twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Adipurush సినిమాకు మరో తలనొప్పి.. రన్ టైమ్ ఎక్కువవ్వడంతో ఆ సీన్స్ తీసేయ్యక తప్పట్లేదు!

    |

    బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఎలాగైనా మరొక విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ను మరింత పెంచుకోవాలి అని చూస్తున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ ఏమి కాలేకపోయాయి. సాహో సినిమాతో పాటు రాదే శ్యామ్ రెండు కూడా తీవ్రస్థాయిలో నష్టాలను కలిగించాయి. ముఖ్యంగా రాధే శ్యామ్ అయితే కోలుకోలేని దెబ్బ కొట్టింది. దీంతో తదుపరి సినిమాతో సక్సెస్ అందుకొని ఫామ్ లోకి రావాలి అని ప్రభాస్ ఎదురు చూస్తున్నాడు.

    అయితే రామాయణం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆదిపురుష్ సినిమా మాత్రం పెద్దగా హైప్ క్రియేట్ చేయడంలో విఫలం అయింది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన పోస్టర్స్ టీజర్ ఏది కూడా అంచనాలను క్రియేట్ చేయలేకపోయింది. ముఖ్యంగా టీజర్ అయితే తీవ్రస్థాయిలో విమర్శలను అందుకుంది. ఇదొక చిన్నపిల్లల సినిమా తరహాలో గ్రాఫిక్స్ ఉన్నాయి అని ట్రోలింగ్స్ అయితే ఒక రేంజ్ లో నడిచింది.

    Adipurush movie runtime problem and director trimming work started

    అయితే ఇప్పుడు సినిమాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దెందుకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో దర్శకుడు బిజీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం సినిమా నిడివి చాలా ఎక్కువైనట్లు మరొక టాక్ వస్తోంది. సినిమా రన్ టైం 3 గంటల 16 నిమిషాలు వస్తోందట. ఇంతకుముందే కొన్ని సన్నివేశాలను తీసివేయగా ఇంకా మూడు గంటలకు పైగా రన్ టైం రావడంతో లెన్త్ ఎక్కువైంది అని ప్రభాస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు దర్శకుడు దాన్ని మరింత తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అనవసరమైన గ్రాఫిక్స్ సన్నివేశాలు తీస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా కోసం 350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యమైన గ్రాఫిక్స్ సన్నివేశాలు తీసివేస్తే కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మరి దర్శకుడు ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.

    English summary
    Adipurush movie runtime problem and director trimming work started
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X