అఖండ రేంజ్ ఫెర్ఫార్మెన్స్‌తో పూర్ణ.. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా సువర్ణ సుందరి
బుల్లితెర, వెండి తెర అనే తేడా లేకుండా ఆకట్టుకొంటున్న సినీ తార పూర్ణ. పెళ్లి తర్వాత కూడా ఫ్యామిలీ, ప్రొఫెషనల్ లైఫ్‌ను టాప్ రేంజ్‌లో కొనసాగిస్తున్నది. టెలివిజన్‌లో జడ్జీగా, వెండితెరపై కీలక పాత్రలను పోషిస్తున్నది. అఖండ లాంటి చిత్రంలో ఎమోషనల్ పాత్రతో అలరించిన పూర్ణ.. ప్రస్తుతం సువర్ణ సుందరి అనే ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సువర్ణ సుందరి సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..

డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం సువర్ణసుందరి. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్ఎల్ లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్దమయ్యారు.
సువర్ణ సుందరి సినిమా రిలీజ్ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ.. సువర్ణ సుందరి పునర్జన్మ కథతో ఎమోషనల్‌గా ఉండే స్క్రీన్‌ప్లేతో ప్రతీ నిమిషం థ్రిల్ ఇస్తుంది. కరోనా కారణంగా వాయిదా పడిన మా మూవీ రిలీజ్‌కు ఇదే కరెక్టు టైమ్ అని నమ్ముతున్నాం ఇటీవల వచ్చిన బింబిసార, కార్తికేయ-2, మసూదకు ఆడియన్స్ మంచి విజయాన్ని అందించారు. అదే జానర్‌లో వస్తున్న మా సువర్ణ సుందరి మూవీకి కూడా మంచి విజయాన్ని ఇస్తారనే నమ్మకంతో ఉన్నాం. అలాగే సినీ సర్కార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వీరబాబు మా సువర్ణ సుందరి మూవీని భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేశారు అని అన్నారు
నటీనటులు: జయప్రద, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, నాగినీడు, అవినాష్,సత్యప్రకాశ్ తదితరులు
సహ నిర్మాత: శ్రీకాంత్ పండుగల
సమర్పణ:డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి
నిర్మాత: ఎమ్.ఎల్. లక్ష్మీ
రచన, దర్శకత్వం: సురేంద్ర మాదారపు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫి: యెల్లుమహంతి ఈశ్వర్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
పీఆర్వో: బి. వీరబాబు


Click it and Unblock the Notifications











