శర్వా కోసం క్యారవాన్ వదిలేసిన హీరోయిన్లు.. అందరం ఇలా ఎంజాయ్ చేస్తున్నామంటూ ఆసక్తికర ట్వీట్!

లవ్లీ హీరో శర్వానంద్ చివరిగా శ్రీకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆర్గానిక్ ఫార్మింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించి లేకపోయింది.. ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మూడు ప్రాజెక్టులు ఉండగా ఆయన ఆ మూడు ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.. అయితే ఆయన చేస్తున్న రెండు ప్రాజెక్టుల మీద మాత్రం విపరీతమైన ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.. అందులో ఒక సినిమా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం. ఈ సినిమాలో శర్వానంద్ సిద్ధార్ద్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. శర్వా మొట్ట మొదటిసారి ఒక మాస్ మసాలా సినిమాలో నటిస్తూ ఉండడంతో ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక శర్వానంద్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో వీరే కాక పెద్ద స్టార్ క్యాస్ట్ ను కూడా రోప్ చేశారు. ఈ సినిమాలో సీనియర్ నటీమణులు రాధికా శరత్‌కుమార్, ఖుష్బూ మరియు ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదివారం కూడా రెస్ట్ లేకుండా ఈ సినిమా కోసం చిత్ర బృందం షూటింగ్ చేస్తోంది. అయితే ఈ సందర్భంగా రాధికా శరత్‌కుమార్ సినిమా సెట్స్ నుండి ఒక అద్భుతమైన మూమెంట్స్ పంచుకున్నారు. శర్వానంద్ తన ఇంటి నుండి తీసుకువచ్చే ఆహారాన్ని ఆస్వాదించడానికి వారు రెస్ట్ తీసుకునే కారవాన్‌లను విడిచిపెట్టామని ఆమె వెల్లడించింది.

Actresses Abandon Caravans For Sharwanands Food in Aadavallu Meeku Johaarlu shoot

ముగ్గురు సీనియర్ నటీమణులు శర్వానంద్ ఫుడ్ ను ఆస్వాదిస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, రాధికా శరత్‌కుమార్ ఇలా వ్రాసారు, "హీరో శర్వానంద్ ఆహారాన్ని తీసుకువచ్చినప్పుడు షూటింగ్‌లు సరదాగా ఉంటాయి, మేము అందరం కలిసి చుట్టూ కూర్చుని ఆ ఫుడ్ ను ఆస్వాదించడానికి కారవాన్‌లను వదిలివేస్తున్నాం అని. చెబుతూ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద కూడా శర్వానంద్ చాలా ఆశలు పెట్టుకున్నాడు పూర్తిగా ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని శర్వానంద్ భావిస్తున్నాడు.. మరి ఈ సినిమా శర్వానంద్ ఆశలను ఏ మేరకు నిజం చేస్తుంది అనేది సినిమా రిలీజ్ అయితే గాని చెప్పలేం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X