twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా హృదయంలో ఆయనకెప్పుడూ ప్రత్యేక స్థానమే.. పూనమ్ ట్వీట్ వైరల్

    |

    పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో ఎంత ఫేమస్ అయిందో.. పవన్ కళ్యాణ్-కత్తి మహేష్ వ్యవహారంతో అంతకు పదింతలు ఫేమస్ అయింది. అప్పటి వరకు ఫేడవుట్ భామాగ ఉన్న పూనమ్.. ఆ ఉదంతంతో సెన్సేషన్ అయింది.

    పూనమ్ ట్వీట్స్..

    పూనమ్ ట్వీట్స్..

    పూనమ్ కౌర్ చేసే ప్రతీ ట్వీట్ ఓ పజిలే. ఎవ్వరికీ అర్థం కాని విధంగా, ప్రతీ దాంట్లో ఓ నిగూఢ అర్థాన్నిచ్చేలా పూనమ్ చేసే ట్వీట్స్ ఎంతో గందరగోళంగా ఉంటుంది. బయటకు ఒకటి కనిపిస్తుంది.. లోపల ఇంకోటి కనిపిస్తుంది.. అదే పూనమ్ ట్వీట్స్ ప్రత్యేకత.

    పవన్ కళ్యాణ్ గురించే అంటూ

    పవన్ కళ్యాణ్ గురించే అంటూ

    పూనమ్ కౌర్ చేసే ప్రతీ ట్వీట్‌లో పవన్ కళ్యాణ్‌కు సంబంధించినది నిక్షిప్తంగా ఉంటుంది. అయితే స్పష్టంగా ఇది అతడి గురించే అని ఎక్కడా చెప్పదు. నెటిజన్స్ కామెంట్స్ బట్టి చూస్తే అది కచ్చితంగా అతని గురించేనని ఓ అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది.

    తనికెళ్ల భరణిపై ప్రేమను..

    తనికెళ్ల భరణిపై ప్రేమను..

    పూనమ్ కౌర్ మాట్లాడూతూ "భరణి గారికి గురు గోబింద్ సింగ్ జీ అంటే ఎంతో గౌరవం. బైసాఖి సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో చాట్ నిర్వహించాను. నా తరపున ఆయనకు ఈ కవిత వినిపించాన'ని చెప్పుకొచ్చింది.

    పూనమ్ కౌర్ రాసిన కవిత..

    ఔను....
    నేను నటుడినే.
    కానీ, నిజ జీవితంలో నటించలేకపోయాను.
    ఔను ...
    నేను ఒక కళాకారుడినే.
    కానీ, కళామతల్లి మీద
    ప్రేమ, అభిమానంతో,
    కళ విలువ తెలియకుండా
    నా దగ్గరకి వచ్చే
    ప్రతి మనిషికి నేను
    నా కళని అమ్ముకోలేకపోయాను.
    సాహిత్యం పట్ల ప్రేమతో,
    మన భారత దేశంలో ఉన్న
    సంస్కృతిని మరింతగా వికసింపచేయాలని
    ఒక చిన్న ఆశ.
    ఆ భావంతో,
    మనసు నిండా అదే ఆలోచనతో
    నేను నా ప్రతి నాటకం రాశా.
    డబ్బు గురించి మాట్లాడితే
    అవసరాలు కొన్ని, ఆశయాలు కొన్ని తీర్చుకున్నాను.
    అమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రేమతో,
    కరుణతో, మర్యాదతో వచ్చినపుడు
    శిరసు వంచి అందుకున్నాను.
    నా దగ్గరకి వచ్చిన మనిషి
    అహంభావం చూపించినా,
    నేను ప్రేమతోనే చూశాను.
    కానీ,
    నాలో ఉన్న కళా దైవాన్ని మాత్రం
    ఏరోజూ అహంతో పంచుకోలేకపోయాను.
    వెనకడుగు వేసే ప్రతి నిమిషం
    కుటుంబ అవసరాలు గుర్తుకు వచ్చేవి.
    కానీ నా స్వార్ధం కోసం
    నేను అత్యంత గౌరవాన్ని ఇచ్చే
    కళామతల్లిని నేను అమ్ముకోలేకపోయాను.
    పూజ చేశాక,
    మా ఆవిడ నా నుదిటిన పెట్టిన బొట్టుతో
    నా పాదం బాధ్యతతో బయటకు కదిలేది.
    నాకు తోడుగా ఎప్పటికీ ఉంటాను
    అని మా ఆవిడ అంటే,
    నీ సహాయం లేకుండా
    ఈ జీవితం ఎలా గడిపేది అంటాను నేను.
    పిల్లలందరిని నేను కోరుకునేది ఒకటే.
    అమ్మ అనే బంధానికి ప్రేమని పంచండి.
    నాన్న అనే పదంతో స్నేహం పెంచుకోండి.
    ఇంతకంటే ఎక్కువ ఏమీ ఆశల్లేని
    నేను.....
    మీ
    తనికెళ్ళ భరణి

    Recommended Video

    Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic
    ఎమోషనల్ అయిన పూనమ్..

    ఎమోషనల్ అయిన పూనమ్..

    తనికెళ్ల భరణి ఆత్మలోకి ప్రవేశించినట్టు పూనమ్ రాసిన కవితకు నెటిజన్ల నుంచి, సినీ ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ కవిత వైరల్ కాగా.. పూనమ్ ఎమోషనల్ అయింది. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ.. నా నుంచి వచ్చిన కవిత్వం నన్నే ఆశ్చర్య పరిచింది.. ఈ మాటలు నా నుంచి వచ్చాయంటే అమ్మ నమ్మలేకపోతోంది.. కానీ నిజంగా అది నేనే రాశాను.. సంప్రదాయాన్ని అమితంగా గౌరవించే తనికెళ్ల భరణి గారికి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.. అంటూ ఎమోషనల్ అయింది.

    English summary
    Actress Poonam Kaur Becomes Emotional On poetry about Tanikella Bharani. Actress Poonam Kaur writes poetry about Actor, Writer Tanikella Bharani.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X