ్ అంటూ ఆమెను మాట్లాడించేందుకు ప్రయత్నించారు. అయితే మీడియా వెంటాడుతుండగా మొదటి అంతస్థులోని ఈడీ విచారణ గది వద్దకు చేరుకొన్నారు.
వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని మొదటి అంతస్థులోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమె రిజిస్టర్‌లో సంతకం చేసి విచారణ గదిలోకి వెళ్లారు. అయితే ఆమె సూట్‌కేసులో ఏం తీసుకెళ్లారు? ఏదైనా డాక్యుమెంట్లు ఈడీ అధికారులు కోరారా అనే ప్రశ్నలు మీడియాలో కనిపించాయి.


Click it and Unblock the Notifications











